Salaar రిలీజ్.. థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చూస్తే మతి పోతుంది

చాలా రోజుల పాటు సరైన హిట్ లేక నిరాశలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కొత్త సినిమా Salaar ఆ లోటును తీర్చేస్తుందని ధీమాగా ఉన్నారు. గురువారం అర్ధరాత్రి సినిమా థియేటర్లలో విడుదల కావడంతో ఫ్యాన్స్ భారీ ఫ్లెక్సీలు, కటౌట్లతో సందడి మొదలు పెట్టారు. దేశవ్యాప్తంగా తమ అభిమాన నాయకుడి సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుందని ఎంజాయ్ చేస్తున్నారు.

Courtesy: x

Share:

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన Salaar మూవీ శుక్రవారం భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైంది. దీంతో థియేటర్లలో యంగ్ రెబల్ స్టార్ అభిమానుల హడావుడి మామూలుగా లేదు. చాలా రోజుల పాటు సరైన హిట్ లేక నిరాశలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కొత్త సినిమా Salaar ఆ లోటును తీర్చేస్తుందని ధీమాగా ఉన్నారు. గురువారం అర్ధరాత్రి సినిమా థియేటర్లలో విడుదల కావడంతో ఫ్యాన్స్ భారీ ఫ్లెక్సీలు, కటౌట్లతో సందడి మొదలు పెట్టారు. దేశవ్యాప్తంగా తమ అభిమాన నాయకుడి సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుందని ఎంజాయ్ చేస్తున్నారు. 

ఈ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. సలార్ విడుదల సందర్భంగా థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద బాణసంచా పేలుస్తూ, ప్రభాస్ భారీ కటౌట్స్‌కు పాలాభిషేకాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు.


బాహుబలి రికార్డులు బద్దలయ్యేనా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టి చాలా రోజులు కావడంతో  ప్రేక్షకులందరూ ఇప్పుడు ఆయన భారీ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. చివరిగా బాహుబలి 2 బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేసింది. ఆ తర్వాత అంతటి విజయాన్ని ప్రభాస్ ఇప్పటి వరకు అందుకోక పోవడం గమనార్హం. ఇప్పుడు సలార్ మూవీతో ప్రభాస్ అభిమానుల ఆకలి తీరుతుందా లేదా అనేది చూడాలి. కానీ ప్రస్తుతానికి అడ్వాన్స్ సేల్స్ బుకింగ్ పరిస్థితి చూస్తుంటే బాహుబలి 2 రికార్డులు సలార్ తో బద్దలు అవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. బుధవారం రాత్రి వరకే దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు హోంబలే సంస్థ ట్విటర్ లో వెల్లడించింది. 


ఇప్పటికే టికెట్ల బుకింగ్ యాప్ క్రాష్ అయిన సంగతి తెలిసిందే
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ విడుదల సందర్భంగా టికెట్ల కోసం ఫ్యాన్స్ క్రేజ్ చూస్తే మతి పోవాల్సిందే. గత మంగళవారం టికెట్లను ఆన్లైన్ లో అందుబాటులోకి తెచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్, సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేశాయి. దీంతో టికెట్లను దక్కించుకునేందుకు తీవ్రమైన పోటీ నెలకొంది. మంగళవారం రాత్రి 8.24 గంటలకు ఫ్యాన్స్ అందరూ బుక్ మై షో యాప్ లో వెయిటింగ్ లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో టికెట్స్ ఇలా ఓపెన్ చేయడమే ఆలస్యం జనాలు బుక్ మై షో యాప్ లో భారీగా బుకింగ్స్ చేసుకున్నారు.


టికెట్లు విడుదల చేసిన వెంటనే ఒక్కసారిగా లక్షలాది మంది ఓపెన్ చేయడంతో బుక్ మై షో యాప్ కాసేపు పని చేయలేదు. యూజర్ల తాకిడి ఎక్కువ కావడంతో యాప్ క్రాష్ అయ్యింది. యాప్ క్రాష్ కావడంతో కాసేపు బ్రేక్ ఇచ్చిన బుక్ మై షో, ఆ తర్వాత అన్ని థియేటర్ల టికెట్స్ ఒకేసారి అప్లోడ్ చేయకుండా నెమ్మదిగా ఒక్కో థియేటర్ బుకింగ్స్ ఓపెన్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత బుక్ మై షో క్రాష్ అయిన ఫొటోలు స్క్రీన్ షాట్స్ తీసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడం స్టార్ట్ చేశారు​. దీన్ని బట్టి చెప్పొచ్చు ప్రభాస్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నారనేది.