Nor Gilan: ముంబై దాడుల‌ను ఇజ్రాయెల్‌పై హ‌మాస్ విధ్వంసంతో పోల్చిన రాయ‌బారి

అచ్చం హ‌మాస్ లానే అంటూజ..

Courtesy: Twitter

Share:

Nor Gilan: 2008లో ముంబైలో జ‌రిగిన ఉగ్ర దాడుల‌ను ఇజ్రాయెల్‌(Israel)పై పాల‌స్తీనా(Palestine) ఉగ్ర సంస్ధ హ‌మాస్(Hamas) అక్టోబ‌ర్ 9న చేప‌ట్టిన దాడుల‌తో దౌత్య‌వేత్త నోర్ గిల‌న్(Nor Gilan) పోల్చారు. రెండు దాడుల్లో జ‌న జీవనాన్ని ధ్వంసం చేసి ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు రేకెత్తించాల‌ని ఉగ్ర‌వాదులు(Terrorists)  కోరుకున్నార‌ని భార‌త్‌లో ఇజ్రాయెల్ రాయ‌బారి గిల‌న్(Nor Gilan)  అన్నారు.

ఉగ్ర‌వాదంపై పోరులో ఇజ్రాయెల్‌కు(Israel) భార‌త్(India) వెన్నంటి నిలిచింద‌ని చెప్పారు. ఉగ్ర‌మూక‌లు ముంబైలో(Mumbai) ప్ర‌జ‌ల ఇండ్ల‌లోకి వ‌చ్చి విధ్వంసం సృష్టించి భ‌యాన్ని రేకెత్తించారు. అదే రీతిలో ఇజ్రాయెల్‌పై(Israel) హ‌మాస్(Hamas) వ్య‌వ‌హ‌రించింది. ఉగ్ర‌వాదులు(Terrorists) ప్ర‌జ‌ల‌ను చంప‌డ‌మే కాదు బ‌తికున్న‌వారిలో భ‌యాన్ని క‌లిగించాల‌ని వారు కోరుకుంటార‌ని పేర్కొన్నారు. ప్ర‌పంచానికి స‌వాల్ విసిరిన ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కొనే విష‌యంలో చేతులు క‌ల‌పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. ప్ర‌పంచ దేశాలు, ప్ర‌జ‌లు స‌మిష్టిగా ఉగ్ర‌వాదంపై పోరాడాల‌ని అన్నారు. పాకిస్థాన్‌కు(Pakistan) చెందిన లష్కరే తోయిబా (LET)ని ఇజ్రాయెల్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత రాయబారి ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబై దాడుల‌కు ల‌ష్క‌రే తోయిబా(Lashkar Toiba) తెగ‌బ‌డిన క్ర‌మంలో గిల‌న్ (Nor Gilan) ఈ వ్యాఖ్య‌లు చేశారు.

2008లో ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమానికి ముంబై(Mumbai) విలవిల్లాడింది. కేవలం పది మంది ఉగ్రవాదులు దేశ ఆర్ధిక రాజధానిలో మరణమృదంగం సృష్టించారు. 166 మంది ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన ఇది. అది 2008 నవంబర్ 26వ తేదీ. రాత్రి మొదలైందో లేదో అప్పటికే సముద్రమార్గం ద్వారా అక్రమంగా ప్రవేశించిన 10 మంది లష్కరో తోయిబా ఉగ్రవాదులు ముంబైలోని వేర్వేరు ప్రాంతాలకు చేరుకున్నారు. ఏకకాలంలో రెండు ఫైవ్ స్టార్ హోటళ్లు, ఒక హాస్పిటల్, రైల్వే స్టేషన్, యూదుల కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దారుణకాండకు తెగబడ్డారు. ఓ భారతీయ పడవను హైజాక్ చేసి అందులో వారిని చంపేశారు. రాత్రి 8 గంటలకు కోలాబా సమీపంలోని చేపల మార్కెట్‌లో దిగిన దుండగులు రెండు బృందాలుగా విడిపోయి దాడులు ప్రారంభించారు. 

నారిమన్ హౌస్‌లోని(Nariman House) యూదుల కేంద్రం చాబాద్ హౌస్‌పై(Chabad House) దాడి చేసి అత్యాధునిక గన్లతో కాల్పులు జరిపారు. ఆ తరువాత లియోఫోర్ట్ కేఫ్(Leofort Cafe) టార్గెట్ చేశారు. విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 10 మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఓ టీమ్ దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ రైలు టెర్మినల్(Chhatrapati Shivaji Railway Terminal) చేరుకుని కాల్పులు జరిపారు. రైల్వే స్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో 58 మంది అక్కడికక్కడే మరణించారు. అక్కడ్నించి బయటికొచ్చి కామా ఆసుపత్రిలో ప్రవేశించారు. ఆసుపత్రిలో భయానక వాతావరణం సృష్టించారు. ఒబెరాయ్ హోటల్‌లో(Oberoi Hotel) ప్రవేశించి అక్కడి టూరిస్టులు ఇతరుల్ని బందీలుగా చేసుకున్నారు. మరోవైపు తాజ్ హోటల్‌లో(Taj Hotel) ఇంకో గ్రూప్ ప్రవేశించింది. ఏ మాత్రం దయలేకుండా నిర్ధాక్షిణ్యంగా జరిపిన కాల్పుల్లో 31 మంది మరణించారు. దాదాపు 60 గంటలకు పైగా ఉగ్రవాదులకు భద్రతా సిబ్బంది, ఎన్ఎస్‌జి(NSG) కమాండోలకు భారీగా ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. భద్రతా దళాలు వారిలో తొమ్మిది మందిని హతమార్చాయి మరియు పట్టుబడిన ఏకైక వ్యక్తి మహ్మద్ అజ్మల్ అమీర్ కసబ్‌(Mohammad Ajmal Amir Kasab)ను నాలుగు సంవత్సరాల తరువాత నవంబర్ 21, 2012న ఉరితీశారు.

అక్టోబర్‌ 07 రోజున, పాలస్తీనా(Palestine) సమూహం హమాస్(Hamas) భూమి, గాలి మరియు సముద్రాన్ని ఉపయోగించి ఇజ్రాయెల్‌పై(Israel) దాడి చేసింది, ఫలితంగా సుమారు 1,200 మంది మరణించారు. ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్(Israel) ఎదురుదాడిని ప్రారంభించింది, గాజాలో వైమానిక దాడులతో ప్రారంభించి, తరువాత గృహాలు మరియు ఆసుపత్రులతో సహా హమాస్(Hamas) యొక్క మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భూ కార్యకలాపాలను నిర్వహించింది. దాదాపు 14,000 మంది ప్రాణనష్టంతో దాదాపు రెండు నెలల పాటు వివాదం కొనసాగింది. ఇజ్రాయెల్ మరియు హమాస్ ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత నాలుగు రోజుల పోరాటం ప్రారంభమైంది. ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ బందీలను విడుదల చేస్తుంది. సంధి ప్రారంభమైనప్పటి నుండి, హమాస్ 41 మందిని విడుదల చేసింది మరియు ఇజ్రాయెల్ 39 మంది పాలస్తీనియన్లను విడుదల చేసింది.