యష్ హాలీవుడ్ దర్శకుడుతో ప్రత్యక్షం

యావత్ భారతదేశం ఒక్కసారిగా యష్ హీరో వైపు తిరిగిందని చెప్పుకోవచ్చు. కేజీఫ్ చాప్టర్1,2 సినిమాలతో ప్రసిద్ధి చెందిన హీరో యాష్ హాలీవుడ్ రేంజ్కి ఎదిగాడ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక హాలీవుడ్ దర్శకుడుతో కనిపించి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. ఒక కొత్త అప్డేట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా స్క్రిప్ట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు యష్ కనిపిస్తున్నారు. తన నెక్స్ట్ 19వ చిత్రం […]

Share:

యావత్ భారతదేశం ఒక్కసారిగా యష్ హీరో వైపు తిరిగిందని చెప్పుకోవచ్చు. కేజీఫ్ చాప్టర్1,2 సినిమాలతో ప్రసిద్ధి చెందిన హీరో యాష్ హాలీవుడ్ రేంజ్కి ఎదిగాడ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక హాలీవుడ్ దర్శకుడుతో కనిపించి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. ఒక కొత్త అప్డేట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా స్క్రిప్ట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు యష్ కనిపిస్తున్నారు. తన నెక్స్ట్ 19వ చిత్రం గురించి అక్టోబర్ లో ఒక ప్రత్యేకమైన అప్డేట్ ఇవ్వబోతున్నాడని, అంతేకాకుండా హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే ప్రశ్నలు అభిమానుల్లో కలుగుతున్నాయి. ఒక్క ఫోటోతో ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు యష్.

యష్ విశేషాలు:

కన్నడ సూపర్‌స్టార్ యష్, KGF ఫిల్మ్ సిరీస్ భారీ విజయాల తర్వాత సినిమాలకు చాలా విరామం ఇచ్చాడని చెప్పుకోవాలి. తమ సినిమాల బాక్సాఫీస్ విజయాలను క్యాష్ చేసుకోవడంలో సమయం వృథా చేసుకోని సూపర్ స్టార్‌ల మాదిరిగా కాకుండా, ‘రాకీ భాయ్’ తాను ఎంచుకునే తదుపరి ప్రాజెక్ట్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇటీవల, ప్రత్యేకంగా యష్ కన్నడ సినిమాలో తన 19వ సినిమాను ప్రత్యేకించి ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రఖ్యాత మలయాళ దర్శకుడు గీతూ మోహన్‌దాస్‌తో జత కట్టనున్నట్లు సమాచారం. నటుడు మరియు జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రనిర్మాత ఈ సంవత్సరం డిసెంబర్‌లో ప్రాజెక్ట్ కోసం షూటింగ్ ప్రారంభించబోతున్నారని KGF స్టార్‌కి సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి.

హాలీవుడ్ దర్శకుడు జేజే పెర్రీని యష్ కలిశాడు: 

సన్నిహిత వర్గాలు కూడా నటుడు తన ప్రతిష్టాత్మక 19వ చిత్రం కోసం, యష్ ప్రిపరేషన్ పనిని ఇప్పటికే ప్రారంభించినట్లు ధృవీకరించారు. ఆసక్తికరంగా, ఇప్పుడు లండన్‌లో ఉన్న కన్నడ సూపర్‌స్టార్, గీతు మోహన్‌దాస్ దర్శకత్వం కోసం తన ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లు చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇటీవల ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు JJ పెర్రీతో కనిపించి ఆకట్టుకున్నారు యష్. దర్శకుడు JJ పెర్రీ ప్రముఖ జాన్ విక్ సిరీస్ తీసి ప్రసిద్ధి చెందారు.

చిత్రనిర్మాత, తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో, KGF నటుడితో తీసుకున్న ఒక బెస్ట్ ఫోటో పంచుకున్నారు, అతని పోస్ట్‌కి క్యాప్షన్ , లండన్‌లో నా సోదరుడు @thenameisyash అంటూ రాస్కొచ్చారు. వీరిద్దరి తాజా సమావేశం వెనుక ఉద్దేశ్యాన్ని జెజె పెర్రీ వెల్లడించనప్పటికీ, యష్ అభిమానులు మాత్రం ఇది ఖచ్చితంగా నటుడి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అని ఊహాగానాలు చేస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ త్వరలో హాలీవుడ్ అరంగేట్రం చేయడానికి చర్చలు జరుపుతున్నారా అని ఇప్పుడు సినీ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే, మరిన్ని అప్‌డేట్‌ల కోసం మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిందే.

యష్ 19 గురించి: 

ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా, యష్ ఈ సంవత్సరం అక్టోబర్‌లో తన ఎదురుచూస్తున్న తదుపరి ప్రాజెక్ట్ గురించి పెద్ద ప్రకటన చేయబోతున్నాడు. కన్నడ సూపర్ స్టార్ తన సినిమా ఎంపికతో కమర్షియల్ ఫిల్మ్ మేకర్‌తో మరో మాస్ యాక్షన్‌తో తిరిగి వస్తాడని ఆశించిన ప్రేక్షకులను, సినీ అభిమానులను ఒక్క ఫోటోతో మంత్రముగ్ధున్ని చేశాడు.

యష్ డిసెంబర్ 2023 నుండి యష్ 19 షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడని.. ప్రస్తుతం ప్రిపరేషన్ వర్క్ జరుగుతోందని.. రాబోయే కాలంలో యష్‌కి కూడా లుక్ కి సంబంధించిన కొన్ని టెస్ట్‌లు జరుగుతాయని. యష్‌కి సినీ రంగం నుంచి కొన్ని స్క్రిప్స్ వచ్చినప్పటికీ, గీతు మోహన్‌దాస్ కోంబోలో చిత్రం రాబోతుందని స్పష్టం చేశారు సన్నిహిత వర్గాలు.