మొరాకోలో భారీ భూకంపం 296 మంది మృతి

భూకంపం… చాలా భయంకరమైన ప్రకృతి విపత్తు. ఇది వచ్చిందంటే చాలు సమస్తాన్ని తుడిచిపెట్టేస్తుంది. భూకంపం తీవ్రతను బట్టి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తుంటాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ విలయం వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఇక భూకంపం సంభవించిన ప్రాంతాలు కోలుకోవడానికి ఏళ్ల సమయం పడుతుంది. తాజాగా  మొరాకో దేశంలో శుక్రవారం అర్ధరాత్రి 11:11 నిమిషాలకు మొరాకోలో భారీ భూకంపం సంభవించింది.  మొరాకోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై […]

Share:

భూకంపం… చాలా భయంకరమైన ప్రకృతి విపత్తు. ఇది వచ్చిందంటే చాలు సమస్తాన్ని తుడిచిపెట్టేస్తుంది. భూకంపం తీవ్రతను బట్టి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తుంటాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ విలయం వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఇక భూకంపం సంభవించిన ప్రాంతాలు కోలుకోవడానికి ఏళ్ల సమయం పడుతుంది.

తాజాగా  మొరాకో దేశంలో శుక్రవారం అర్ధరాత్రి 11:11 నిమిషాలకు మొరాకోలో భారీ భూకంపం సంభవించింది.  మొరాకోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మొరాకోలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 296 మంది మరణించారు. 150 మందికి పైగా క్షతగాత్రులైయ్యారు. ఇప్పటికి శిధిలాలను తొలగిస్తున్నారు. దీనితో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మొరాకో భూకంపం సంభవించిన ప్రాంతంలో జనాభా ఎక్కువగా ఉంటుంది. తాజా ప్రకృతి విపత్తుతో అనేక భవనాలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. శనివారం మొరాకోలో కుంభకోణం సంభవించడంతో నివాసితులు తమ ఇళ్లను వదిలి బహిరంగ ప్రదేశాల్లో తలదాచుకున్నారు. భూకంపం కారణంగా మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

‘‘మొరాకోలో భూకంపం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధపడ్డాను. ఈ విషాద సమయంలో మొరాకో ప్రజలకు అండగా ఉంటాను మృతులకు సంతాపం, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ఈ కష్ట సమయంలో మొరాకోకు అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది’’ అని మోదీ ఎక్స్ లో పోస్టు పెట్టారు. మొరాకో నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ అండ్ అలర్ట్ నెట్‌వర్క్ రిక్టర్ స్కేల్‌పై 7గా నమోదైంది. డజన్ల కొద్దీ గాయపడినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

ప్రజలు షాపింగ్ సెంటర్, రెస్టారెంట్లు, అపార్ట్‌మెంట్ భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోసారి భూకంపం వస్తే చాలా మంది ప్రజలు భయాందోళనకు గురై బయటే ఉంటున్నారని స్థానికులు చెప్పారు. ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతులో ఈ శక్తివంతమైన భూకంపం వచ్చింది. మొరాకోలోని రాబాత్ నుంచి మరకేష్ వరకు వచ్చిన భారీ భూకంపంతో ప్రజలు వణికిపోయారు. ఈ భూకంపం వల్ల పలు భవనాలు దెబ్బతిన్నాయి. అట్లాస్ పర్వతాలలో ప్రసిద్ధి చెందిన స్కీ రిసార్ట్ అయిన ఔకైమెడెన్‌కు పశ్చిమాన 56.3 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. రాత్రివేళ వచ్చిన ఈ భారీ భూకంపంతో నిద్రపోతున్న ప్రజలు లేచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపంతో మొరాకో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా సమాచారం అందలేదు.

మానవ తప్పిదాలు

భూమి లోపల అకస్మిక కదలికల కారణంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. భూకంపం అనేది భూమి యొక్క క్రస్ట్‌లో అకస్మాత్తుగా విడుదలయ్యే స్ట్రెయిన్ ఎనర్జీ (ఒత్తిడి శక్తి). దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు షేక్ చేసే తరంగాలు ఏర్పడతాయి. క్రస్ట్ లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. రాతి పొర వాటిని పైకి రానీయకుండా చేస్తుంది. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు… బలహీన ప్రాంతాాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు భూకంపం ఏర్పడుతుంది.

భూకంపం వచ్చినప్పుడు శక్తివంతమైన తరంగాలను విడుదల అవుతాయి. వీటిని సీస్మిక్ తరంగాలు అంటారు. రాయి విసిరితే నీటిలో అలలు ఏర్పడినట్లే… భూకంప తరంగాలు భూమి లోపల, ఉపరితలంపై ప్రయాణిస్తాయి. భూకంపాలు రావడానికి మానవ తప్పిదాలు కూడా ఒక కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం, భూగర్భ జలాన్ని అధిక మొత్తంలో దుర్వినియోగం చేయడం. అడవుల్లో చెట్లను నరికివేయడం వంటి వాటి వల్ల కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఉన్న వందలాది ఘనపు మైళ్ల నీటి ఒత్తిడి భూమిపై పడడం వల్ల భూగర్భంలో మార్పులు జరిగి భూమి కంపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న సమయంలో భూమి అంతర్గత పొరల్లో సర్దుబాట్ల ఫలితమే ఈ ప్రకంపనలు జరగడానికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.