మన టాలివుడ్ అందగాడు మహేష్ బాబు ఏం తింటాడో తెలుసా?

ఈ మధ్య ఆరోగ్యంగా ఉండడానికే కాదు, సిక్స్ పాక్కుల కోసం కూడా తెగ ప్రయత్నిస్తున్నారు మన హీరోలు. ఇంతక ముందు హీరోయిన్ల గ్లామర్ గురించి మాట్లాడుకునేవారేమోకాని ఇప్పుడు హీరోల ఫిట్నెస్ సినిమా కి ప్రధానం అయిపోయింది. పైగా మహేష్ వర్క్ అవుట్ చేస్తున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన బ్రేక్ ఫాస్ట్ తో పాటు ఫోటో పెట్టాడు మహేష్. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తు దాని రెసిపీని కూడా పంచుకున్నాడు. మహేష్ బాబు వయస్సు […]

Share:

ఈ మధ్య ఆరోగ్యంగా ఉండడానికే కాదు, సిక్స్ పాక్కుల కోసం కూడా తెగ ప్రయత్నిస్తున్నారు మన హీరోలు. ఇంతక ముందు హీరోయిన్ల గ్లామర్ గురించి మాట్లాడుకునేవారేమోకాని ఇప్పుడు హీరోల ఫిట్నెస్ సినిమా కి ప్రధానం అయిపోయింది. పైగా మహేష్ వర్క్ అవుట్ చేస్తున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన బ్రేక్ ఫాస్ట్ తో పాటు ఫోటో పెట్టాడు మహేష్. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తు దాని రెసిపీని కూడా పంచుకున్నాడు. మహేష్ బాబు వయస్సు 47 సంవత్సరాలు అంటే నమ్మగలమా? కొంతమంది పెరిగే కొద్దీ యవ్వనం అనుభవిస్తుంటారు అంటే ఏమిటో మహేష్ ని చూస్తే తెలుస్తుంది. అదేదో ఇంగ్లిష్ సినిమాలో కథలాగా. ఎన్నో ఇంటర్వూస్ లో తన ఆనందంగా ఉంటానని, టెన్షన్లు తీసుకోనని, మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం బాగుంటే, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాను కాబట్టే ఇలా ఉన్నానేమో అని చెప్పిన మహేష్ అసలు ఏమి తింటాడో ఎప్పుడైనా ఆలోచించారా?  ఎంతో  ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాన్ని తీసుకుంటాడని తెలుసుకోండి. ఇంస్టాగ్రామ్ లో తనకి ఖాళీ ఉన్నప్పుడు తన బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్‌తో ఫోటో తీసి పెట్టాడు.

బ్రేక్ఫాస్ట్ లోని రహస్యం:

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలో మహేష్ బాబు షేర్ చేశారు, ఫోటోలో, సూపర్ స్టార్ కొత్త హెయిర్ స్టైల్‌తో మంచి గ్రేయ్ జాకెట్, బ్లూ టి-షర్ట్ లో సన్ గ్లాసెస్ తో మంచి ఫిట్గా డాషింగ్ గా ఉన్నాడు కాబట్టి ఆయన్ని కాకుండా ఆయన తిని ఆహార వివరాలు మీరు చూసి ఉండరనే ఉద్దేశంతో ఇలా రాస్తున్నాము. ఫోటోను షేర్ చేస్తూ, “నా దినచర్యలో స్మార్ట్ న్యూట్రిషన్‌ను రూపొందించాను. రాత్రిపూట నానబెట్టిన ఓట్స్, నట్స్ మరియు మొలకల సాధారణ మిశ్రమం తో ఆహారం. రాబోయే రెండు గంటలలో నాకు పవర్ కావాలి” అని రాశారు. సౌత్‌లో, ప్రతి స్టార్‌కి ఇప్పుడు స్టార్‌డమ్‌ రావాలంటే ఫిట్నెస్ ఉంటేనే వస్తుందని ముందుగా దానిమీదే దృష్టి పెడుతున్నారు, మహేష్ బాబు మాత్రమే తన అందంతో  ప్రత్యేక పేరును సంపాదించుకున్నాడు, దూకుడు సినిమాలో విలన్ తో “వీడెవడురా హాలీవుడ్ హీరో లా ఉన్నాడు” అనిపించుకున్నాడు కూడా. టాలీవుడ్ ప్రిన్స్ గా లోవర్ బాయ్ లుక్స్తో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాలీవుడ్ అందగాడు గా నిలిచిపోయాడు. ఇప్పుడు కేవలం లుక్కే కాదు, సూపర్ ఫిట్ అండ్ ఫ్యాబ్ bodyతో కూడా ఆకట్టుకుంటున్నాడు. 

ఇప్పడు మహేష్ ఎక్కడ:

మహేష్ బాబు త్వరలో తన కుటుంబంతో కలిసి హాలిడేకి వెళ్లనున్నట్టు సమాచారం. తన కుమార్తె సితార పుట్టినరోజును జరుపుకోవడానికి నటుడు పారిస్ లేదా దుబాయ్‌కి వెళ్లనున్నట్లు సమాచారం. తన చిన్నవయసులో ఒక్క ఆడ్ తో ఎంతోమందిని ఆకర్షించిన సితార గురించి గర్వంగా ఈమధ్య పోస్ట్ కూడా పెట్టాడు మహేష్. ఎందుకంటే పిఎంజె జీవలరీ ఆడ్ ఆడ్ టైమ్స్ స్క్వేర్, న్యూయార్క్‌లో కూడా ప్రదర్శించబడింది కాబట్టి. అలాగే భారీ మొత్తంలో పారితోషకం తీసుకుంది అనుకోండి., అయితే తాను తీసుకున్న మొత్తాన్ని ఛారిటీకి విరాళంగా ఇచ్చానని స్టార్ కిడ్ వెల్లడించింది.

మహేష్ సినిమా వివరాలు:

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే “గుంటూరు కారం” సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే ప్రజెక్టు నుంచి తప్పుకున్నాక ఆమె స్థానంలో మీనాక్షి చౌదరితో టీమ్ ఇటీవల హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ను ముగించింది. శ్రీలీల తొలి కథానాయిక అని టాక్. ఎస్ థమన్ సంగీత స్వరకర్త.