ఫ్రాన్స్‌లో ఇండియ‌న్స్‌కి మోదీ శుభ‌వార్త‌

ఇటీవల ప్రధానమంత్రి మోదీ గురువారం నాడు రెండు రోజుల పర్యటన కోసం పారిస్ వెళ్లడం జరిగింది.  అంతేకాకుండా అక్కడ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం ఆయనకు లభించింది. స్వయానా ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ బోర్ని ఎయిర్పోర్టులో మోదీ గారిని స్వాగతించారు.  ఫ్రెంచ్ లో ఉంటున్న ఇండియన్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన మోదీ. ఫ్రాన్స్ లో మాస్టర్ డిగ్రీ చదువుతున్న వారి కోసం, వారు చదువు అనంతరం కూడా ఐదు సంవత్సరాలు ఫ్రాన్స్ లోనే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడానికి ఫైవ్ […]

Share:

ఇటీవల ప్రధానమంత్రి మోదీ గురువారం నాడు రెండు రోజుల పర్యటన కోసం పారిస్ వెళ్లడం జరిగింది.  అంతేకాకుండా అక్కడ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం ఆయనకు లభించింది. స్వయానా ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ బోర్ని ఎయిర్పోర్టులో మోదీ గారిని స్వాగతించారు. 

ఫ్రెంచ్ లో ఉంటున్న ఇండియన్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన మోదీ. ఫ్రాన్స్ లో మాస్టర్ డిగ్రీ చదువుతున్న వారి కోసం, వారు చదువు అనంతరం కూడా ఐదు సంవత్సరాలు ఫ్రాన్స్ లోనే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడానికి ఫైవ్ ఇయర్స్ లాంగ్ టర్మ్ పోస్ట్ స్టడీ వీసా అనేది కల్పిస్తున్నారు. ఇంతకుముందు ఈ వీసా రెండు సంవత్సరాలు మాత్రమే అందుబాటులో ఉండేది. 

పారిస్‌లోని ఎల్‌ఎ సీన్ మ్యూజికేల్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి చేస్తున్నా ప్రసంగంలో భాగంగా ప్రధాని మోదీ, ఫ్రాన్స్ విద్యార్థుల కోసం ఈ వీసా శుభవార్తని ప్రకటించారు. అక్కడ ప్రజల నుంచి ఆయనకు ఘనస్వాగతం కూడా లభించింది. అంతేకాకుండా, రెండు సంవత్సరాల అందుబాటులో ఉన్న టూ ఇయర్ లాంగ్ టర్మ్ వీసా ప్రస్తుతం ఫైవ్ ఇయర్స్ లాంగ్ టర్మ్ వీసా గా మారుస్తున్నట్లు ప్రకటించారు మోదీ. 

ఫ్రాన్స్- ఇండియా అనుబంధం: 

ఫ్రెంచ్ అధ్యక్షుడు అయిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ పరేడ్‌కు హాజరు కాబోతున్నారు. అంతేకాకుండా ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ, ఇది “భారతదేశం మరియు ఫ్రాన్స్‌ల మధ్య విడదీయరాని స్నేహానికి” ప్రతిబింబం అని మోదీ పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగంలో UPIలో భారతదేశ వృద్ధిని కూడా ప్రశంసించారు. ఫ్రాన్స్‌లో, భారతదేశం యొక్క UPI వినియోగం కోసం ఒక ఒప్పందం కుదిరింది అని…ఇది ఈఫిల్ టవర్ నుండి ప్రారంభమవుతుంది అని, ఇప్పుడు భారతీయ పర్యాటకులు UPI ద్వారా, ఈఫిల్ టవర్ దగ్గరలో మనీ ట్రాన్స్ఫర్ చేసే వెసులుబాటు అందుబాటులో ఉండబోతోంది అని ఆయన క్లియర్ గా వివరించారు.

భారతదేశం మరియు ఫ్రాన్స్ చాలా కాలంగా పురావస్తు మిషన్లపై కలిసికట్టుగా పనిచేస్తున్నాయని, ఈ విషయాలు నిజానికి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అని ఆయన అన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేసే మరొక రంగంగా మారబోతున్నందుకు సంతోషంగా ఉంది అని మోదీ ఫ్రాన్స్ పర్యటన కార్యక్రమంలో పేర్కొన్నారు. 

ఇటీవల జరిగిన మోదీ ఈజిప్ట్ పర్యటన: 

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తర్వాత మరో పర్యటన నిమిత్తం శనివారం ఈజిప్టు రాజధాని కైరో చేరుకున్నారు. మోదీ కైరో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, తను ఈజిప్ట్ ప్రధాని మోస్తఫా మడ్‌బౌలీ నుంచి స్వాగతం అందుకున్నారు, అంతేకాకుండా ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఇది ఒక ప్రత్యేక గౌరవాన్ని ఇవ్వడం అని తెలుస్తుంది. కైరోలోని హోటల్‌కు చేరుకున్న మోదీకి అక్కడ ఉంటున్న భారతీయాల దగ్గర నుంచి ఘన స్వాగతం అందుకున్నారు.

ఒక ఈజిప్టు మహిళ బాలీవుడ్ చిత్రం ‘షోలే’ నుండి ప్రముఖ హిందీ పాట “యే దోస్తీ హమ్ నహీ తోడేంగే” పాడుతూ చాలా చక్కగా ఆలపించింది, అమితాబ్ బచ్చన్ నటించిన షోలే మూవీలో పాడిన పాటను మోదీ చాలా చాలా శ్రద్ధగా విని “వాహ్!” అని అరుస్తూ తన ప్రశంసలను వ్యక్తం చేశారు. అంతేకాకుండా మొదటిగా చప్పట్లు కొడుతూ ప్రశంసలు అందించారు.

ఈ ఏడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఆహ్వానం మేరకు మోదీ ‘రాష్ట్ర పర్యటన’ కోసం ఈజిప్ట్ చేరుకున్నారు, నిజానికి ఈజిప్ట్ గణతంత్ర దినోత్సవం నాడు, ఆయన ఒక ముఖ్యమైన గౌరవనీయమైన ‘ముఖ్య అతిథి’.