Rashmika: రష్మిక డీప్ ఫేక్ వీడియోపై జరా పటేల్ స్పందనిదే

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన్నా గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీలోకి వచ్చి కొద్ది రోజులే అయినా కానీ అమ్మడు తనదైన యాక్టింగ్ తో అందర్నీ ఇట్టే కట్టి పడేసింది. ఇక పోయినేడాది వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప (Pushpa)తో ఈ బ్యూటీ చాలా మందికి పరిచయం అయింది. ఎవరైనా తెలియని వారు కూడా పుష్ప దెబ్బతో రష్మిక (Rashmika)ను గుర్తుంచుకున్నారు. అందులోని పాటలు హిట్ అవడమే కాదు.. చాలా పాటలు […]

Share:

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన్నా గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీలోకి వచ్చి కొద్ది రోజులే అయినా కానీ అమ్మడు తనదైన యాక్టింగ్ తో అందర్నీ ఇట్టే కట్టి పడేసింది. ఇక పోయినేడాది వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప (Pushpa)తో ఈ బ్యూటీ చాలా మందికి పరిచయం అయింది. ఎవరైనా తెలియని వారు కూడా పుష్ప దెబ్బతో రష్మిక (Rashmika)ను గుర్తుంచుకున్నారు. అందులోని పాటలు హిట్ అవడమే కాదు.. చాలా పాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఆ మూవీకి నేషనల్ అవార్డు రావడంతో అంతా రష్మికకు ఫ్యాన్స్ లా మారిపోయారు. అందులో శ్రీ వల్లి అని రష్మిక(Rashmika) పోషించిన పాత్ర అయితే నెక్ట్స్ లెవెల్. రష్మిక శ్రీవల్లి క్యారెక్టర్ ను ఆ క్యారెక్టర్ చేసిన హంగామా ఎవరూ అంత తొందరగా మర్చిపోలేరు. అంతలా పాపులారిటీ సాధించిన రష్మిక పలు బాలీవుడ్ ఆఫర్లను కూడా చేజిక్కించుకుంది. నేషనల్ క్రష్ గా ఓ వెలుగు వెలుగుతున్న రష్మిక (Rashmika) జీవితంలో సడెన్ గా కుదుపు వచ్చింది. 

డిస్ట్రబ్ చేసిన డీప్ ఫేక్ వీడియో.. 

కొద్ది రోజుల నుంచి రష్మిక (Rashmika)కు  చెందిన డీప్ ఫేక్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అసలు ఆ వీడియో రష్మిక (Rashmika)ది కాకపోయినా కొంత మంది కేటుగాళ్లు టెక్నాలజీ సాయంతో ఆ వీడియోలోని వ్యక్తి ఫేస్ కు బదులు రష్మిక ఫేస్ ను జోడించారు. ఆ వీడియో చాలా హాట్ గా ఉండడంతో వెంటనే వైరల్ అయింది. అసలు రష్మిక (Rashmika) ఏంటి ఇలా ప్రవర్తించడం ఏంటని వీడియో చూసిన చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే అందులో ఉన్నది రష్మిక (Rashmika) కాదని గుర్తించారు. (కొన్ని స్ఫష్టమైన తేడాలు) ఇక అది ఫేక్ వీడియో అని తేల్చేశారు. కానీ ఈ ఘటన ఒక్కసారిగా యావత్ సినీ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. అసలు ఒక వ్యక్తి గురించి మరీ ఇంతలా ఎలా మార్ఫ్ చేస్తారని అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. రష్మికకు తమ సంఘీభావాన్ని ప్రకటించడం షురూ చేశారు. ఈ ఘటన మీద కేంద్ర హోం శాఖ (Home ministry) కూడా సీరియస్ అయింది. 

