చదువుకు ఏది అడ్డు కాదని నిరూపించిన ఆఫ్రికా యువకుడు

చదువే మనకి దారి చూపిస్తుంది అనే పదాన్ని మరొకసారి గుర్తు చేశాడు ఆఫ్రికా యువకుడు. తను ఎంతగానో కోరుకున్న యూనివర్సిటీలో చదివేందుకు ఆఫ్రికా నుంచి ప్రయాణమయ్యాడు. స్తోమత లేనప్పటికీ సైకిల్ ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. సుమారు 4,000 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం చేసి తను అనుకున్న యూనివర్సిటీకి చేరుకున్నాడు. కృషి చేస్తే మనుషులు ఋషులవుతారు:  ఈజిప్ట్ ప్రతిష్టాత్మకమైన అల్-అజార్ యూనివర్సిటీలో చదువుకునేందుకు, గినియా నుండి మమదౌ సఫాయౌ బారీ అనే యువకుడు మే నెలలో బయలుదేరాడు. ఇస్లామిస్ట్ మిలిటెంట్లు, […]

Share:

చదువే మనకి దారి చూపిస్తుంది అనే పదాన్ని మరొకసారి గుర్తు చేశాడు ఆఫ్రికా యువకుడు. తను ఎంతగానో కోరుకున్న యూనివర్సిటీలో చదివేందుకు ఆఫ్రికా నుంచి ప్రయాణమయ్యాడు. స్తోమత లేనప్పటికీ సైకిల్ ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. సుమారు 4,000 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం చేసి తను అనుకున్న యూనివర్సిటీకి చేరుకున్నాడు.

కృషి చేస్తే మనుషులు ఋషులవుతారు: 

ఈజిప్ట్ ప్రతిష్టాత్మకమైన అల్-అజార్ యూనివర్సిటీలో చదువుకునేందుకు, గినియా నుండి మమదౌ సఫాయౌ బారీ అనే యువకుడు మే నెలలో బయలుదేరాడు. ఇస్లామిస్ట్ మిలిటెంట్లు, అంతేకాకుండా ఎంతోమంది శత్రువుల చేతుల్లో నాశనం చేయబడిన దేశాలలో, 25 ఏళ్ల ఆఫ్రికన్ యువకుడు, చదువు కోసం నాలుగు నెలల పాటు సైకిల్‌పై ప్రయాణించాడు.

చివరకు కైరో చేరుకున్నప్పుడు తనకు స్కాలర్‌షిప్ లభించినందుకు “చాలా చాలా” సంతోషంగా ఉన్నానని తన సంతోషాన్ని ఎంతగానో వ్యక్తం చేశాడు. అల్-అజార్‌లో ఇస్లామిక్ స్టడీస్ కోర్సు చేయడానికి గాను.. అంతేకాకుండా ఈజిప్ట్‌కు వెళ్లే స్తోమత లేనప్పటికీ, విశ్వవిద్యాలయం చేరుకునేందుకు తాను మాలి, బుర్కినా ఫాసో, టోగో, బెనిన్, నైజర్ ఇటువంటి ప్రదేశాల మధ్యలో నుంచి ప్రయాణం చేసి, తను అనుకున్న అవకాశాలను పొందాడని 25 ఏళ్ల యువకుడి సన్నిహితులు చెప్పారు.

అవరోధాలను ఎదుర్కొంటూ ముందుకు సాగాడు: 

అల్-అజార్ ప్రపంచంలోని సున్నీ ఇస్లామిక్ కోర్స్ అందించడంలో అత్యంత ప్రభావవంతమైన కేంద్రాలలో ఒకటి. ఇది AD670 సంవత్సరంలో స్థాపించబడిన పురాతనమైన వాటిలో ఒకటి. బారీ తన ఇంటి నుండి ఇస్లామిక్ లో కోర్సు చేయడానికి బయలుదేరాడు. అంతేకాకుండా తను చేస్తున్న సైకిల్ ప్రయాణం అంతటిలోని కొన్ని దేశాలలో అనుమానాలను, అంతేకాకుండా ప్రతికూలతను ఎదుర్కొన్నాడు. మాలి, బుర్కినా ఫాసో మరియు నైజర్‌లలో, పౌరులపై ఇస్లామిక్ మిలిటెంట్ల దాడులు తరచుగా జరుగుతుంటాయి. అంతే కాకుండా ఇటీవలి తిరుగుబాట్లు రాజకీయ కోణంలో కూడా దాడులకు దారితీశాయి.

అయితే తను తిరుగుబాటుదారులు దాడులు చేసే దేశాల మధ్య ప్రయాణిస్తుండగా చాలామంది కూడా తనని తప్పుపట్టారని, తాను ఎక్కడ నుంచి వస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో అనే పలు ప్రశ్నలు ఎదుర్కొన్నాడని, ప్రయాణంలో చాలా చిక్కులు చూస్తానని చెప్పుకొచ్చాడు బారీ. ఎటువంటి కారణం లేకుండానే మూడుసార్లు అరెస్టు చేసి, తనని తెలియకుండానే నిర్బంధించారని కూడా చెప్పుకొచ్చాడు. రెండుసార్లు బుర్కినా ఫాసోలో, ఒకసారి టోగోలో తనని అరెస్టు చేశారని వెల్లడించాడు.

బారీ చాడ్ చేరుకున్నప్పుడు అతని అదృష్టం మలుపు తిరిగింది. ఒక జర్నలిస్ట్ బారీని ఇంటర్వ్యూ చేసి, అతని కథనాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు, అతని కోసం ఈజిప్ట్‌కు వెళ్లేందుకు కొంత మంది మంచి నిధులు సమకూర్చాలని కోరారు. అంతేకాకుండా తను సూడాన్ లో తను సైకిల్ తొక్కడం ఆపేసాడు. అప్పటికే అక్కడ కొన్ని ఆందోళనలు కలిగించే వాతావరణం నెలకొందని తాను చెప్పుకొచ్చాడు. 

ఎన్నో అవరోధాలను దాటుకుని, సెప్టెంబర్ 5న, అతను చివరకు కైరో చేరుకున్నాడు. అతని సంకల్పం అతనికి ఇస్లామిక్ స్టడీస్ డీన్ డాక్టర్ నహ్లా ఎల్సీడీతో సమావేశం అయ్యేలా చేసింది. బారీతో మాట్లాడిన తర్వాత, డాక్టర్ ఎల్సీడీ అతనికి పూర్తి స్కాలర్‌షిప్‌తో అల్-అజార్ ఇస్లామిక్ స్టడీస్ కోర్సులో చోటు కల్పించారు. యూనివర్శిటీ ఎప్పుడు కూడా, తన జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అందించడానికి ఆసక్తిగా ఉంటుందని, అంతేకాకుండా అల్-అజార్ అన్ని దేశాల నుండి వచ్చే విద్యార్థులను చక్కని విద్య అందించడంలో ముందు ఉంటుందని, వారిని జాగ్రత్తగా చూసుకోవడంలో ప్రాధాన్యత వహిస్తుంది అని డీన్ తన సోషల్ మీడియా ఛానెల్‌లలో చెప్పారు. అతనికి ఎంతో ఇష్టమైన యూనివర్సిటీలో అడుగుపెట్టిన బారీ స్కాలర్‌షిప్ అందుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పాడు. తాను నిజంగా ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేనని.. దేవుడికి కృతజ్ఞతలు చెప్పాను అని, అతను తన కోరిక నెరవేరినందుకు సంతోషించాడు.