రష్యాలో హెలికాప్టర్ కూలి 6 మంది మృతి

ఈమధ్య ఎక్కడ చూసిన మన హృదయాలను కలిచివేసే విధంగా విచారకరమైన వార్తలను వింటూనే ఉన్నాము. ఎక్కడ చూసినా ట్రైన్ యాక్సిడెంట్లు, బుస్స్ యాక్సిడెంట్లు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అసలు రోజు డైలీ న్యూస్ పేపర్ ని ముట్టుకోవాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇదే వార్తలు కనిపిస్తున్నాయి. రీసెంట్ గా రష్యాలోని సైబీరియా ప్రాంతం లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం లో ఆరుగురు మృతి చెందిన ఘటన ప్రతీ ఒక్కరి హృదయాలను కలిచివేసింది. గురువారం నాడు […]

Share:

ఈమధ్య ఎక్కడ చూసిన మన హృదయాలను కలిచివేసే విధంగా విచారకరమైన వార్తలను వింటూనే ఉన్నాము. ఎక్కడ చూసినా ట్రైన్ యాక్సిడెంట్లు, బుస్స్ యాక్సిడెంట్లు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అసలు రోజు డైలీ న్యూస్ పేపర్ ని ముట్టుకోవాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇదే వార్తలు కనిపిస్తున్నాయి. రీసెంట్ గా రష్యాలోని సైబీరియా ప్రాంతం లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం లో ఆరుగురు మృతి చెందిన ఘటన ప్రతీ ఒక్కరి హృదయాలను కలిచివేసింది. గురువారం నాడు సరదాగా ట్రిప్ కోసం గెలికాఫ్టర్ లో వెళ్తూ ల్యాండింగ్ అవుతున్న సమయం లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మొత్తం ఈ హెలికాప్టర్ లో 13 మంది ప్రయాణిస్తుండగా ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా , మిగిలిన 7 మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఈ విషయాన్నీ అధికారికంగా రష్యా అత్యవసర అధికారులు వెల్లడించారు.

ల్యాండింగ్ అవుతున్న సమయం లో విద్యుత్తు లైన్స్ కి ఢీకొనుట:

దక్షిణ సైబీరియాలోని ఆల్టై రిపబ్లిక్‌ లో ఎంఐ-8 హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్న సమాయం లో మంటలు చెలరేగి విద్యుత్తు లైన్ ని ఢీ కొట్టిందని, రష్యా అత్యవసర శాఖ  అల్టై బ్రాంచ్ తెలిపింది. ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలిపింది . ప్రమాదానికి గురైన ఛాపర్ శిధిలాలతో కూడిన ఫోటోని కూడా ఆమె షేర్ చేసింది. ఆ ఫోటోని చూస్తే ఎలాంటి వారికైనా కన్నీళ్లు రాక తప్పదు. మనకే ఇలా ఉంటే, చనిపోయిన ఆ కుటుంబ సబ్యులకు ఎంత బాధగా ఉండిఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక ఘటన కి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ హెలికాఫ్టర్ ఒక ప్రైవేట్ కంపెనీ కి సంబంధించినదిగా చెప్తున్నారు. పర్యాటకుల బృందాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం సంభవించింది అని రష్యా దేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ పేర్కొంది.

RIA నోవోస్టి నివేదిక ప్రకారం హెలికాప్టర్ లో మొత్తం 15 మంది ఉన్నారట:

ఇది ఇలా ఉండగా RIA నోవోస్టి ఇచ్చిన నివేదిక ప్రకారం హెలికాప్టర్ లో మొత్తం 12 మంది ప్రయాణికులు మరియు ముగ్గురు సిబ్బంది విమానం లో ఉన్నారు. కానీ అక్కడి ప్రభుత్వం హెలికాప్టర్ లో ఉన్నది కేవలం 13 మంది మాత్రమే అని పేర్కొంది. మరి ఈ రెండిట్లో ఏది నిజం, ఏది అబద్దం అనేది తేల్చుకోలేకపోతున్నారు. ఒకవేళ RIA నోవోస్టి ఇచ్చిన నివేదిక ప్రకారం మొత్తం 15 మంది ఉన్నట్లు అయితే మిగిలిన ఇద్దరు ఏమైనట్టు..?, ప్రమాదం నుండి తప్పించుకున్నారా..?, లేదా ల్యాండింగ్ సమయం లోనే ఎక్కడైనా లోయల్లో పడిపోయారా?, ఈ రెండు కాకుండా ప్రభుత్వమే జరిగిన వాస్తవాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుందా?, 

అలాంటి ప్రయత్నం చెయ్యడానికి అసలు ప్రభుత్వానికి ఏమి అవసరం వంటి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇద్దరిలో ఎవరిదో ఒకరి నివేదిక తప్పుడు సమాచారం అయ్యుండొచ్చు, ఉద్దేశపూర్వకంగా దాచే అవసరం ఎవరికీ లేదని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సంఘటన యావత్తు ప్రజానీకాన్ని శోక సంద్రం లో ముంచేసింది. మన దేశానికీ చెందిన వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా మన ఇండియన్స్ ఈ ప్రమాదం పై తీవ్రమైన దిగ్బ్రాంతి ని వ్యక్తి పరుస్తూ చనిపోయిన వారి ఆత్మలు శాంతి కోరుకోవాలని, వారి కుటుంబ సబ్యులకు ఆ దేవుడు కొండంత ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు. ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ మాధ్యమాలలో ఎక్కడ చూసినా ఈ ప్రార్థనలు కనిపిస్తున్నాయి. మరో పక్క తీవ్రంగా గాయపడిన 7 మందికి చికిత్స అందిస్తున్నారు. వీళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉంది.