జ్విగాటో సినిమా రివ్యూ.. కపిల్ శర్మ మెప్పించాడా?

కపిల్ శర్మ, షాహన గోస్వామి జంటగా నటించిన చిత్రం జ్విగాటో.. నిరుద్యోగ పరిస్థితి అనే చక్కటి అంశాన్ని ఎంచుకొని డైరెక్టర్ నందితాదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.  జ్విగాటో సినిమా రివ్యూ తో పాటు కపిల్ శర్మ ఏ మేరకు మెప్పించాడో చూద్దాం. కపిల్ శర్మ, షాహన గోస్వామి జంటగా నటించిన చిత్రం జ్విగాటో.. నిరుద్యోగ పరిస్థితి అనే చక్కటి అంశాన్ని ఎంచుకొని డైరెక్టర్ నందితాదాస్ ఈ […]

Share:

కపిల్ శర్మ, షాహన గోస్వామి జంటగా నటించిన చిత్రం జ్విగాటో.. నిరుద్యోగ పరిస్థితి అనే చక్కటి అంశాన్ని ఎంచుకొని డైరెక్టర్ నందితాదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.  జ్విగాటో సినిమా రివ్యూ తో పాటు కపిల్ శర్మ ఏ మేరకు మెప్పించాడో చూద్దాం.

కపిల్ శర్మ, షాహన గోస్వామి జంటగా నటించిన చిత్రం జ్విగాటో.. నిరుద్యోగ పరిస్థితి అనే చక్కటి అంశాన్ని ఎంచుకొని డైరెక్టర్ నందితాదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా.. బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.  జ్విగాటో సినిమా రివ్యూ తో పాటు కపిల్ శర్మ ఏ మేరకు మెప్పించాడో మనమిప్పుడు చూద్దాం.

కథ: 

ఫ్లోర్ మేనేజర్‌గా పని చేస్తున్న మానస్ మాహ్టో (కపిల్ శర్మ) అర్ధాంతరంగా ఆ జాబ్‌ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత అతను జెవిగాటో డెలివరీ బాయ్‌గా ఉద్యోగంలో చేరతాడు. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోసం మానస్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. షాహన గోస్వామి తనకు అండగా నిలిచిందా, లేదంటే మరింత ఇబ్బంది పెట్టిందా అనేది తెలియాలంటే.. కచ్చితంగా ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో నిరుద్యోగ పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు చూపించాడు కపిల్ శర్మ. గిగ్ ఎకానమీ డౌన్ అవుతున్న సమయంలో.. ఉద్యోగులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, వారి చేదు అనుభవాలను ఈ చిత్రం ద్వారా తెలిపే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ చిత్రంలో కపిల్ శర్మ కి భార్యగా షాహనా గోస్వామి నటించింది. కపిల్ శర్మకు దీటుగా షాహనా నటించింది. 

భర్తగా మానస్ ఇంటి బాధ్యతలను భుజానికి ఎత్తుకుంటే, ఇంట్లోని బాగోగులను షాహనా నిర్వర్తించింది. మానస్ ఫుడ్ డెలివరీ బాయ్ గా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన సమయానికి అందించడంతోపాటు కస్టమర్ల విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మానస్ ఉదయం వెళ్ళేటప్పుడే షాహన క్యారేజ్ కట్టి పంపిస్తుంది. అతను వెళ్ళిన దగ్గర నుంచి తన ఇద్దరు పిల్లలతో పాటు.. తన అత్తమామలను కూడా తనే దగ్గరుండి చూసుకుంటుంది. ఇక వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ అత్తయ్య.. యూరినరీ సమస్యల కారణంగా ఆమె ఇంట్లోనే మూత్రానికి వెళ్ళిపోతుంది. ఆవిడ సేవలను కూడా నవ్వుతూ చేస్తుంది షాహన. భర్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భార్య ఎంత అనుకూలంగా ఉండాలో.. ఇంట్లో నుంచి ఏ చిన్న సమస్య తనకు ఇబ్బంది కలగకుండా ఎలా చూసుకోవాలో చూపించడంతో షాహన నటనకి మంచి మార్కులే పడ్డాయి.

ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్న మానస్ పై ఓ కస్టమర్ కంప్లైంట్ ఇస్తాడు. ఆ సమయంలో మానస్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తన కంపెనీ యాజమాన్యం అతనిపై ఏ విధంగా ప్రవర్తించారు. మానస్ ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలిపే సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. మొదటి హాఫ్ స్లోగా నడిచినా.. సెకండ్ హాఫ్ లో కూడా కాస్త సాగదీత కనిపిస్తుంది. మధ్య మధ్యలో కొన్ని అనవసరపు సన్నివేశాలు కూడా ఉంటాయి.  కథనం బాగానే ఉన్నా.. నేరేషన్ లో కాస్త తడబడ్డాడు దర్శకుడు. మొత్తానికి ఈ సినిమా పర్వాలేదు.. చూడొచ్చు అనే టాక్ అయితే వచ్చింది.

ఫైనల్ గా.. ఈ సినిమాలో కొన్ని అంశాలు మనసుకి హత్తుకుంటాయి. మరికొన్ని అనవసర సాగదీత సన్నివేశాలు కూడా ఉంటాయి. ఈ చిత్రాన్ని థియేటర్ కి వెళ్లి చూడవలసిన అంత కంటెంట్ అయితే లేదు. ఓటీటీ లోకి వస్తే మాత్రం తప్పకుండా చూడొచ్చు.