ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న తమిళుల భద్రతకు చర్యలు

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం భీకరంగా జరుగుతోంది. వరుస దాడులతో ఇరుదేశాల్లో పరిస్థితులు భయాంకరంగా మారాయి. ఇజ్రాయెల్‌లోని పలు నగరాల్లో ఉగ్రవాద సంస్థ హమాస్ మిలిటెంట్ల దాడులు చేయగా.. వాటిని తిప్పి కొట్టేందుకు వివాదాస్పద గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ సేనలు ప్రతిదాడులు చేస్తున్నాయి. దీంతో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. అక్కడి ప్రజలే కాదు. విదేశీ పర్యటకులు కూడా చాలా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు. గాజా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన […]

Share:

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం భీకరంగా జరుగుతోంది. వరుస దాడులతో ఇరుదేశాల్లో పరిస్థితులు భయాంకరంగా మారాయి. ఇజ్రాయెల్‌లోని పలు నగరాల్లో ఉగ్రవాద సంస్థ హమాస్ మిలిటెంట్ల దాడులు చేయగా.. వాటిని తిప్పి కొట్టేందుకు వివాదాస్పద గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ సేనలు ప్రతిదాడులు చేస్తున్నాయి. దీంతో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. అక్కడి ప్రజలే కాదు. విదేశీ పర్యటకులు కూడా చాలా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు.

గాజా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన తమిళుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రవాస తమిళుల సంక్షేమశాఖ మంత్రి సెంజి మస్తాన్‌ తెలిపారు. ఇజ్రాయేల్‌లో యుద్ధం నెలకొన్న నేపథ్యంలో తమిళులు ఆ దేశానికి పవిత్ర యాత్రకు,  విశ్వవిద్యాలయాలలో ఉన్నత చదువుల కోసం, వ్యాపార ప్రాజెక్టులు చేపట్టడం మరియు పర్యాటకులుగా సందర్శన కోసం ఇజ్రాయెల్‌కు వెళ్లారని మంగళవారం అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపింది. వారిలో కనీసం 84 మందిని గుర్తించామన్నారు.  పీహెచ్‌డీ చేసేందుకు ఇజ్రాయేల్‌ వెళ్లిన రాష్ట్రానికి చెందిన మణికంఠన్‌, దినేశ్‌ బాబు సురక్షితంగా ఉన్నట్టు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తమకు అవసరమైన సహాయాలు చేయనున్నట్టు దౌత్యాధికారులు చెప్పారని పేర్కొన్నారు. ఇజ్రాయేల్‌లోని తమిళులు ప్రవాస తమిళుల సంక్షేమ బోర్డును సంప్రదిస్తే దౌత్య కార్యాలయం ద్వారా తగిన సహాయక చర్యలు చేపట్టనున్నట్టు మంత్రి సెంజిమస్తాన్‌ తెలిపారు.

ఇప్పటివరకు 18 మంది ప్రవాస తమిళుల సంక్షేమ బోర్డును సంప్రదించారని, వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఇజ్రాయేల్‌లో చిక్కుకున్న తమిళుల గురించి చెన్నై చేపాక్కంలోని కంట్రోల్‌ రూమ్‌ని 044-28515288 నంబరు ద్వారా సంప్రదించాలని తెలిపారు. ఇజ్రాయేల్‌లో చిక్కుకున్న తమిళులు +91-87602 48625, +91-99402 56444, +91-96000 23645 నంబర్లు, nrtchennai@ tn.gov.in, nrtchennai.in @gmail.com అనే ఈ-మెయిల్‌ను సంప్రదించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో జెరుసలేం పవిత్ర యాత్రను మానుకోవడం ఉత్తమమని ప్రవాస తమిళుల సంక్షేమశాఖ హితవు పలికింది.

దాదాపు 18 వేల మందికి పైగా భారతీయులు ఇజ్రాయెల్‌లోని వివిధ పట్టణాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కొందరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే సమయంలో హైవేలపైనే చిక్కుకుపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇజ్రాయెల్‌లోని వృద్ధుల సంరక్షణ కోసం పలు ఏజెన్సీలు భారత్‌ నుంచి వందలాది మందిని నియమించుకుంటాయి. భారత్‌ నుంచి అక్కడికి వెళ్లిన వారిలో వీళ్లే ఎక్కువగా ఉంటారు.

స్వదేశానికి తీసుకొస్తాం

మరోవైపు ఇజ్రాయెల్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిణామాలను ప్రధానమంత్రి కార్యాలయం నిశితంగా గమనిస్తోందన్నారు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి. అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ప్రధాన మంత్రి, ఆయన కార్యాలయ సిబ్బంది అక్కడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఆ దేశంలో చిక్కుకుపోయిన మన విద్యార్థులను తీసుకురావడానికి  ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. గతంలోనూ విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ప్రత్యేక ఆపరేషన్ ద్వారా స్వదేశానికి తీసుకొచ్చిన విషయాన్ని మీనాక్షి లేఖి గుర్తు చేశారు. ఆపరేషన్‌ గంగ, వందేభారత్‌ తదితర ఆపరేషన్లు చేపట్టి ప్రతి ఒక్కరినీ సురక్షితంగా స్వదేశానికి  తీసుకొచ్చామన్నారు. ఇజ్రాయిల్‌ నుండి తిరిగి రావాలనుకునే భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్‌’ను ప్రారంభించిందని, ప్రస్తుతం భారత ప్రభుత్వం, ప్రధాన మంత్రి కార్యాలయం ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న విద్యార్థులతో నేరుగా టచ్‌లో ఉందని, ఎప్పటికప్పుడు పరిస్థితిని కచ్చితంగా తెలుసుకుంటోందని తెలిపారు. 

ఇజ్రాయెల్‌పై హమాస్‌ రాకెట్‌ దాడులను ఆపడం లేదు. తాజాగా స్డెరోట్‌ నగరంపై ఏకంగా 100 రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడుల్లో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు నిన్న జరిపిన దాడిలో హమాస్‌ ఎంత మంది ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకుందో గుర్తించేందుకు ఐడీఎఫ్‌ ప్రత్యేకంగా సిచ్యూవేషన్‌ రూమ్‌ను ఏర్పాటు చేశాయి. హమాస్‌ గన్‌మెన్లు నిన్న భారీగా పిల్లలు, మహిళలు, పురుషులను ఈడ్చుకొని గాజాపట్టీలోకి తీసుకెళ్లారు. ఇప్పటికే ఇజ్రాయెల్‌ రక్షణ దళాలకు సుమారు ఎంత మంది బందీలుగా ఉన్న అంశంపై కొంత అవగాహన ఉంది. కచ్చితమైన సమాచారం తెలుసుకోవాలని భావిస్తోందని ఐడీఎఫ్‌. గాజాపట్టీలో భవిష్యత్తులో తీవ్రమైన దాడులు జరుగుతాయని ఆయన హెచ్చరించారు. ఇందులో భాగంగానే గాజా సమీపంలోని ఇజ్రాయెల్‌ వాసుల నివాస ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు.