భారతీయుడు 2లో డీఏజ్డ్ క‌మ‌ల్ హాసన్‌..!

భారతీయుడు అనే సినిమా 1996 లో విడుదల అయ్యి ఇప్పటికీ అవినీతికి ఎదురెళ్లి స్వాత్రంత్ర యోధుల సినిమా అంటే వెంటనే గుర్తుకు వచ్చేస్తుంది. కమల్ నటన కానీ సినిమా కానీ, పాటలు కానీ.. చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎప్పుడో మన చిన్నప్పుడు వచ్చినా ఈ సినిమా ఇప్పుడు చూసినా ఫ్రెష్ గానే ఉంటుంది. అయితే ఇప్పుడు భారతీయుడు 2, ఇండియన్ 2, గా రాబోతోందని మనకి తెలిసిందే.. అయితే ఇందులో పాత్రకి కమల్ రెండు […]

Share:

భారతీయుడు అనే సినిమా 1996 లో విడుదల అయ్యి ఇప్పటికీ అవినీతికి ఎదురెళ్లి స్వాత్రంత్ర యోధుల సినిమా అంటే వెంటనే గుర్తుకు వచ్చేస్తుంది. కమల్ నటన కానీ సినిమా కానీ, పాటలు కానీ.. చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎప్పుడో మన చిన్నప్పుడు వచ్చినా ఈ సినిమా ఇప్పుడు చూసినా ఫ్రెష్ గానే ఉంటుంది. అయితే ఇప్పుడు భారతీయుడు 2, ఇండియన్ 2, గా రాబోతోందని మనకి తెలిసిందే.. అయితే ఇందులో పాత్రకి కమల్ రెండు పాత్రల్లో కనిపిస్తారా? మరి కుర్రతనంలో ఉండే కమల్ని డిజిటల్ టెక్నాలజీ ద్వారా డి-ఏజ్డ్ గా చూపిస్తారా? అనే అనుమానాలు ఉన్నాయి నెటిజన్లకి.

జోరు మీద ఉన్న కమల్: 

కమల్ హాసన్ ఈ మధ్య కాలంలో మంచి హుషారుతో మల్టీ భాషల్లో సినిమాలు చేసేస్తున్నారు. బ్యాక్-టు-బ్యాక్ ప్రాజెక్ట్‌లకు సంతకం చేయడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో కొన్ని చిత్రాలను నిర్మిస్తున్నారు అని కూడా తెలుస్తోంది. ఆయన కమిట్ అయిన ప్రాజెక్ట్‌లలో ఒకదానిపై భారీ అంచనాలు ఉన్నాయి. అదేనండి, ప్రభాస్ కల్కి 2898 ADలో విల్లన్ పాత్రలో ఎలా ఉండబోతున్నారో అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి 2898 AD ప్రత్యేకించి శాన్ డియాగో కామిక్-కాన్‌లో ఈ చిత్ర ప్రమోషన్ ప్రారంభమైనందున ఆ సినిమాకి ఓ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాలన్నింటిపై ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు, అయితే భారతీయుడు 2 కూడా తమిళం లోనూ సౌత్ లోనూ భారీ హైప్ తో ఉంది. కమల్ ఇతర భాషా చిత్రాలు ప్రేక్షకులకు పూర్తిగా కొత్తవారు , కానీ భారతీయుడు 2, ఎస్ శంకర్ కంబినేషన్ అంటేనే చూడాలనే ఉత్సాహం ఉంటుంది. 

డిజిటల్ ఎఫెక్ట్స్ లుక్ లో కమల్: 

ఇప్పుడు, ఇండియన్ 2కి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, కమల్ హాసన్ ఈ చిత్రంలో డిజిటల్‌గా డి-ఏజ్డ్‌గా కనిపించబోతున్నారు అని. దీనికి కారణం దర్శకుడు ఎస్ శంకర్ చేసిన ఓ ట్వీట్ జనాలను ఆలోచింపజేస్తోంది. ఈమధ్య సినిమాల్లో విఎఫ్ఎక్స్లు కొత్తేమి కాదు, శంకర్ గారి ట్వీట్‌ సాంకేతికత విషయానికి వస్తే, శంకర్ దృష్టి ఎంత పెద్దదైతే అంత మంచి ఫలితం వస్తుందని మనందరికీ తెలుసు, రోబో సినిమాలు తీసింది కూడా ఆయనే కదా,  మీకు గుర్తు ఉండే ఉంటుంది రజిని శివాజీ సినిమా లో ఓ పాటలో కూడా తెల్లగా కనిపించడానికి ఒక తెల్లమ్మాయి చర్మరంగుతో టెక్నాలజీ సాయం తో మార్పులు చేసి తెరపై చూపించారు.. అందువల్ల, ఆ ట్వీట్ లో “లోలా VFX LA వంటి అధునాతన సాంకేతికతను స్కాన్ చేస్తోంది” అని రాసే సరికి ఇండియన్ 2 కోసం కొత్త ప్రయోగాలు చేస్తున్నారేమో అనే సందేహం వస్తోంది. 

ఇది ఏంటో తెలుసుకుందాం, విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో “లోలా” అనే కంపెనీ డి-ఏజింగ్ టెక్నాలజీకి ప్రసిద్ధి చెందింది, కంపెనీ మార్టిన్ స్కోర్సెస్  “ది ఐరిష్మాన్” మరియు “మార్వెల్ స్టూడియోస్ యొక్క అవెంజర్స్: ఎండ్‌గేమ్” వంటి చిత్రాలకు పనిచేసింది. అందువల్ల, భారతీయుడు 2 సినిమా లో కూడా కమల్ హాసన్ డిజిటల్‌గా డి-ఏజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. కొత్త టెక్నాలజీ ప్రయోగాలకి సిద్ధంగా ఉందాం.