స్పందించిన జరా పటేల్ 

ఈ వీడియో బ్రిటీష్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన జరా పటేల్ (Jara Patel) అనే మహిళదని తేలింది. జరా పటేల్ (Jara Patel) హాట్ పోజులో వీడియోను అప్ లోడ్ చేయగా.. కొంత మంది కేటుగాళ్లు జరా పటేల్ (Jara Patel) స్థానంలో రష్మిక  (Rashmika)ఫేస్ ను మార్చారు. ఇందుకు సంబంధించిన ఒరిజినల్ వీడియో అక్టోబర్ 9వ తేదీన జరా పటేల్ (Jara Patel) షేర్ చేసింది. కేటుగాళ్లు నింపాదిగా నెల రోజుల తర్వాత రష్మిక (Rashmika)కు ఆ వీడియోను ఆపాదించారు. ఈ డీప్ ఫేక్ వీడియోపై జరా పటేల్ (Jara Patel) స్పందించింది. ఇటువంటి సంఘటనలతో తాను డిస్టర్బ్ (Disturb) అవుతున్నానని మరియు ఇంటర్నెట్‌ (Internet)లో చూసే ప్రతిదాన్ని నమ్మవద్దని ప్రతి ఒక్కరినీ కోరారు. ఆమె ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాలో ఈ విధంగా రాసుకొచ్చారు. నా శరీరానికి ప్రముఖ బాలీవుడ్ నటి రష్మిక (Rashmika) ముఖాన్ని ఉపయోగించి ఎవరో డీప్‌ ఫేక్ వీడియోను రూపొందించారని నా దృష్టికి వచ్చింది. డీప్‌ ఫేక్ వీడియోతో నాకు ఎలాంటి సంబంధం లేదు మరియు జరుగుతున్న దానితో నేను తీవ్ర కలత చెందాను అని వెల్లడించింది. మహిళలు మరియు బాలికల (Child) భవిష్యత్తు గురించి నేను ఆందోళన చెందుతున్నానని తెలిపింది. ఇప్పుడు ఏవైనా ఫొటోలు సోషల్ మీడియా (Social Media)లో ఉంచాలంటే మరింత భయం వేస్తుందని వెల్లడించింది. మీరు ఇంటర్నెట్ లో చూసేవాటిని వాస్తవంగా ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయండని అభ్యర్థించింది.  ఇంటర్నెట్‌ (Internet)లో ఉన్నవన్నీ నిజమైనవి కావని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లెజండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachan) కూడా ఈ డీప్‌ ఫేక్ వీడియో పై స్పందించారు. ఇటువంటి ఘటనలపై చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ప్రకటన విడుదల చేసిన రష్మిక

అమితాబ్ బచ్చన్ స్పందించిన తర్వాత కొన్ని గంటలకు రష్మిక (Rashmika) కూడా.. ఇదే విషయమై ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలా చెప్పడం నాకు చాలా బాధగా ఉందని, మరియు ఆన్‌ లైన్‌ లో వ్యాప్తి చెందుతున్న నా డీప్‌ ఫేక్ (Dedp Fake) వీడియో గురించి మాట్లాడాల్సి రావడం దురదృష్టం అని వెల్లడించింది. ఇలా ఎవరైతే టెక్నాలజీ (Technology)ని దుర్వినియోగం చేస్తున్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. వారు ఈ రోజు చాలా హాని కలిగించే వారిగా తయారయ్యారని చెప్పుకొచ్చింది. మనలో ప్రతి ఒక్కరికి దీని వల్ల చాలా భయంగా ఉందని తెలిపింది. 

ఒక మహిళగా మరియు నటి (Actor)గా, నాకు రక్షణ మరియు మద్దతు వ్యవస్థగా ఉన్న నా కుటుంబం, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులకు నేను కృతజ్ఞతలు చెబుతున్నానని వెల్లడించింది. నేను స్కూల్లో లేదా కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఇలా జరిగితే, నేను దీన్ని ఎలా ఎదుర్కోగలనో నిజంగా ఊహించలేనని వెల్లడించింది. రష్మిక (Rashmika)కు బాలీవుడ్ (Bollywood) నుంచి అనే కాకుండా అనేక ఇండస్ట్రీల నుంచి అనేక మంది ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలా డీప్ ఫేక్ వీడియోను షేర్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.