సుకుమార్.. టాలీవుడ్ గేమ్ ఛేంజ‌ర్..!

టాలీవుడ్ టాప్  డైరెక్టర్ల లిస్టులో లెక్కల మాస్టారూ సుకుమార్ పేరు తప్పనిసరిగా ఉంటుంది. సుకుమార్ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు అందులో తప్పకుండా ఏదో విషయం ఉంటుందని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. సుకుమార్ కూడా అందుకోసం తన ఎఫర్ట్ ను పెడుతుంటాడు. ఏదో నామ్ కే వాస్తే సినిమాలు తీయకుండా మ్యాటర్ ఉన్న సినిమాలనే సుకుమార్ తీస్తాడని ప్రేక్షకుల్లో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఏర్పడింది. సినిమా రిజల్ట్ ఒకవేళ అటూ ఇటూ గా […]

Share:

టాలీవుడ్ టాప్  డైరెక్టర్ల లిస్టులో లెక్కల మాస్టారూ సుకుమార్ పేరు తప్పనిసరిగా ఉంటుంది. సుకుమార్ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు అందులో తప్పకుండా ఏదో విషయం ఉంటుందని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. సుకుమార్ కూడా అందుకోసం తన ఎఫర్ట్ ను పెడుతుంటాడు. ఏదో నామ్ కే వాస్తే సినిమాలు తీయకుండా మ్యాటర్ ఉన్న సినిమాలనే సుకుమార్ తీస్తాడని ప్రేక్షకుల్లో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఏర్పడింది. సినిమా రిజల్ట్ ఒకవేళ అటూ ఇటూ గా వచ్చినా కానీ సినిమా చూసిన ప్రేక్షకుడు ఏదో ఒక విషయంలో సాటిస్ఫై అయ్యేలా ఈ లెక్కల మాస్టారు చేస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకోసమే సుకుమార్ నుంచి మూవీ వస్తుందని అనగానే చాలా మంది మినిమం గ్యారెంటీగా ఫీలవుతుంటారు. ఇక కొంత మంది మాత్రం ఆ మూవీ తప్పకుండా హిట్ సాధిస్తుందనే నమ్మకం మీద ఉంటారు. 

20 సంవత్సరాల ప్రస్థానంలో 

లెక్కల మాస్టార్ సుకుమార్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. 2004 లో ఆర్య మూవీతో సుక్కు దాదా మెగా ఫోన్ పట్టుకున్నాడు. అంతకు ముందే ఇండస్ట్రీకి వచ్చినా కానీ అతడి మొదటి మూవీ మాత్రం 2004లో వచ్చింది. దీంతో అంతా సుకుమార్ 2004లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడని చెబుతుంటారు. ఈ 20 సంవత్సరాల గ్యాప్ లో కేవలం 8 సినిమాలు మాత్రమే తెరకెక్కించాడు. ప్రస్తుతం పుష్ప-2 మూవీ సెట్స్ మీద ఉంది. ఈ మూవీతో కలుపుకుంటే 9 మూవీలను సుకుమార్ డైరెక్ట్ చేసినట్టు. అంటే సగటున ఒక్కో సినిమాకు 2 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. తొలి మూవీ ఆర్యతోనే లవ్ లో ఉండే ఒక ఫీల్ ను పరిచయం చేసిన లెక్కల మాస్టారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ వల్ల ఎన్ని ప్రయోజనాలుంటాయో చెప్పాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న అల్లు అర్జున్ ను రాత్రికి రాత్రే స్టార్ ను చేసింది. ఈ మూవీ దెబ్బకు చాలా మంది లేడీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కు వీరాభిమానులుగా మారిపోయారు. అప్పటి వరకు అటువంటి మూవీని చూడని టాలీవుడ్ జనాలు ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. 

హిట్ అయినా ప్లాప్ అయినా… 

ఈ 20 సంవత్సరాల సినీ కెరియర్ లో సుకుమార్ కొన్ని ప్లాప్స్ కూడా చవి చూశాడు. కానీ సుకుమార్ మూవీ ప్లాప్ అయినా కానీ ఏదో ఒక మ్యాటర్ ఉంటుంది. మరీ అధ్వాన్నంగా ఉండకుండా అందులో కూడా ఏదో విషయం ఉంటుంది అదే సుకుమార్ స్పెషాలిటీ. అందుకోసమే సుకుమార్ మూవీ వస్తుందంటే చాలా మంది మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉంటారు. తప్పకుండా రిజల్ట్ పాజిటివ్ గానే ఉంటుందని లెక్కేస్తారు. రిజల్ట్ ఎలా ఉన్నా కానీ ఆడియన్స్ మాత్రం సాటిస్ఫై అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

మహేశ్ బాబును కొత్తగా చూపాడు… 

సుకుమార్ 2016లో మహేశ్ వన్- నేనొక్కడినే సినిమాను డైరెక్ట్ చేశాడు. అప్పటి వరకు మహేశ్ బాబు అంటే కేవలం లవర్ బాయ్ లానే చూసేవారు. కానీ ఈ మూవీలో మహేశ్ ను పూర్తి డిఫరెంట్ గా చూపించాడు. ఈ మూవీ రిజల్ట్ విషయంలో కాస్త అటూ ఇటూ అయినా కానీ సినిమా చూసిన చాలా మంది మహేశ్ ను కొత్తగా చూపించాడని సుకుమార్ ను మెచ్చుకున్నారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ లా మహేశ్ నటన ఆకట్టుకుంటుంది. సుకుమార్ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం చేసిన కృతి సనన్ నేషనల్ అవార్డును కూడా గెల్చుకుంది. అంతే కాకుండా అతడు డైరెక్ట్ చేసిన పుష్ప-1 మూవీ లాస్ట్ ఇయర్ 2021లో రిలీజ్ అయి.. ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఇంత వరకు ఏ తెలుగు మూవీకి కూడా నేషనల్ అవార్డు రాలేదు. అటువంటిది సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ విషయం మీద చాలా మంది తెలుగు ఇండస్ట్రీ సెలబ్రెటీలతో పాటు కామన్ తెలుగు ఆడియన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ గ్రేట్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. సుకుమార్ ను ఆకాశానికెత్తేస్తున్నారు. 

ఆ విషయంలో..

టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్ జీవితంలో ఎన్నో ప్లస్ పాయింట్లు ఉన్నాయి. అతడు ఒక్కసారి నమ్మితే ఎలా ఉంటుందో మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ విషయంలోనే మనకు తెలిసిపోతుంది. 20 సంవత్సరాల నుంచి మూవీలు తీస్తున్నా కానీ సుకుమార్ దేవీ శ్రీ తో కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో మ్యూజిక్ చేయించుకోలేదు. దేవీ శ్రీ కూడా అతడి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు. సుకుమార్- దేవీ శ్రీ ల మూవీ వస్తుందంటే చాలు అందులో ఒక ఐటెం సాంగ్ తప్పకుండా ఉంటుంది. అంతే కాకుండా అది సాదా సీదాగా మాత్రం ఉండదు. ఆ ఐటెం సాంగ్ తప్పకుండా హిట్ అవుతుంది. సుకుమార్ తీసిన ప్రతి సినిమాలో ఐటెం సాంగ్స్ ఎంతలా పాపులర్ అయ్యాయో.. ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.