G20 సమ్మిట్ సమీపిస్తున్న వేళ మోదీ బిడెన్ భేటీ

అతి త్వరలోనే జరగబోయే G20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్  చర్చలు జరపనున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. G20 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వచ్చే వారం భారత్‌కు రానున్నారని, ఈ  G20 సదస్సు సందర్భంగా సెప్టెంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారని వైట్‌హౌస్ శనివారం ప్రకటించింది. భారతదేశానికి రానున్న అమెరికా అధ్యక్షుడు:  న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9 మరియు 10 తేదీల్లో జరగనున్న G20 సమ్మిట్ […]

Share:

అతి త్వరలోనే జరగబోయే G20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్  చర్చలు జరపనున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. G20 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వచ్చే వారం భారత్‌కు రానున్నారని, ఈ  G20 సదస్సు సందర్భంగా సెప్టెంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారని వైట్‌హౌస్ శనివారం ప్రకటించింది.

భారతదేశానికి రానున్న అమెరికా అధ్యక్షుడు: 

న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9 మరియు 10 తేదీల్లో జరగనున్న G20 సమ్మిట్ కోసం అధ్యక్షత వహిస్తున్న భారతదేశం, ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇవ్వనుంది. సమ్మిట్ సందర్భంగా, G20కి నాయకత్వం వహించినందుకు భారత దేశ ప్రధాని మోదీని, అమెరికా అధ్యక్షుడు బిడెన్ ప్రశంసించారని వైట్ హౌస్ తెలిపింది.

ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం యొక్క ఆర్థిక మరియు సామాజిక ప్రభావాల గురించి కూడా భారతదేశ ప్రధానమంత్రి,  అమెరికా అధ్యక్షుడు సమావేశం కానున్నారని.. అదేవిధంగా దేశాల మీద యుద్ధం యొక్క ప్రభావాలు తగ్గించేందుకు మరియు ప్రపంచ సవాళ్లను పరిష్కరించేందుకు, పేదరికాన్ని నిర్మూలించేందుకు, ప్రపంచ బ్యాంకుతో సహా బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా, ఇరుదేశాలు మాట్లాడుకుంటాయని, వైట్ హౌస్ తెలిపింది.

G20 సమ్మిట్:

వచ్చేనెల సెప్టెంబర్ లో మన భారతదేశంలో G-20 సమ్మిట్ నిర్వహించబోతున్నారు. G-20 అంటే డెవలప్డ్ అలాగే డెవలపింగ్ దేశాల ఆర్థిక వ్యవస్థ కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సమావేశం అని చెప్పుకోవచ్చు.

ఇంచుమించు 110 దేశాల నుంచి సుమారు 12,300 మంది ప్రతినిధులు రానున్నట్లు అంచనా. ఇప్పుడు వరకు భారతదేశంలో జరిగిన సమావేశాలలో, ఇప్పుడు జరగబోయే G-20 సబ్మిట్ అనేది అతి పెద్ద సమావేశం అని చెప్పుకోవచ్చు. అయితే 2023 జూన్ లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా సందర్శించడం జరిగింది. అయితే అదే సమయంలో అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ మాట్లాడుతూ, ఆయన వచ్చే నెల సెప్టెంబర్ లో జరగబోయే G-20 సమిట్ కి హాజరు అవ్వడానికి చూస్తానని చెప్పారు.

G20 ముఖ్య ఉద్దేశాలు: 

అయితే ప్రస్తుతం సెప్టెంబర్ లో జరగబోయే G-20 సమ్మిట్ ముఖ్యంగా, మల్టీ లేటరల్ ఇన్స్టిట్యూషన్స్ అదేవిధంగా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ సంస్థలను బలోపేతం చేయడమే కాకుండా, ప్రమాదాల నుంచి సమస్యలను పాండమిక్స్ను ఈజీగా ఎదుర్కొనే విధంగా, తమ దేశాలను మరింత బలంగా మార్చుకోవడమే కాకుండా, ప్రపంచంలో ఉండే ప్రతి దేశం కూడా బలంగా మారేలా, డెవలప్డ్ కంట్రీస్ గా మారేలా ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే విషయాల మీద చర్చించడమే, G-20 సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే 2023 జూన్ లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా సందర్శించడం జరిగింది. అయితే అదే సమయంలో అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ మాట్లాడుతూ, ఆయన వచ్చే నెల సెప్టెంబర్ లో జరగబోయే G-20 సమిట్ కి హాజరు అవ్వడానికి చూస్తానని చెప్పారు. అయితే ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు బిడెన్ సెప్టెంబర్ 8న ప్రత్యేకించి నరేంద్ర మోదీతో కొన్ని చర్చలు జరపడానికి హాజరుకానున్నట్లు వైట్ హౌస్ ప్రకటించడం జరిగింది.

G20 సమ్మిట్ లో ముఖ్యంగా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కియే, UK మరియు US ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ (EU). అతిథి దేశాలు: బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్ మరియు UAE.