అసలు వెంకటేష్ అలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశాడు?

విక్టరీ వెంకటేష్ అంటే పరిచయం అవసరం లేని పేరు. వందల పెద్ద హిట్స్ ఇచ్చిన స్టార్ హీరో. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, హారర్ తదితర చిత్రాలను చేస్తూ వెండితెరపై తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పుడు వస్తున్న యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు.  ‘ఫ్యామిలీ హీరో’ గా మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య హీరోగా ఆయన ఎన్నో సినిమాలు చేశారు. వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీతో చూడచ్చనే నమ్మకం తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ఇదంతా ఆయన గురించి మనకు […]

Share:

విక్టరీ వెంకటేష్ అంటే పరిచయం అవసరం లేని పేరు. వందల పెద్ద హిట్స్ ఇచ్చిన స్టార్ హీరో. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, హారర్ తదితర చిత్రాలను చేస్తూ వెండితెరపై తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పుడు వస్తున్న యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు.  ‘ఫ్యామిలీ హీరో’ గా మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య హీరోగా ఆయన ఎన్నో సినిమాలు చేశారు. వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీతో చూడచ్చనే నమ్మకం తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ఇదంతా ఆయన గురించి మనకు తెలిసినది. అయితే తాజాగా ఈయన ఓటీటీలోకి అడుగుపెట్టాడు.

వెంకటేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఈ సిరీస్ ఎట్టకేలకు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యక్షమయింది. ఈ షో మేకింగ్‌లో ఉన్నప్పుడు, ప్రమోషన్స్ సమయంలో హీరోలు, మేకర్స్ కూడా ప్రేక్షకులను కుటుంబాలతో చూడవద్దని హెచ్చరించారు. ఎందుకు ఇలా అన్నారో అర్థం కాని వారికి.. సిరీస్ విడుదలయిన మొదటి పది నిమిషాల్లోనే అర్థమైంది.

వెంకటేష్‌ని ఎంతగానో ఆరాధించే ఫ్యామిలీ ఆడియన్స్‌ని పక్కన పెడితే.. ఆయన్ను అభిమానించే యూత్‌ కూడా ఈ సిరీస్‌ని జీర్ణించుకోవడం కష్టమే. ఈ సిరీస్‌లోని డైలాగ్‌లు, సన్నివేశాలలో చాలా అసభ్యత ఉంది. ఎవరికైనా చెప్పేటప్పుడు కొంచెం సభ్యతగా చెప్పాలంటే.. ఈ సిరీస్‌లో అసభ్యకరమైన భాష, అతిగా బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని చెప్పండి. వెబ్ సిరీస్‌లకు సెన్సార్‌షిప్ ఉండదు, డైరెక్టర్లు ఎటువంటి ఫిల్టర్‌లను ఉపయోగించకుండా సహజమైన డైలాగ్‌లను అలాగే డెలివర్ చేయవచ్చు.

అవసరమైన భావోద్వేగాలను బయటకు తీసుకురావడానికి దీనిని ఉపయోగించవచ్చు, అనవసరమైన అసభ్యత, లైంగిక సన్నివేశాలతో సిరీస్‌ను నింపడం అస్సలు ఆమోదయోగ్యం కాదు. ఈ సన్నివేశాలు ఎలాంటి ప్రయోజనం లేకుండా చేశారనే భావన కలుగుతుంది.

ఈ సిరీస్ యువతను తప్పుదోవ పట్టించేలా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సిరీస్‌కి వెంకటేష్, రానా ఎలా ఒప్పుకున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. దీంతో వెంకటేష్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని ట్వీట్స్ చేస్తున్నారు ఆయన అభిమానులు. వెంకటేష్ ఉన్నాడని నమ్మి.. కుటుంబీకులను చూడవద్దని సలహా ఇస్తున్నారు.

ముఖ్యంగా ఈ సిరీస్‌లో వెంకటేష్ నాగ నాయుడు క్యారెక్టర్ గురించి వీలైనంత తక్కువ చెప్పాలి.  ఆ క్యారెక్టర్ చూస్తే.. మేకర్స్ వెంకటేష్ ఇమేజ్‌ను దిగజార్చాలని, ఆయన అభిమానులను దెబ్బతీయాలని భావిస్తున్నట్లు అనిపిస్తుంది. 60 ఏళ్లు పైబడిన పాత్రలో నటించాడు. కానీ, ఆయన చెప్పిన డైలాగ్స్ మాత్రం ఎప్పుడూ బోల్డ్ గానే ఉంటాయి. అతని బాడీ లాంగ్వేజ్ కొన్ని సమయాల్లో చాలా సూచనాత్మకంగా ఉంది, ఈ దారుణమైన  సన్నివేశాలు ఈ సిరీస్ లో పుష్కలంగా ఉన్నాయి. అతని పాత్ర సిరీస్ అంతటా చాలా సిల్లీగా ఉంటుంది, అతను చేసే కొన్ని సన్నివేశాలను అతని అభిమానులకు జీర్ణించుకోవడం కష్టం. ప్రతి ఒక్కరూ వెంకటేష్‌ని అడగాలనుకున్న ఒక ప్రశ్న ఏమిటంటే, అతను ‘ఫ్యామిలీ మ్యాన్’ తరహాలో ఈ సిరీస్‌ను తన తొలి ఓటిటీ సిరీస్ గా  ఎందుకు ఎంచుకున్నాడు? అని.

అశ్లీలతను నమ్మి.. ఈ సిరీస్ తీసినట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రానా నాయుడు సిరీస్‌తో ఓటీటీ సెన్సార్‌షిప్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇది పూర్తిగా ఫేక్ అని భావించి ఓటీటీ పేరుతో సీరియల్స్ తీస్తున్నట్లు సమాచారం. ఓటీటీని సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలని అన్నారు. ఇటువంటి భాషతో తెలుగులో సిరీస్‌లు ముందు కూడా వచ్చాయి. కానీ వెంకటేష్ ఇలాంటి క్యారక్టర్ చేయడం మాత్రం బాధాకరం. నిజానికి అటువంటి భాష ఎప్పుడైనా సామాజికంగా అనారోగ్యకరమే.