ఒక్క బ్యాంకు కోసం.. 11 బ్యాంకుల సాయం

అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ తరువాత మరికొన్ని బ్యాంకులు అదే దారిలోకి వెళతాయని వార్తలు ఊపందుకున్నాయి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ తరువాత మరికొన్ని బ్యాంకులు అదే దారిలోకి వెళతాయని వార్తలు ఊపందుకున్నాయి.  ఈ నేపథ్యంలో అమెరికాలోని 11 బడా బ్యాంకులు ఏకతాటి పైకి వచ్చాయి. మరో భారీ సంక్షోభం రాకుండా, పతనం అంచుల్లో ఉన్న  ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును ఆదుకునేందుకు 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించాయి. ఏకతాటిపైకి.. డిసెంబర్ […]

Share:

అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ తరువాత మరికొన్ని బ్యాంకులు అదే దారిలోకి వెళతాయని వార్తలు ఊపందుకున్నాయి.

అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ తరువాత మరికొన్ని బ్యాంకులు అదే దారిలోకి వెళతాయని వార్తలు ఊపందుకున్నాయి.  ఈ నేపథ్యంలో అమెరికాలోని 11 బడా బ్యాంకులు ఏకతాటి పైకి వచ్చాయి. మరో భారీ సంక్షోభం రాకుండా, పతనం అంచుల్లో ఉన్న  ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును ఆదుకునేందుకు 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించాయి.

ఏకతాటిపైకి..

డిసెంబర్ 31 నాటికి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకులో 176.4 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. కానీ.. కుప్పకూలిపోతున్న బ్యాంకులు, విశ్లేషకుల అంచనాలు, ఇతర పరిణామాలతో ఖాతాదారులు ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు నుండి వారి నగదును ఉపసంహరించుకుంటున్నారు. దీంతో సదరు బ్యాంక్ లో నగదు సమస్య ఏర్పడి బ్యాంకు దివాలా తీయచ్చనే ప్రచారం జోరుగా జరిగింది. సిలికాన్ వాలి బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనం అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. అక్కడ మరికొన్ని బ్యాంకులు అదే బాటలో ఉన్నాయని వార్తలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారాయి.

లేమన్ బ్రదర్స్ స్థాయి సంక్షోభం..

 ఐరోపాలో స్విట్జర్లాండ్ కి చెందిన క్రెడిట్ స్వీస్ బ్యాంకు కూడా ప్రమాదఘంటికలు మోగించడం వల్ల ఆందోళన తీవ్రమైంది. మరోసారి 2008 నాటి లేమన్ బ్రదర్స్ స్థాయి సంక్షోభం తలెత్తుతుందనే అనుమానాలు కూడా గట్టిగా వినిపించాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని 11 పెద్ద బ్యాంకులు ఒక తాటిపైకి వచ్చి.. ఆ భారీ సంక్షోభం రాకుండా ఉండేందుకు శ్రీకారం చుట్టాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకుకు నిధులు సమకూరుస్తున్న వాటిలో.. జేపీ మోర్గాన్ చేంజ్ బ్యాంక్, ఇండియా సిటీ గ్రూప్, యు ఎస్ బ్యాంక్, సిటీ గ్రూప్, వెల్ ఫార్గో, మోర్గాన్, స్టాన్లీ గోల్డ్, మన్ సాక్స్, బి యెన్ స్టేట్, పిఎన్సి బ్యాంకు ట్రూ ఈస్ట్, యూఎస్ బ్యాంకులన్నీ ఏకమై ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి.

అంతా బిలియనీయర్సే..

ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకులో కూడా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తరహాలో టేక్ అంకుర సంస్థల డిపాజిట్లే అధికంగా ఉన్నాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకులో అనేక మంది బిలియనీయర్సే ఖాతాదారులుగా ఉన్నారు. వారందరికీ ఈ బ్యాంకు సులభమైన షరతులతో సేవలందిస్తోంది. మెటా సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ సైతం ఈ  బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్లో తెలిపింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు షేర్ గురువారం ఓ దశలో 36 శాతం నష్టపోయింది. కానీ 30 బిలియన్ల డాలర్ల ప్యాకేజీ ప్రకటించడం వల్ల మళ్లీ పుంజుకుంది.

2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఆరంభంలోనూ బ్యాంకులు ఇలాగే ఏకతాటి పైకి వచ్చి బలహీనంగా ఉన్న బ్యాంకులను ఆదుకునేందుకు సిద్ధమయ్యాయి. అప్పట్లో కొన్ని పెద్ద పెద్ద బ్యాంకులు సంక్షోభంలోకి వెళ్లిపోబోయే బ్యాంకులను సైతం కొనుగోలు చేసి.. సంక్షోభం రాకుండా కొంతమేరకు నివారణ చర్యలు తీసుకున్నాయి. కానీ.. అప్పటికే పరిస్థితి చేయి దాటి పోవడం వల్ల సంక్షోభం అనివార్యమైంది.  ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు బ్యాంకులు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నాయి. అందులో భాగంగా ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ వల్ల మరోసారి సంక్షోభం రాకుండా ఉండేందుకు వారి వంతు సహాయాన్ని అందించాయి బ్యాంకులు.