మరో ఆరు దేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్రిక్స్

జోహన్నెస్‌బర్గ్‌లోని శాండ్‌టన్ కన్వెన్షన్ సెంటర్లో 2023 బ్రిక్స్ సబ్మిట్ గాను ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. బ్రిక్స్ లో ఇప్పటికే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు మెంబర్స్ గా ఉండగా, ఈ సంవత్సరం మరో ఆరు దేశాలు బ్రిక్స్ లో జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.  మరో ఆరు దేశాలు:  ఇరాన్ ,సౌదీ అరేబియా, ఇథియోపియా, యూఏఈ, అర్జెంటుగా, ఈజిప్ట్, ఈ ఆరు దేశాలు సభ్యత్వం తీసుకుంటున్నట్లు, బ్రిక్స్ సమీట్లో మాట్లాడిన సౌత్ […]

Share:

జోహన్నెస్‌బర్గ్‌లోని శాండ్‌టన్ కన్వెన్షన్ సెంటర్లో 2023 బ్రిక్స్ సబ్మిట్ గాను ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. బ్రిక్స్ లో ఇప్పటికే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు మెంబర్స్ గా ఉండగా, ఈ సంవత్సరం మరో ఆరు దేశాలు బ్రిక్స్ లో జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. 

మరో ఆరు దేశాలు: 

ఇరాన్ ,సౌదీ అరేబియా, ఇథియోపియా, యూఏఈ, అర్జెంటుగా, ఈజిప్ట్, ఈ ఆరు దేశాలు సభ్యత్వం తీసుకుంటున్నట్లు, బ్రిక్స్ సమీట్లో మాట్లాడిన సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ఆరు దేశాల పేర్లను అనౌన్స్ చేయడం జరిగింది. అయితే 2024, జనవరి 1 నుంచి ఈ దేశాలు బ్రిక్స్ లో పాలుపంచుకొని, తమ కార్యకలాపాలను మొదలు పెట్టనున్నట్లు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ వెల్లడించారు. నరేంద్ర మోదీ సమ్మేట్ గురించి మాట్లాడుతూ బ్రిక్స్ లో మరిన్ని దేశాలు కలవడం అనేది సంతోషకరంగా ఉందని ప్రపంచాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఒక బలమైన బలగం ఏర్పడుతున్నందుకు ఆనందిస్తున్నట్లు వెల్లడించారు.

మొట్టమొదటి బ్రిక్స్ సమ్మిట్: 

బ్రిక్స్ లో భాగమైన నాలుగు దేశాల బలగం అనేది 2000ల మధ్యలో ప్రారంభమైంది. 2009లో, బ్రిక్స్ దేశాలు రష్యాలో తమ మొదటి సమావేశాన్ని నిర్వహించాయి. 2010లో దక్షిణాఫ్రికా కూడా చేరనున్నట్లు ప్రకటించింది బ్రిక్స్. ముఖ్యంగా బ్రిక్స్ లో చేరుతున్న ఆరు దేశాలకు తమ వైపు నుంచి మద్దతు ఎప్పుడు ఉంటుందని భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమిట్లో మాట్లాడుతూ పేర్కొన్నారు. 

బ్రిక్స్ లో సభ్యత్వాన్ని తీసుకున్న ఆరు దేశాలకు అభినందనలు తెలిపారు నరేంద్ర మోదీ. బ్రిక్స్ విస్తరణను భారతదేశం వ్యతిరేకించనప్పటికీ, ఏయే దేశాలు బ్రిక్స్ లో ప్రవేశించవచ్చో దానికి సంబంధించిన కొన్ని నియమాలను నిర్దేశించవలసి వచ్చింది. బ్రిక్స్‌లో చేరేందుకు 20కిపైగా దేశాలు దరఖాస్తు చేసుకున్నాయని సమ్మిట్‌కు ముందు దక్షిణాఫ్రికా అధికారులు తెలిపారు. ఆ దేశాలలో కొన్ని పేర్లు బయటికి రాగా, అందులో, క్యూబా, కొమొరోస్, బొలీవియా, అల్జీరియా మరియు ఇండోనేషియా ఉన్నాయి. 

భారత దేశ ఘనతని చాటి చెప్పిన మోదీ: 

బ్రిక్స్ సమ్మిట్ లో పాల్గొన్న నరేంద్ర మోదీ, భారతదేశం అంతట గర్వించదగ్గ ఒక విషయాన్ని వెల్లడించారు. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటలకు చంద్రుడు సౌత్ పోల్ పైన అడుగుపెట్టిన మొట్టమొదటి దేశం భారతదేశం అంటూ, ఈ మిషన్ లో తమదైన కృషిని చూపించిన శాస్త్రవేత్తలకు అభినందనలు కూడా తెలిపారు. తమ దేశం ఎవరు సాధించలేని ఘనతను సాధించి చూపించారని, ఇలాంటి మరెన్నో ప్రయోగాలు భారతదేశ నుంచి జరుగుతాయని వెల్లడించారు. చంద్రయాన్ 3 సక్సెస్ అయినందుకు బ్రిక్స్ దేశాల నుంచి కూడా అభినందనలు అందుకున్నారు మోది. 

దక్షిణ దృవంపైన మొదటి అడుగు భారత్ దేశానిదే: 

రష్యా 1960లో జరిపిన మొదటి చంద్రుడు మిషన్ ప్రయోగించిన సమయంలో, చంద్రుడు మీద నుంచి కొన్ని శాంపిల్స్ అనేవి సేకరించడం జరిగింది. అప్పట్లో ఉన్న పరిజ్ఞానంతో, చంద్రుడు మీద నీటి వనరులు ఉన్నాయో లేవో తెలుసుకోవడం కాస్త కష్టంగా మారింది. అయితే 2008లో బ్రాండ్ యూనివర్సిటీ, 1960 సంవత్సరంలో చంద్రుడు మీద కలెక్ట్ చేసిన కొన్ని శాంపిల్స్ అనేవి పరీక్ష చేశారు. పరీక్ష చేసిన తర్వాత అందులో హైడ్రోజన్ నిలువలు ఉన్నట్లు తేలింది. అంటే కచ్చితంగా చంద్రుడు మీద ముఖ్యంగా దక్షిణ ధ్రువంలో నీటి వనరులు తప్పకుండా ఉంటాయని నిర్ధారించారు. అయితే అప్పటి నుంచి చంద్రుడు మీదకు ముఖ్యంగా దక్షిణ ధ్రువం వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టాయి ప్రపంచ దేశాలు. 

ముఖ్యంగా చంద్రుడు మీద నీటి వనరులు ఉన్నట్లయితే, ఆ వనరులను ఉపయోగించుకుని మరో గ్రహం గా పిలువబడుతున్న మార్స్ ప్రయాణం సులభతరం చేసుకోవచ్చు అనేది ప్రస్తుతం పరిశోధకుల ముఖ్య ఆలోచన. చంద్రుడు సౌత్ పోల్ పైన మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన చంద్రయాన్ -3 విక్రం లాండర్, సౌత్ పోల్ కి సంబంధించిన చిత్రాలను కూడా విడుదల చేసింది.