జీ తెలుగులో ‘సర్దార్’ సినిమా

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాలతో విలక్షణ నటుడిగా వెలుగొందుతున్నాడు కార్తీ. ఇప్పటి వరకు తెలుగు మార్కెట్‌పై సీరియస్‌గా దృష్టి సారించాడు తమిళ నటుడు కార్తీ. తన కెరీర్ మొదలైనప్పటి నుంచి తెలుగు, తమిళ మార్కెట్లను బ్యాలెన్స్ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. తన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతుంది. కార్తీ తెలుగు హీరో అనే అనుకుంటున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కార్తీ.. తన విలక్షణమైన […]

Share:

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాలతో విలక్షణ నటుడిగా వెలుగొందుతున్నాడు కార్తీ. ఇప్పటి వరకు తెలుగు మార్కెట్‌పై సీరియస్‌గా దృష్టి సారించాడు తమిళ నటుడు కార్తీ. తన కెరీర్ మొదలైనప్పటి నుంచి తెలుగు, తమిళ మార్కెట్లను బ్యాలెన్స్ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. తన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతుంది. కార్తీ తెలుగు హీరో అనే అనుకుంటున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కార్తీ.. తన విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. మల్లిగాడు, యుగానికి ఒకడు, ఖైదీ సినిమాలతో మంచి నటుడిగా మారాడు.

సర్దార్ సినిమా

రీసెంట్‌గా సర్దార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తీ. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సర్దార్. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న సినిమా ఇది. అలాగే, ఈ చిత్రంలో చంకీ పాండే, లైలా కీలక పాత్రలు పోషించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా విడుదలైంది. రజిషా విజయన్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపించింది. కార్తీ ‘సర్దార్’ దాదాపు వంద కోట్ల కలెక్షన్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్. జీవీ.. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాడు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. 

జీ తెలుగులో ‘సర్దార్’ ప్రీమియర్ షో

సర్దార్ ఈ వారాంతంలో.. జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి ప్రేక్షకులకు విందు చేయబోతోంది. థియేట్రికల్ విడుదల సమయంలో భారీ బాక్సాఫీస్ విజయాన్ని సాధించిన తరువాత, ఈ చిత్రం ఇప్పుడు ఈ వారాంతంలో టెలివిజన్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ఆకర్షణీయమైన కథాంశం, కొన్ని ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో చిత్రీకరించిన సర్దార్.. ఫిబ్రవరి 26 సాయంత్రం 5:30 గంటలకు ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని  జీ తెలుగులో మాత్రమే అందించడానికి సిద్ధంగా ఉంది,

విజయ్ ప్రకాష్ (కార్తీ) పోలీస్ ఇన్‌స్పెక్టర్. చిన్నప్పటి నుంచి తన తండ్రి (మరో కార్తీ) దేశద్రోహి అని సమాజం ముద్ర వేస్తుంది. దీంతో తాను మంచి వ్యక్తిగా నిరూపించుకునేందు ప్రతి చిన్న పనినీ చేసస్తూ ‘ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్‌’గా గుర్తింపు పొందుతాడు. మరోవైపు ఒయాసిస్ వాటర్ టెక్నాలజీస్ అనే ప్రైవేట్ సంస్థ భారత్ మొత్తానికి పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ‘వన్ కంట్రీ వన్ పైప్ లైన్’ అనే ప్రాజెక్టును ప్రారంభించనుంది ఓ కంపెనీ. ఒక సామాజిక కార్యకర్త (లైలా) దీనిని ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ అకస్మాత్తుగా ఒకరోజు ఆమె చనిపోతుంది. ఆమె దేశద్రోహి అని వార్త వస్తుంది. దీంతో ఆమె కొడుకు అనాథ అవుతాడు. ఈ కేసును ఎలాగైనా పరిష్కరించాలని విజయ్ ప్రకాష్ నిర్ణయించుకొని అసలు ఒయాసిస్ కంపెనీ వెనుక ఎవరున్నారు? దేశద్రోహిగా ముద్రపడిన గూఢచారి సర్దార్ ఎవరు? అనే విషయాలన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ ఇంట్రెస్టిన్ యాక్షన్ డ్రామా – సర్దార్ – ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు, జీ తెలుగులో మాత్రమే