ఏలియన్లు మన చుట్టూనే ఉన్నాయి: మిక్సీకాలో వాదన

ప్రపంచంలో చాలాచోట్ల ఏలియన్లు చూసామని, ఏలియన్లు అప్పుడప్పుడు భూమ్మీదకి వస్తున్నట్లు సమాచారం అందుతుందని.. చైనా వాళ్లు అప్పుడప్పుడు ఏలియన్లతో మాట్లాడటం జరిగిందని పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఏలియన్లకు సంబంధించి ఇటువంటి ఒక వార్త మరొకసారి వెలుగులోకి వచ్చింది. మెక్సికో కోర్టులోని కొంతమంది సభ్యులు, మనం ప్రపంచంలో ఒంటరిగా లేమని, ఏలియన్లు మన చుట్టూ ఉన్నాయని వాదనలను వినిపిస్తూ ఒక విచారణలో, ఏలియన్లకు సంబంధించిన అవశేషాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఏలియన్లు నిజంగా ఉన్నాయా?: మెక్సికన్ చట్టసభ […]

Share:

ప్రపంచంలో చాలాచోట్ల ఏలియన్లు చూసామని, ఏలియన్లు అప్పుడప్పుడు భూమ్మీదకి వస్తున్నట్లు సమాచారం అందుతుందని.. చైనా వాళ్లు అప్పుడప్పుడు ఏలియన్లతో మాట్లాడటం జరిగిందని పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఏలియన్లకు సంబంధించి ఇటువంటి ఒక వార్త మరొకసారి వెలుగులోకి వచ్చింది. మెక్సికో కోర్టులోని కొంతమంది సభ్యులు, మనం ప్రపంచంలో ఒంటరిగా లేమని, ఏలియన్లు మన చుట్టూ ఉన్నాయని వాదనలను వినిపిస్తూ ఒక విచారణలో, ఏలియన్లకు సంబంధించిన అవశేషాలను ప్రవేశపెట్టడం జరిగింది.

ఏలియన్లు నిజంగా ఉన్నాయా?:

మెక్సికన్ చట్టసభ సభ్యులు విశ్వంలో “మేము ఒంటరిగా లేము” అని సాక్ష్యాలను విన్నారు. UFOలపై లాటిన్ అమెరికన్ దేశం యొక్క మొదటి కాంగ్రెస్ ఈవెంట్‌కు సంబంధించిన ఒక విచారణలో ఏలియన్లకు సంబంధించిన అవశేషాలను ప్రవేశపెట్టడం జరిగింది. 

మెక్సికన్ జర్నలిస్ట్ మరియు దీర్ఘకాల UFO ఔత్సాహికుడు, జైమ్ మౌసాన్ గ్రహాంతరవాసుల శవాలుగా పేర్కొన్న రెండు కళాఖండాలను చూపించారు. నిజానికి అందులో ప్రవేశపెట్టిన అవశేషాలు నిజానికి భూమిపై ఏ జీవికి సంబంధించినవి కావని, మౌసాన్ చెప్పారు.

1,000 సంవత్సరాల నాటివని: 

అయితే ప్రవేశపెట్టిన అవశేషాలకు గల గుర్తులు ఈ విధంగా ఉన్నాయి..ప్రతి చేతిలో మూడు వేళ్లు, పొడుగ్గా కనిపిస్తున్న ముఖం, విచిత్రమైన స్కెలిటన్. 2017లో పురాతన నాజ్కా లైన్స్ సమీపంలో పెరూలో వీటిని స్వాధీనం చేసుకున్నట్లు మౌసన్ తెలిపారు. మెక్సికో నేషనల్ అటానమస్ యూనివర్శిటీ (UNAM) కార్బన్ డేటింగ్ ప్రాసెస్ ద్వారా పొందుపరిచిన సుమారు 1,000 సంవత్సరాల నాటివని ఆయన చెప్పారు.

నిజానికి కోర్టులో జరుగుతున్న వాదనలో ఇలాంటి సాక్ష్యాలను సమర్పించడం ఇదే తొలిసారి అని మౌసాన్ చెప్పారు. అంతేకాకుండా ఈ విశ్వంలో మనమే కాకుండా ఏలియన్స్ ఉన్నాయని ఆయన పరోక్షంగా చెప్పారు.

మెక్సికన్ నౌకాదళానికి చెందిన సైంటిఫిక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ డైరెక్టర్ జోస్ డి జీసస్ జల్సే బెనిటెజ్ మాట్లాడుతూ, అవశేషాలపై ఎక్స్-రేలు, 3-డిని ఉపయోగించి రీ క్రియేట్ చేయడం వంటివి. DNA విశ్లేషణలు కూడా జరిగాయి. అయితే ఈ పరీక్షల ద్వారా, ఈ శరీరాలకు మనుషులతో సంబంధం లేదని ధ్రువీకరణ జరిగిందని అతను చెప్పాడు.

UNAM గురువారం నాడు 2017లో మొదటిసారిగా విడుదల చేసిన ప్రకటన ద్వారా, నేషనల్ లాబొరేటరీ ఆఫ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ విత్ యాక్సిలరేటర్స్ (LEMA) చేసిన పరీక్షలు నిజానికి నమూనాల వయస్సును నిర్ణయించడానికి మాత్రమే జరిగినవి. UAPతో తన వ్యక్తిగత అనుభవం గురించి, అంతేకాకుండా ఇలాంటి విషయాల కారణంగా నిజానికికలిగే కళంకం గురించి U.S. కాంగ్రెషనల్ విచారణలో పాల్గొన్న మాజీ US నేవీ పైలట్ ర్యాన్ గ్రేవ్స్ నుండి కూడా చట్టసభ సభ్యులు విన్నారు.

ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ అధికార మొరెనా పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు సెర్గియో గుటిరెజ్ మాట్లాడుతూ, మెక్సికోలో ఇలాంటి విషయాలు గురించిన వాదన వినడం ఇదే మొదటిసారి అనే ప్రకటించారు. అంతేకాకుండా ఈ విషయాలు గురించి మరింత లోతుగా తెలుసుకోవడం తమ మీద ఉందని గుటిరెజ్ చెప్పారు.

U.S. ప్రభుత్వం UAPపై పబ్లిక్ సమాచారంపై ముఖాముఖిగా మాట్లాడడం కూడా ఇదే మొదటిసారి. పెంటగాన్ ఇటీవలి మిలటరీ ఏవియేటర్లచే నివేదించబడిన విషయాలను గురించి చురుకుగా పరిశోధిస్తోంది, అయితే UFO లను అధ్యయనం చేసే స్వతంత్ర NASA ప్యానెల్ అంతరిక్ష సంస్థచే ఇటువంటిది బయటికి రావడం ఇదే మొదటి సారి కూడా. నాసా గురువారం పరిశోధన ద్వారా బయటపడిన విషయాలను చర్చించడానికి సిద్ధంగా ఉంది. మౌసాన్ తన వాదనల కారణంగా చాలా వరకు ఎన్నో విమర్శలు ఎదుర్కోవడం జరిగింది.

సోషల్ మీడియాలో ఈ విషయాన్ని గురించి మరింత చర్చ మొదలైంది. సరైన ఆధారాలు, శాస్త్రీయ బద్దకమైన ఎవిడెన్స్ లేకుండా ఇలాంటి విషయాలు ఎలా బయటకి తీసుకువస్తారు అంటూ, ఇటువంటి విషయాలు సమాజంలో ఆందోళనను కలిగిస్తాయి అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.