అమెరికాను నాశనం చేయడానికి ఉత్తర కొరియాకు 33 నిమిషాలు చాలు.. చైనా రక్షణ శాస్త్రవేత్తలు!

బీజింగ్ లోని రక్షణ శాస్త్రవేత్తలు ఉత్తరకొరియా సైనిక సామర్థ్యాల గురించి భయంకరమైన అంచనాలు వేస్తూ ఉండడం ఇప్పుడు పలు సంచలనాలకు దారితీస్తోంది. గత కొద్దిరోజులుగా యునైటెడ్ స్టేట్స్ అమెరికా, అలాగే చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. బీజింగ్ లోని రక్షణ శాస్త్రవేత్తలు ఉత్తరకొరియా సైనిక సామర్థ్యాల గురించి భయంకరమైన అంచనాలు వేస్తూ ఉండడం ఇప్పుడు పలు సంచలనాలకు దారితీస్తోంది. తాజాగా చైనా సైనిక నిపుణులు చెబుతున్న మాటల ప్రకారం.. ఉత్తరకొరియా చాలా […]

Share:

బీజింగ్ లోని రక్షణ శాస్త్రవేత్తలు ఉత్తరకొరియా సైనిక సామర్థ్యాల గురించి భయంకరమైన అంచనాలు వేస్తూ ఉండడం ఇప్పుడు పలు సంచలనాలకు దారితీస్తోంది.

గత కొద్దిరోజులుగా యునైటెడ్ స్టేట్స్ అమెరికా, అలాగే చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. బీజింగ్ లోని రక్షణ శాస్త్రవేత్తలు ఉత్తరకొరియా సైనిక సామర్థ్యాల గురించి భయంకరమైన అంచనాలు వేస్తూ ఉండడం ఇప్పుడు పలు సంచలనాలకు దారితీస్తోంది. తాజాగా చైనా సైనిక నిపుణులు చెబుతున్న మాటల ప్రకారం.. ఉత్తరకొరియా చాలా శక్తివంతమైన బాలిస్టిక్ ని కలిగి ఉంది అని,  అది కేవలం 33 నిమిషాల్లోనే అమెరికా గడ్డపై విధ్వంసం సృష్టించగలదు అని చైనా రక్షణ దళాలు చెబుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం అమెరికా,  దక్షిణ కొరియాల మధ్య సైనిక విన్యాసాలు జరుగుతున్న తరుణంలో ఈ హెచ్చరికలు రావడంతో పాటు ఉత్తర కొరియా కూడా అమెరికాపై బెదిరింపులకు దిగింది. 

33 నిమిషాల్లో..

వాస్తవానికి ఇటీవల ఉత్తరకొరియా జపాన్ సరిహద్దు సమీపంలో ఈ బాలిస్టిక్ ని ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇది అణ్వాయుధ సామర్థ్యం గల ఆయుధం.

ఈ ఆయుధం యొక్క ఫలితాలు జపాన్ సరిహద్దుల్లో ఉన్న ప్రజలు కూడా చవిచూశారు. అమెరికా రక్షణ బలగాలు అడ్డుకోవడంలో విఫలమైతే ఉత్తర కొరియా క్షిపణి..  మధ్య అమెరికాను 1,997 క్షణాల్లో లేదా దాదాపు 33 నిమిషాల్లో చేరుకోగలదని చైనా రక్షణ నిపుణులు తెలుపుతున్నారు.

హ్వాసాంగ్ -15 క్షిపణి:

ఉత్తరకొరియా 2017 లో మొదటిసారిగా హ్వాసాంగ్ -15 క్షిపణిని ప్రయోగించినట్లు చైనీస్ భాష జర్నల్ మోడరన్ డిఫెన్స్ టెక్నాలజీలో ప్రచురించబడింది. బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కి చెందిన టాంగ్ యువన్ నేతృత్వంలో జరిగిన పరిశోధన అనంతరం బృందం ఏం చెబుతోంది అంటే.. క్షిపణి రెండు దశల అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్న ఆయుధం ఇది. ఈ ఆయుధం 13 వేల కిలోమీటర్ల ప్రభావంతమైన పరిధిని కలిగి ఉంటుంది. ఒక్కసారి ప్రయోగించామంటే యు ఎస్ మొత్తాన్ని మట్టి కురిపించడానికి ఈ క్షిపణి చాలా సమర్థవంతంగా పని చేస్తుంది అని వారు చెబుతున్నారు.

హ్వాసాంగ్ -15 క్షిపణి లక్ష్యం సెంట్రల్ అమెరికా రాష్ట్రం మిస్సౌరీలోని కొలంబియా అని చైనా స్పష్టం చేసింది.  యూఎస్ రక్షణ ప్రధాన కార్యాలయం దాదాపు 20 సెకండ్ల తర్వాత హెచ్చరికను అందుకుంటుంది. అలాగే 11 నిమిషాల్లో అలస్కాలోని ఫోర్త్ గ్రీలి నుండి మొదటి బ్యాచ్ క్షిపణులు బయలుదేరుతాయి.  ఒకవేళ మొదటి ప్రయత్నం విఫలం అయితే కాలిఫోర్నియాలోని వాంటెడ్ వర్క్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి మరోవేవ్ ఇంటర్ సెప్టర్ లను ప్రయోగిస్తారు. చైనా పరిశోధన ప్రకారం.. యుఎస్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ కూడా చైనా పరిశోధన అమెరికా మరియు చైనా మధ్య పెరుగుతున్న వివాదం నొక్కి చెబుతోంది. మరి ముఖ్యంగా ఉత్తర కొరియాకు సంబంధించి ఏదైనా వివాదం తలెత్తితే అది ప్రపంచ సంక్షోభానికి దారితీస్తుందని చైనా నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. 

అమెరికా మరింత పటిష్టమైన క్షిపని రక్షణ వ్యవస్థ కోసం ఒత్తిడి తీసుకొస్తోందని, ఒకవేళ ఇదే గనుక నిజమైతే అమెరికాపై ఉత్తరకొరియా తప్పకుండా దాడి చేస్తుంది అని చైనా రక్షణ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అమెరికా..  చైనాపై దాడికి వెనక్కి తగ్గకపోతే చైనా ఉత్తర కొరియా సహాయంతో అమెరికాను ముట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో అనే విషయం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఏది ఏమైనా ఆ దేశాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని, ఈ దేశాల మధ్య శాంతియుతం నెలకొల్పడానికి ప్రపంచ దేశాలు కూడా పాటుపడుతున్నాయి అని తెలుస్తోంది.