Al-Shifa Hospital: శ్మశానంగా గాజా ఆస్పత్రి..

179 మృతదేహాల సామూహిక ఖననం..!

Courtesy: Twitter

Share:

Al-Shifa Hospital: గాజాలో(Gaza) అతిపెద్ద ఆస్పత్రి ‘అల్‌-షిఫా ఆస్పత్రి’(Al-Shifa Hospital) ప్రాంగణంలో 179 మంది మృతులను సామూహికంగా ఖననం(Mass burial) చేసినట్లు హాస్పిటల్‌ డైరెక్టర్ మహమ్మద్‌ అబు సల్మియా(Muhammad Abu Salmiya) వెల్లడించారు.

ఇజ్రాయెల్‌- హమాస్‌ల యుద్ధం (Israel Hamas Conflict)తో గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇక్కడి ఆస్పత్రులకు విద్యుత్‌, ఔషధాల సరఫరాలు నిలిచిపోవడంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజా(Gaza)లోనే అతిపెద్దదైన అల్‌-షిఫా ఆస్పత్రి (Al Shifa Hospital)లో పరిస్థితి దయనీయంగా మారింది. పసిబిడ్డలు సహా 179 మంది మృతులను ఇక్కడి ప్రాంగణంలోనే సామూహికంగా ఖననం చేశామని ఆస్పత్రి డైరెక్టర్ మహమ్మద్‌ అబు సల్మియా(Muhammad Abu Salmiya) వెల్లడించినట్లు కొన్ని వార్తాసంస్థలు తెలిపాయి. 

ఇంధనం నిండుకోవడంతో ఏడుగురు శిశువులు, 29 మంది ఐసీయూ రోగులు మృతి చెందినట్లు సల్మియా చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో మృతులను సామూహికంగా ఖననం(Mass burial) చేయాల్సి వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే ఏడుగురు చిన్న పిల్లల‍్ని ఒకే కార్పెట్‌లో చుట్టి సమాధి చేసిన ఫొటోను ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం ప్రపంచ దేశాలను తీవ్ర కన్నీళ్లు పెట్టించేలా ఉంది. ఎక్కడికక్కడ కుళ్లిపోతోన్న మృతదేహాలతో ఈ హాస్పిటల్‌ దాదాపు శ్మశానవాటికగా మారిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. 

‘మాకు కరెంటు(Electricity) లేదు. నీళ్లు(Water) లేవు. తిండి(Food) లేదు. ఇక్కడి పరిస్థితులు అమానవీయంగా మారాయి’ అని ఆస్పత్రిలో(Hospital) విధులు నిర్వహిస్తోన్న ‘డాక్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌’(Doctors Without Borders)కు చెందిన ఓ సర్జన్‌ వాపోయారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి ప్రాంగణంలో అమానవీయ ఘటనలు జరుగుతున్నాయని డాక్టర్లు తెలిపారు. శవాలు కుళ్లిపోయి..ఆ ప్రాంతం మొత్తం దుర్గంధం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

గాజా(Gaza)లోని మొత్తం 36 ఆస్పత్రుల్లో ప్రస్తుతం 22 మూతబడినట్లు డబ్ల్యూహెచ్‌వో(WHO) వెల్లడించింది. మిగిలిన 14 దవాఖానాల్లోనూ అవసరమైన సామగ్రి అందుబాటులో లేదని చెప్పింది. ఇదిలా ఉండగా.. ఆస్పత్రుల నుంచే హమాస్‌ తమ కమాండ్‌ సెంటర్లను నిర్వహిస్తోందని ఇజ్రాయెల్‌(Israel) ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి ‘అల్‌-షిఫా’ను ఇజ్రాయెల్‌ దళాలు చుట్టుముట్టాయి. ఇక్కడి పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్‌ తక్షణమే కాల్పుల విరమణ(ceasefire) చేపట్టాలని డబ్ల్యూహెచ్‌వో(WHO) కోరింది.

గాజాలో ఉన్న అతి పెద్ద ఆస్పత్రి అయిన అల్‌ షిఫా ఆస్పత్రిని(Al Shifa Hospital) అడ్డుగా పెట్టుకొని హమాస్(Hamas) ఉగ్రవాదులు తమను రక్షించుకుంటున్నారని ఇజ్రాయెల్‌ సైన్యం ఆరోపించింది. దీంతో ఆ ఆస్పత్రిని మొత్తాన్ని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైనికులు.. దాన్ని దిగ్భందించారు. ఈ క్రమంలోనే గత వారం 72 గంటల పాటు అల్‌ షిఫా ఆస్పత్రికి(Al Shifa Hospital) కరెంట్, నీరు, ఆహారం సరఫరా చేయకుండా నిలిపివేసింది. బయట నుంచి ఇజ్రాయెల్ సైనికులు భీకరమైన కాల్పులు చేయడంతో ఆస్పత్రి చుట్టూ భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తప్పని పరిస్థితుల్లో ఆస్పత్రి ప్రాంగణంలోనే చనిపోయిన వారిని ఖననం చేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు.

ఇజ్రాయెల్ శాంతి కార్యకర్త వివియన్ సిల్వర్(Vivian Silver).. హమాస్‌ దాడుల్లో మృతి చెందారు. పాలస్తీనీయన్లతో శాంతి సయోధ్య కోసం ఆమె తన జీవితాన్ని ధారపోశారు. అక్టోబరు 7న హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి చొరబడి జరిపిన దాడుల్లో ఆమె మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ ధ్రువీకరించింది. తొలుత హమాస్‌ ఉగ్రవాదులు ఆమెను బందీగా చేసుకుని ఉంటారని భావించినప్పటికీ.. ఓ కాలిపోయిన మృతదేహం అవశేషాలను పరీక్షించగా సిల్వర్‌గా తేలారు. ఆమె కుటుంబ సభ్యులకు ఈమేరకు సమాచారం అందించారు. కెనడాలో జన్మించిన సిల్వర్‌.. 1970ల్లో ఇజ్రాయెల్‌ వచ్చి, ఇక్కడే స్థిరపడ్డారు. ఇజ్రాయెల్‌, పాలస్తీనాల మధ్య శాంతిని పెంపొందించేందుకు ప్రయత్నించిన ప్రముఖుల్లో ఒకరు. వైద్య సంరక్షణ కోసం గాజాలోని క్యాన్సర్ రోగులను ఇజ్రాయెల్ ఆసుపత్రులకు తరలించిన బృందంతో కలిసి ఆమె స్వచ్ఛందంగా పనిచేశారు.