ఏంటమ్మా.. ఏంటమ్మా సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులేసిన సల్మాన్ ఖాన్ – వెంకటేష్ – రామ్ చరణ్

ఈ వీడియో సాంగ్ పై రామ్ చరణ్ కూడా స్పందించారు. ఆన్ స్క్రీన్ పై విలువైన సీన్లలో ఇది ఒకటి అంటూ ఈ పాటను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్.. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో […]

Share:

ఈ వీడియో సాంగ్ పై రామ్ చరణ్ కూడా స్పందించారు. ఆన్ స్క్రీన్ పై విలువైన సీన్లలో ఇది ఒకటి అంటూ ఈ పాటను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్.. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన బతుకమ్మ పాట కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కాగా ఈ చిత్రం నుంచి మరో పాట ఏంటమ్మా అనే మరో సింగిల్ ను ఏప్రిల్ 4 నా విడుదల చేశారు..  

 1 మిలియన్ వ్యూస్..

తాజాగా ‘ఏంటమ్మా.. ఏంటమ్మా’ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ కు షబ్బీర్ అహ్మద్ హిందీ, తెలుగు భాషలో మిక్స్డ్ గా లిరిక్స్‌ అందించారు. పాటకు పాయల్ దేవ్ క్యాచీ ట్యూన్ కంపోజ్ చేశారు. విశాల్ దద్లానీ, పాయల్ దేవ్ అద్భుతంగా  ఆలపించారు. రాఫ్తార్ ర్యాప్ మ్యూజిక్ ను రాసి పాడారు. ప్రస్తుతం ఈసాంగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం 1 మిలియన్ వ్యూస్ వైపు పరిగెడుతోంది. అయితే సాంగ్ లో సల్మాన్ ఖాన్, వెంకటేష్, రామ్ చరణ్ ఎల్లో షర్ట్.. వైట్ లుంగీ ధరించి డాన్స్ అదరగొట్టారు. అలాగే పూజా హెగ్దే కూడా లుంగీ కట్టి హీరోలతో మాస్ స్టెప్పులేసింది. ఏంటమ్మా అనే పాట వీడియో రిలీజ్ అవ్వగా ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫీ అందించారు. 

RRR సినిమా తరువాత రామ్ చరణ్ ఈ స్పెషల్ సాంగ్ లో చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సల్మాన్ చరణ్ వెంకటేష్ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో సిల్వర్ స్క్రీన్ దద్దరిల్లిపోయింది. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ సాంగ్ లో ముగ్గురు పర్ఫామెన్స్ చేయడం టాలీవుడ్ బాలీవుడ్ ప్రేక్షకులకు విజువల్ ఫిస్ట్ అందించింది. ఈ చిత్రంలో చరణ్ గెస్ట్ ఆపియరెన్స్ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షహనాజ్ గిల్,  పాలక తివారిలు, జగపతిబాబు, భూమిక చావ్లా , అబ్దు రోజు, భాగ్యశ్రీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.

చరణ్ ట్వీట్.. 

ఈ పాటలో విక్టరీ వెంకటేష్ సల్మాన్ ఖాన్ తో కలిసి రాంచరణ్ స్టెప్పులేశారు. లుంగీ కాస్ట్యూమ్ లో లుంగీ డాన్స్ తో అదరగొట్టారు ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏప్రిల్ 21న థియేటర్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ వీడియో సాంగ్ పై రామ్ చరణ్ కూడా స్పందించారు. ఆన్ స్క్రీన్ పై విలువైన సీన్లలో ఇది ఒకటి అంటూ ఈ పాటను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంకటేష్, సల్మాన్ ఖాన్ లతో డాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.. 

ఏంటమ్మా.. ఏంటమ్మా సాంగ్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్  సినిమా, సల్మాన్ ఖాన్ – వెంకటేష్ – రామ్ చరణ్ ఏంటమ్మా సాంగ్