Tax: భారత్, ఆఫ్రికా ప్రయాణికులకు ఈ దేశంలో పన్ను బాదుడు

చాలా దేశాలలో, అత్యధికంగా ప్రయాణికుల (Travellers) ద్వారానే ఆదాయం రాబడి ఉంటుందని తెలిసిన విషయమే. అయితే ప్రత్యేకించి భారతీయులకు, ఆఫ్రికా (Africa) నుంచి వెళ్లిన ప్రయాణికుల (Travellers)కు మాత్రమే ఒక దేశం విధిస్తున్న వెయ్యి డాలర్లకు పైగా టాక్స్ (Tax) బాధ తప్పట్లేదు అని తెలుస్తోంది.  భారతీయ ప్రయాణికులకు పన్ను బాదుడు:  భారతదేశం (India) నుంచి లేదా, 50 కంటే ఎక్కువ ఆఫ్రికన్ (African) దేశాల నుంచి ఒక పాస్‌పోర్ట్‌పై ప్రయాణించే వ్యక్తులు రుసుము చెల్లించవలసి ఉంటుందని […]

Share:

చాలా దేశాలలో, అత్యధికంగా ప్రయాణికుల (Travellers) ద్వారానే ఆదాయం రాబడి ఉంటుందని తెలిసిన విషయమే. అయితే ప్రత్యేకించి భారతీయులకు, ఆఫ్రికా (Africa) నుంచి వెళ్లిన ప్రయాణికుల (Travellers)కు మాత్రమే ఒక దేశం విధిస్తున్న వెయ్యి డాలర్లకు పైగా టాక్స్ (Tax) బాధ తప్పట్లేదు అని తెలుస్తోంది. 

భారతీయ ప్రయాణికులకు పన్ను బాదుడు: 

భారతదేశం (India) నుంచి లేదా, 50 కంటే ఎక్కువ ఆఫ్రికన్ (African) దేశాల నుంచి ఒక పాస్‌పోర్ట్‌పై ప్రయాణించే వ్యక్తులు రుసుము చెల్లించవలసి ఉంటుందని ఎల్ సాల్వడార్ (El Salvador) పోర్ట్ అథారిటీ అక్టోబర్ 20 నాటి తన వెబ్‌సైట్‌లో ఒక ప్రకటనలో తెలిపింది. ఆఫ్రికా (Africa) లేదా భారతదేశం (India) నుండి ప్రయాణీకులకు $1,000 టాక్స్ (Tax) రూపంలో వసూలు చేస్తోంది ఎల్ సాల్వడార్ (El Salvador). నిజానికి ఈ చర్య సెంట్రల్ అమెరికన్ (American) దేశం ద్వారా USకు అక్రమంగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్న వలసదారుల (migrants)ను అరికట్టడానికి ఒక స్పష్టమైన ప్రయత్నంలో ఒకటి అని ఆ దేశం ప్రకటించింది. 

అయితే ఆ దేశం టాక్స్ (Tax) రూపంలో సేకరించిన డబ్బుతో, దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది, అథారిటీ చెప్పడం కూడా జరిగింది. ఎల్ సాల్వడార్ (El Salvador) అధ్యక్షుడు నయీబ్ బుకెలే (Nayib Bukele), ఇటీవలే వెస్ట్రన్ హిమాస్పియర్ వ్యవహారాల US అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రియాన్ నికోల్స్‌ను కలిశారు, ఇతర అంశాలతో పాటు అక్రమంగా దేశంలోకి చొరబడుతున్న వలసదారుల (migrants) విషయాన్ని పరిష్కరించే ప్రయత్నాలు గురించి చర్చించారు. సెప్టెంబర్‌లో ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరంలో U.S. కస్టమ్స్ మరియు బోర్డర్ పెట్రోల్ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 3.2 మిలియన్ల వలసదారుల (migrants)ను ఎదుర్కొంది.

ఆఫ్రికా (Africa), ఇతర ప్రాంతాల నుండి చాలా మంది వలసదారుల (migrants) సెంట్రల్ అమెరికా మీదుగా USకి చేరుకుంటున్న వైనం కనిపిస్తోంది. ప్రభావిత దేశాల నుండి వచ్చే ప్రయాణికుల (Travellers) నుండి, VATతో సహా అదనపు ఖర్చు $1,130 మొత్తాన్ని టాక్స్ (Tax) రూపంలో వసూలు చేస్తున్నట్లు దేశం ప్రకటించింది. కొత్త రుసుము అక్టోబరు 23 నుండి అమల్లోకి వచ్చింది. దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం (Airport) మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది, అథారిటీ చెప్పడం జరిగింది. అయితే ఈ మేరకు తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఆఫ్రికా (Africa) మరియు భారతదేశం (India)లోని 57 దేశాల జాబితా నుండి వచ్చిన ప్రయాణీకుల గురించి విమానయాన సంస్థలు ప్రతిరోజూ సాల్వడోరన్ అధికారులకు తెలియజేయవలసి ఉంటుంది.

హబ్ కి సంబంధించి, అతిపెద్ద వినియోగదారులలో ఒకటైన కొలంబియన్ ఎయిర్‌లైన్ ఏవియాంకా, దేశాల జాబితా నుండి ప్రయాణీకులు (Travellers) ఎల్ సాల్వడార్ (El Salvador)‌కు వెళ్లేందుకుగాను విమానాలు ఎక్కే ముందు తప్పనిసరిగా, టాక్స్ (Tax) అనేది తప్పకుండా చెల్లించాలని ప్రయాణికుల (Travellers)కు తెలియజేయడం ప్రారంభించింది. 

ఎల్ సాల్వడార్ దేశ విశేషాలు: 

ఎల్ సాల్వడార్ (El Salvador) సాధారణంగా ” రిపబ్లిక్ ఆఫ్ ది సాల్వడార్ ” అంటారు. సెంట్రల్ అమెరికాలో ఇది అతి చిన్న, అత్యంత జనసాంధ్రత కలిగిన దేశం. ఎల్ సాల్వడోర్ దేశరాజధాని నగరం, అతిపెద్ద నగరం ” శాన్ సాల్వడార్ ” దేశజనసంఖ్య ఏడు మిలియన్లకు పై మాటే. వీరిలో యురేపియన్ మెస్టిజోలు అధికసంఖ్యలో ఉన్నారు తరువాత స్థానంలో స్థానిక అమెరికన్ (American) సంతతికి చెందినవారు ఉన్నారు. 

1892 నుండి చెలామణిలో ఉన్న ఎల్ సాల్వడార్ (El Salvador) అధికార నాణ్యం ” సాల్వడారన్ కోలాన్ ” స్థానంలో 2001 నుండి యు.ఎస్.డాలర్ చెలామణిలోకి వచ్చింది. హ్యూమన్ డెవెలెప్మెంట్ జాబితా ఆధారంగా ఎల్ సాల్వడార్ (El Salvador) లాటిన్ అమెరికన్ (American) దేశాలలో 12వ స్థానంలో ఉంది. అలాగే మద్య అమెరికా దేశాలలో 4వ స్థానంలో ఉంది. మొదటి మూడుస్థానాలలో పనామా,కోస్టారీకా, బెలిజ్ ఉన్నాయి. అయినప్పటికీ దేశం నిరంతరంగా అసమానత, దారిద్యం, అధికమౌతున్న నేరాలు వంటి సమస్యలతో బాధపడుతుంది.