మీరు వర్డ్ లే 659 చాలెంజ్ తీసుకున్నారా? అయితే తప్పకుండా ఇది చదవండి

వర్డ్ లే గేమ్ గురించి మీకు తెలుసా? ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే వాళ్ళకు ఈ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  అసలు ఈ గేమ్ కి అంత క్రేజ్  ఎలా వచ్చింది? ఈ గేమ్ ను ఎలా ఆడతారు? ఈ వారం ఇచ్చిన వర్డ్ లే 659 గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.  మీరు ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే వారైతే మీరు వర్డ్ లే Wordle గేమ్ […]

Share:

వర్డ్ లే గేమ్ గురించి మీకు తెలుసా? ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే వాళ్ళకు ఈ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  అసలు ఈ గేమ్ కి అంత క్రేజ్  ఎలా వచ్చింది? ఈ గేమ్ ను ఎలా ఆడతారు? ఈ వారం ఇచ్చిన వర్డ్ లే 659 గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

మీరు ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే వారైతే మీరు వర్డ్ లే Wordle గేమ్ గురించి తెలిసే ఉండొచ్చు. గత కొన్నాళ్లుగా ఈ గేమ్ సోషల్ మీడియాలో ప్రతిరోజూ ట్రెండింగ్ లో ఉంటోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సోషల్ మీడియా వినియోగదారులకు ఈ గేమ్ అంటే పిచ్చ క్రేజ్.. ట్విట్టర్లో ప్రతిరోజు సమాధానాన్ని పంచుకొంటారు. కరోనా మహమ్మారి సమయంలో వర్డ్ లే అకస్మాత్తుగా వచ్చి వెళ్ళింది. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ పబ్లిషింగ్ దీన్ని కొనుగోలు చేసింది.. వర్డ్ లే లో 2023 ఏప్రిల్ 9న వచ్చిన Wordle 659 వర్డ్ ఆఫ్ ది డే ని పరిష్కరించే సవాలు స్వీకరించిన వారు.. ఎలా పరిష్కరించాలో తెలిపే చిన్న చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

వర్డ్ లే 659 వర్డ్ ఆఫ్ ది డే చాలా గమ్మత్తయింది. ఈ సవాలు స్వీకరించిన వారు సులువుగా చేయవచ్చు. అది ఎలా అంటే.. a అనే అక్షరాన్ని ఉపయోగించుకొని చేయాలి. ఆ అక్షరాన్ని ఉపయోగించుకుని గ్రామర్ తో పాటు మరికొన్ని అక్షరాలను ఉపయోగించి సరైన పదాన్ని ఎంపిక చేసుకోవాలి. 

వర్డ్ లే ని మొదట సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జోష్ వర్డ్ లే అభివృద్ధి చేశారు. ఇది ఆన్ లైన్ వర్డ్ గేమ్. ఇందులో రోజుకో కొత్త పదాన్ని ఊహించాల్సి ఉంటుంది. మరుసటి రోజు కంపెనీ వాటికి సమాధానం ఇస్తుంది.  ఈ గేమ్ వార్త పత్రికలలో వచ్చే సుడోకు గేమ్ మాదిరిగా ఉంటుంది. మీరు ఈ గేమ్ ను  ఏదైనా డివైస్ లో గానీ బ్రౌజర్ లో గానీ ఆన్ లైన్ లో గానీ ఆడవచ్చు.  ఇందులో ఇంగ్లీషులోని ఐదు అక్షరాలను ఊహించి ఏ పదం ఏర్పడుతుందో చెప్పాలి. ఈ గేమ్ ప్రతి 24 గంటలకు మారుతుంది. దీనిలో అక్షరాలు 5*6 గ్రిడ్ లో ఉంటాయి.

వర్డ్ లే గేమ్ వైరల్ కావడానికి అతిపెద్ద కారణం ఏమిటంటే.. ఈ గేమ్ ఆడటానికి మీరు ఏ యాప్ నూ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.. దీన్ని ఏ బ్రౌజర్ లోనైనా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. మరో గొప్ప విషయం ఏమిటంటే.. ఈ గేమ్ ని మీరు ఆగకుండా ఆడవచ్చు. ఈ ఆటలో మీరు ఊహించిన అక్షరాల నుండి ఒక పదం ఏర్పడుతుంది. మీరు తప్పు పదాన్ని గుర్తిస్తే, అది పసుపు రంగులో కనిపిస్తుంది. మీ అంచనా తప్పు అయితే ఆ అక్షరం పదంలో లేకుంటే అది గ్రే కలర్ లో కనిపిస్తుంది. ఒక గేమ్ సమయంలో ఒక ప్లేయర్ ఆరు పదాలను మాత్రమే ఎంటర్ చేయగలుగుతారు.