Qatar: ఖతార్ లో 8 మంది భారతీయులకు మరణ శిక్ష 

ఖతార్ (Qatar) కోర్టు (Court) ఎనిమిది మంది మాజీ భారత నౌకాదళ సిబ్బందికి మరణశిక్ష (death penalty)ను విధించింది, ఈ కేసు (Case) విషయంలో ఖతార్ (Qatar) తీసుకున్న తుది నిర్ణయానికి భారతదేశాని (India)కి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎనిమిది మంది భారతీయులను గత ఏడాది ఆగస్టులో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు చేయడం జరిగింది. అప్పటి నుండి  నిర్బంధంలో ఉన్నారు. ఈ విషయంపై భారతదేశం (India) స్పందిస్తూ, ఈ కేసు (Case)కు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నామని, అన్ని […]

Share:

ఖతార్ (Qatar) కోర్టు (Court) ఎనిమిది మంది మాజీ భారత నౌకాదళ సిబ్బందికి మరణశిక్ష (death penalty)ను విధించింది, ఈ కేసు (Case) విషయంలో ఖతార్ (Qatar) తీసుకున్న తుది నిర్ణయానికి భారతదేశాని (India)కి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎనిమిది మంది భారతీయులను గత ఏడాది ఆగస్టులో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు చేయడం జరిగింది. అప్పటి నుండి  నిర్బంధంలో ఉన్నారు. ఈ విషయంపై భారతదేశం (India) స్పందిస్తూ, ఈ కేసు (Case)కు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నామని, అన్ని చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తున్నామని ఇంతకుముందే తెలిపింది. 

8 మంది భారతీయులు:

ఆగస్ట్ 2022లో అరెస్టయిన భారత నౌకాదళ వెటరన్‌లలో, కమాండర్ పూర్ణేందు తివారీ (Commander Purnendu Tiwari), కమాండర్ సుగుణాకర్ పాకాల (Commander Sugunakar Pakala), కమాండర్ అమిత్ నాగ్‌పాల్ (Commander Amit Nagpal), కమాండర్ సంజీవ్ గుప్తా (Commander Sanjeev Gupta), కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్ (Captain Navtej Singh Gill), కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ (Captain Birendra Kumar Verma), కెప్టెన్ సౌరభ్ వశిష్ట్ (Captain Saurabh Vasisht) మరియు సెయిలర్ రాగేష్ (Sailor Rajesh Gopakumar) ఉన్నారు. మాజీ నేవీ (Navy) అధికారులందరూ ఇండియన్ నేవీ (Navy)లో 20 సంవత్సరాల పని చేసినట్లు రికార్డ్ ఉంది. ఫోర్స్‌లో ఎనిమిది మందిలో కొంతమంది ముఖ్యమైన పదవులలో ఉన్నవారు కూడా ఉన్నారు.

2019లో, కమాండర్ పూర్ణేందు తివారీ విదేశీ భారతీయులకు అందించే అత్యున్నత పురస్కారమైన ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ను అందుకున్నారు. ఆ సమయంలో దోహాలోని భారత రాయబార కార్యాలయం ఒక పోస్ట్‌లో, విదేశాలలో భారతదేశం (India) ప్రతిష్టను పెంచినందుకు కమాండర్ తివారీకి ఈ అవార్డును అందించినట్లు పేర్కొంది. 

ఎందుకు అరెస్ట్ చేశారు: 

ఆగస్ట్ 30, 2022న ఎనిమిది మంది వ్యక్తులను ఖతార్ (Qatar) గూఢచార సంస్థ అరెస్టు చేసింది. ఖతార్ (Qatar) అధికారులు గాని అదేవిధంగా, న్యూఢిల్లీ (Delhi).. భారతీయ పౌరులపై ఆరోపణలను ఇంకా బహిర్గతం చేయలేదు.. అయితే మరోపక్క నివేదికల ప్రకారం, గూఢచర్యం కోసం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఎనిమిది మంది భారతీయ నౌకాదళంలో పనిచేసే ఎక్స్పీరియన్స్ ఉన్న ఎనిమిది మంది మీద మార్చి 25న అభియోగాలు నమోదు అయ్యాయి. ఆ తర్వాత ఖతార్ (Qatar) చట్టం ప్రకారం వారిని విచారించారు. వారికి సంబంధించి వారి బెయిల్ పిటిషన్‌లు చాలాసార్లు ఖతార్ (Qatar) చట్టం తిరస్కరించడం జరిగింది. వారికి వ్యతిరేకంగా ఖతార్ (Qatar)‌లోని ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు (Court) గురువారం నాడు, ఎనిమిది మందికి మరణశిక్ష (death penalty) విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. 

భారతదేశం (India) ఈ కేసు (Case) విషయం మీద చాలాసార్లు జోక్యం చేసుకున్నప్పటికీ సరైన పురోగతికి దారి తీయలేకపోయింది. ఇటీవల ఖతార్ (Qatar) విధించిన తీర్పుపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, ఈ కేసు (Case)లో వివరణాత్మక తీర్పు కోసం ఎదురుచూస్తున్నామని మరియు అన్ని చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తున్నామని తెలిపింది. భారతీయులకు అన్ని కాన్సులర్ మరియు చట్టపరమైన సహాయాన్ని అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. భారత నేవీ (Navy) మాజీ సిబ్బంది కుటుంబాలు ఖతార్ (Qatar) ఎమిర్‌కు క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దానికి ఎలాంటి నిర్ధారణ లేదు. 

8 భారతీయులు ఖతార్ లో ఏం చేసేవారు: 

మొత్తం ఎనిమిది మంది భారతీయులు (Indians) దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ & కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే ప్రైవేట్ సంస్థలో పనిచేశారు, ఇది ఖతార్ (Qatar) సాయుధ దళాలకు శిక్షణ, అదేవిధంగా ఇతర సేవలను అందించింది. కంపెనీ రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్, రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ ఖమీస్ అల్-అజ్మీ యాజమాన్యంలో ఉంది. గత ఏడాది భారతీయులతో పాటు అజ్మీని కూడా అరెస్టు చేశారు కానీ నవంబర్ 2022లో విడుదల చేశారు.

ఇప్పుడు శిక్ష (punishment)కు అర్హులైన ఎనిమిది మంది భారతీయులు (Indians), అత్యంత సెన్సిటివ్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారని నివేదికలు పేర్కొన్నాయి. ఈ సంవత్సరం మే నెలలో, అల్ దహ్రా గ్లోబల్ దోహాలో తన కార్యకలాపాలను నిలిపి వేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడ పనిచేస్తున్న వారందరూ, ప్రధానంగా భారతీయులు (Indians) స్వదేశానికి తిరిగి వచ్చారు.