సిటాడెల్‌లో ప్రియాంకా చోప్రాతో కలిసి పనిచేయడంపై ఆసక్తికర విషయాలు చెప్పిన రిచర్డ్ మాడాన్..

ఇద్దరం కలిసి బెస్ట్ అవుట్ పుట్ తెస్తామన్న హాలీవుడ్ నటుడు హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెకుతున్న వెబ్ సిరీస్ సిటాడెల్..  ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్ ను అమెజాన్ సంస్థ గ్రాండ్‌గా తెరకెక్కిస్తోంది.. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. తాజాగా ఈ సినిమాలో ప్రియాంక చోప్రాతో కలిసి నటించిన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ని రిచర్డ్ మాడాన్ ఇటీవల […]

Share:

ఇద్దరం కలిసి బెస్ట్ అవుట్ పుట్ తెస్తామన్న హాలీవుడ్ నటుడు

హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెకుతున్న వెబ్ సిరీస్ సిటాడెల్..  ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్ ను అమెజాన్ సంస్థ గ్రాండ్‌గా తెరకెక్కిస్తోంది.. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. తాజాగా ఈ సినిమాలో ప్రియాంక చోప్రాతో కలిసి నటించిన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ని రిచర్డ్ మాడాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు..  రిచర్డ్ మాడాన్ ప్రియాంక చోప్రాపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

ఇద్దరం కలిసి బెస్ట్ అవుట్ పుట్ తెస్తాం..

రిచర్డ్ మాడాన్ సిటాడెల్ ప్రమోషన్లలో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా జోనస్ తో కలిసి పని చేసిన అనుభవాన్ని పంచుకున్నారు.. ప్రియాంకతో కలిసి పనిచేయడం నాకు ప్రతిరోజు ఎంతో నచ్చింది. ఎందుకంటే ప్రియాంక నన్ను ప్రతి విషయంలోనూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. మేమిద్దరం యాక్టింగ్ చేసే ముందు స్క్రిప్ట్ ని సరిగ్గా అర్థం చేసుకుంటాము. అలాగే యాక్టింగ్ చేయవలసిన పలు విషయాల గురించి ముందుగానే చర్చించుకుని ఆలోచిస్తాం. ప్రియాంక నన్ను షూటింగ్ సమయంలో కొన్ని మెలకువలు చెబుతూ ఉంటుంది. తనతో పని చేయడం నిజంగా నాకు గొప్ప అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు.

 మిగతా సినిమాలలోని పాత్రల మాదిరిగానే ఇది చాలా విభిన్నంగా ఉంటుందని తెలిపారు. ఇంకా మేము ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకుంటాము. ఇద్దరం నటనలో ఒక బెస్ట్ అవుట్ పుట్ తీసుకురావడానికి.. అలాగే డాన్స్ లో కూడా నాకు బెస్ట్ పార్ట్నర్ అని స్కాటిష్ నటుడు రిచర్డ్ మాడాన్ అన్నారు. 

5 భాషల్లో సిటాడెల్ సీరీస్..

అమెజాన్ ప్రైమ్ లో సిరీస్ ఏప్రిల్ 28న స్ట్రీమింగ్ కానుంది ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది.  హిందీ తమిళ కన్నడ మలయాళం భాషల్లో కూడా ఏప్రిల్ 28న ఈ సిరీస్ విడుదల కానున్నట్లు.  ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ సిరీస్ ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల గానుంది ఏప్రిల్ 28న రెండు ఎపిసోడ్లు రిలీజ్ కానున్నాయి ఆ తరువాత మే 26 వారానికో ఎపిసోడ్ విడుదల కానుంది ఈ గ్లోబల్ సిరీస్ 240 దేశాల  ప్రాంతాలలో విడుదల చేయనున్నారు. ఇటీవల  ఈ సిరీస్ కి సంబంధించిన కొత్త ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. 

ఇప్పటికే ఈ సిరీస్ కి సంబంధించిన టీజర్లు అమెజాన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. అద్భుతమైన యాక్షన్ సీన్లతో నిండి ఉన్న టీజర్లు ఈ సిరీస్‌పై భారీ అంచనాలను నెలకొల్పాయి. ప్రియాంక చోప్రా కి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో ప్రియాంక ఎలైట్ గూఢచారి నదియా సీన్ పాత్ర పోషిస్తుంది. రస్సో బ్రదర్స్ సృష్టించిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా మొదటి రెండు ఎపిసోడ్లు ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు.