ఒబామా ఇంటి స‌మీపంలో ఆయుధాలు..!

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన పరిపాలనలో అమెరికా సుసంపన్నంగా మారింది అని.. మళ్లీ ఆయనే అధ్యక్షుడు కావాలి అని అక్కడి ప్రజలు కోరుకున్న విషయం తెలిసిందే. కానీ కొన్ని కారణాలవల్ల అధికారం వేరొకరి చేతిలోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా అప్పట్లో కొంతమంది బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొంతమంది వ్యక్తులు .. పేలుడు పదార్థాలు మరియు ఆయుధాలతో జనవరి 6 2021న యూఎస్ కాపిటల్ లో […]

Share:

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన పరిపాలనలో అమెరికా సుసంపన్నంగా మారింది అని.. మళ్లీ ఆయనే అధ్యక్షుడు కావాలి అని అక్కడి ప్రజలు కోరుకున్న విషయం తెలిసిందే. కానీ కొన్ని కారణాలవల్ల అధికారం వేరొకరి చేతిలోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా అప్పట్లో కొంతమంది బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొంతమంది వ్యక్తులు .. పేలుడు పదార్థాలు మరియు ఆయుధాలతో జనవరి 6 2021న యూఎస్ కాపిటల్ లో తిరుగుబాటు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన నేరాల కోసం కావాల్సిన వ్యక్తిని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నివసించే వాషింగ్టన్ లోని ఆయన ఇంటి పరిసరాలలో గురువారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

టేలర్ టరాన్టో అనే వ్యక్తి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇంటికి కొన్ని అంతస్తుల దూరంలో చట్ట అమలుచేత గుర్తించబడి ఆ తర్వాత అతడు పారిపోయాడు. అయినప్పటికీ కూడా అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని రహస్యంగానే వెంబడించారు. ఇక తిరుగుబాటుకు సంబంధించిన ఆరోపణలపై టరాన్టో కి ఓపెన్ వారంటీ ఉందని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడించారు. ఇకపోతే ముందు నుంచి కొనసాగుతున్న కేసు గురించి బహిరంగంగా మాట్లాడడానికి అధికారులకు ఎటువంటి అధికారం లేదు. కాబట్టి వారు అజ్ఞాత పరిస్థితుల్లో ఉండడం కారణంగా ఇప్పుడు వారు బహిరంగంగా మాట్లాడే పరిస్థితులు లేకపోవడంతోనే రహస్య విషయాలపై అసోసియేటెడ్ ప్రెస్ తో మాట్లాడినట్లు సమాచారం.

అంతేకాదు టరాన్టో ఒక పబ్లిక్ ఫిగర్ పై కూడా సోషల్ మీడియా బెదిరింపులు చేశారని అధికారులు స్పష్టం చేశారు. ఇక పేలుడుకు సంబంధించిన పరికరాలను రూపొందించడానికి అతని వద్ద ఆయుధాలు అలాగే మందు పదార్థాలు కనుగొనబడ్డాయని అయినప్పటికీ కూడా ఆ పేలుడు పదార్థాలను అతడు ఇంకా నిర్మించలేదు అని ఒక అధికారి మీడియాతో వెల్లడించారు. ఇకపోతే టరాన్టో ను అరెస్టు చేసే సమయంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు అని.. అయితే వాషింగ్టన్ లోని తన నివాసంలో బరాక్ ఒబామా దంపతులు ఇంట్లో ఉన్నారా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు అని అధికారులు వెల్లడించారు.

ఇకపోతే మెట్రోపాలిటన్ పోలీసులు మాత్రం అతడిని పారిపోయిన వ్యక్తి అన్న ఆరోపణల పైనే అరెస్టు చేసాము అని.. ఇక పేలుడు పదార్థాల బృందం అతడి వ్యాన్ పూర్తిగా క్లీన్ చేసి ప్రజలకు ఎటువంటి బెదిరింపులు లేవు అని స్పష్టం చేసినట్లు సమాచారం.. వాస్తవానికి టరాన్టో యూఎస్ నేవీ అనుభవజ్ఞనుడు అని.. అంతేకాదు వాషింగ్టన్ రాష్ట్రంలోని ఫ్రాంక్లిన్ కౌంటిలో రిపబ్లిక్ అండ్ పార్టీకి వెబ్ మాస్టర్ గా కూడా పనిచేశారు. అంతేకాదు రిపబ్లిక్ అండ్ పార్టీకి స్వచ్ఛందంగా పనిచేస్తున్నట్లు గత ఏడాది ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను వెల్లడించారు..

ఇకపోతే 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారు మారు చేసే ప్రయత్నంలో అప్పటి ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ కిటికీలను పగలగొట్టి పోలీస్ అధికారులను కొట్టి రక్తపాతం చేసిన అల్లర్లలో టరాన్టో ఏమి చేశాడన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. వెయ్యి మందికి పైగా ఈ నేరాలపై అభియోగాలు మోపగా వీరిలో 600 మందికి పైగా నేరాన్ని అంగీకరించగా మరో వందమంది న్యాయమూర్తులు లేదా జూలీలు నిర్ణయించిన విచారణ తర్వాత దోషులుగా నిర్ధారించబడ్డారు. ఇక సగానికి పైగా ఆరు రోజుల నుండి 18 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడింది. మరి ఇప్పుడు పేలుడు పదార్థాలతో కనిపించిన టరాన్టో గురించి ఎటువంటి నిజాలు బయటపడతాయో చూడాలి.