గుడ్ న్యూస్ చెప్పిన కేజిఎఫ్ హీరో

కేజిఎఫ్ అనే సూపర్ డూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యష్ ఇప్పుడు మరో ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన నెక్స్ట్ చిత్రం యష్ 19 గురించి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది.  య‌ష్‌19 గురించి మరింత:  మన పాన్ ఇండియా సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న యష్ కేజీఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అంతే కాకుండా అతను ఒక […]

Share:

కేజిఎఫ్ అనే సూపర్ డూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యష్ ఇప్పుడు మరో ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన నెక్స్ట్ చిత్రం యష్ 19 గురించి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. 

య‌ష్‌19 గురించి మరింత: 

మన పాన్ ఇండియా సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న యష్ కేజీఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అంతే కాకుండా అతను ఒక సినిమాతోనే ఎన్నో ఎంతోమంది ఫాన్స్ ని సంపాదించుకోవడం జరిగింది. రాకీ బాయ్ అనే పదం వింటే చాలు తెలుగు ప్రేక్షకులకు కే కాదు మొత్తం యావత్ భారతదేశానికి గుర్తొస్తాడు. అయితే ప్రస్తుతం యష్ మరో ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నట్లు మరో అప్డేట్ లభించింది. తను చేయబోయే నెక్స్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం ఖాయం అంటూ, తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది అని ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. 

ఇటీవల మలేషియాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాన్ ఇండియా హీరో యష్ పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చే సినిమా అంతకుమించి ఉంటుంది అంటూ, తన నెక్స్ట్ సినిమా గురించి ప్రత్యేకమైన అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా మీదే తను కష్టపడుతున్నట్లు, కాకపోతే ఇది మరీ భారీగా ఉండనప్పటికీ, ఒక చక్కని సినిమాగా పేరు పొందుకుంటుందని ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన ఖచ్చితంగా చెప్పారు. అంతేకాకుండా నెక్స్ట్ సినిమా రిలీజ్ అయ్యేందుకు కాస్త సమయం పడుతుంది కాబట్టి ప్రేక్షకులని కాస్త ఓర్పుతో ఉండాలని పాన్ ఇండియా హీరో యష్, మలేషియాలో జరిగిన ఈవెంట్ లో మాట్లాడారు. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి మరింత ప్రత్యేకమైన అప్డేట్ త్వరలోనే ఇస్తానని ఆయన పేర్కొన్నారు. 

ఇంతకుముందు చాలా కార్యక్రమంలో, పాన్ ఇండియా హీరో తన నెక్స్ట్ సినిమా గురించి నోరు మెదపలేదు కాకపోతే, ప్రేక్షకులను కాస్త వెయిట్ చేయమని ఆయన చెప్పడం జరిగింది. అయితే యష్ 19 సంబంధించిన అప్డేట్ గురించి మాట్లాడటం యష్ ఇదే మొదటిసారి. 

పాన్ ఇండియా హీరో గురించి మరింత: 

యాష్, కన్నడ చిత్రాలతో పరిచయమై ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన నటుడు. అతను మూడు ఫిలింఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు. మొట్టమొదటిగా, యష్ తన కెరీర్‌ను 2000లలో అనేక టెలివిజన్ సిరీస్‌లలో కనిపించడం ద్వారా ప్రారంభించాడు. 2007లో జంబాడ హుడుగి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. 2008 రొమాంటిక్ డ్రామా మొగ్గిన మనసు, దాని కోసం అతను ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు, ఇది యష్‌కు ఒక చక్కని పేరు తెచ్చి పెట్టింది. ప్రధాన పాత్రలో అతని మొదటి చిత్రం, రాకీ (2008), విమర్శకుల ప్రశంసలు అందుకోలేకపోయింది, అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత, 2012లో డ్రామా కోసం ఉత్తమ నటుడి నామినేషన్లో అతని మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు.

కాలేజ్ రొమాన్స్ గూగ్లీ (2013), కామెడీ-డ్రామా రాజా హులి (2013), ఫాంటసీ యాక్షన్ గజకేసరి (2014), రొమాంటిక్ కామెడీ మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి (2014), వంటి చిత్రాలతో యష్ కన్నడ సినీ ప్రముఖ నటుడిగా స్థిరపడ్డాడు. యాక్షన్ చిత్రం మాస్టర్ పీస్ (2015), యాక్షన్ రొమాన్స్ సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్ (2016). మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమా కారణంగా యష్‌ ఉత్తమ నటుడిగా మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందించారు. ప్రశాంత్ నీల్ యొక్క 2018లో యాక్షన్ ఫిల్మ్ K.G.F: చాప్టర్ 1 అనేది పాన్-ఇండియా విజయం సాధించడం జరిగింది, ఇది అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రంగా భారత దేశ ప్రశంసలు అందుకుంది. యాష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి మరియు ఉత్తమ నటుడిగా తన రెండవ ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకోవడానికి సహాయపడింది. సీక్వెల్ K.G.F: చాప్టర్ 2 (2022)లో అతని నటనకు అతను మరింత ప్రశంసలు అందుకున్నాడు, ఇది అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా నాల్గవ స్థానంలో ఉంది.

యష్ యశో మార్గ ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక సేవలలో కూడా పాల్గొనడం జరుగుతుంది. అతను నటి రాధిక పండిట్‌ని వివాహం చేసుకున్నాడు.