సలార్ రిలీజ్ డేట్‌పై షాకింగ్ అప్‌డేట్.. !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఆదిపురుష్ తర్వాత ప్రస్తుతం ఓ నాలుగు సినిమాలను చేస్తున్నారు. అందులో ఒకటి సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా విడుదలకానుందని మొదట ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో భారీ యాక్షన్ సినిమా సలార్.. ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి […]

Share:

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఆదిపురుష్ తర్వాత ప్రస్తుతం ఓ నాలుగు సినిమాలను చేస్తున్నారు. అందులో ఒకటి సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా విడుదలకానుందని మొదట ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడింది.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో భారీ యాక్షన్ సినిమా సలార్.. ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో సూపర్ బిజీగా ఉంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలకానుందని టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే..  అయితే సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ కంప్లీట్ కాలేదని.. ఈ నేపథ్యంలో డిసెంబర్‌కు వాయిదా వేశారని టాక్.  ఇక ఈ సినిమా డిసెంబర్‌లో వస్తుందని టాక్ రాగా.. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమా నవంబర్‌ నెలలో విడుదలకు రెడీ అవుతోంది.

ఇక ఈ సినిమా నవంబర్ 10న విడుదలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సలార్ నవంబర్ 10న లేక పోతే.. నవంబర్ 03న విడుదలయ్యే అవకాశం ఉందని టాక్. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది. దీపావళి సందర్భంగా సలార్‌ను విడుదల చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు సమాచారం. ఇక ఇది వరకే సలార్‌కు బుకింగ్స్ ఓపెన్ చేయగా.. గతంలో ఎప్పుడూ, ఎన్నడూ లేని విధంగా.. ఏ సినిమాకి కూడా రాని స్థాయి రెస్పాన్స్ వచ్చింది. అయితే సలార్ వాయిదా పడుతుండడంతో అక్కడ బుక్ చేసుకున్న వారికి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నారని తెలుస్తుంది.  

ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.  ఇండియన్ భాషల్లోనే కాకుండా పలు అంతర్జాతీయ భాషల్లోను విడుదలవుతోంది. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు, శ్రియా రెడ్డి, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరరావు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు కనీవినీ ఎరుగని రేంజ్‌లె బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి కేవలం తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం దాదాపుగా 200 కోట్లకి పైగా మేకర్స్ కోట్ చేశారట. ఈ సినిమా రైట్స్‌ కోసం పీపుల్ మీడియా, దిల్ రాజుతో పాటు, అల్లు అరవింద్ కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దిల్ రాజు ఈ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.. 

ఈ చిత్రానికి సంబంధించి శాటిలైట్ హక్కులు భారీ మొత్తం చెల్లించి స్టార్ మా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కెజీయఫ్ సినిమాలకు సంగీతం అందించిన రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. హోంబళే ఫిలిమ్స్ నిర్మిస్తోంది.. ‘సలార్’​ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్, మారుతి దర్శకత్వంలో వస్తున్న హార్రర్ సినిమా రాజా డీలక్స్ సినిమాకు షిప్ట్ కానున్నారు. 

ఇక ప్రభాస్ నటిస్తోన్న మరో ప్యాన్ ఇండియా సినిమా రాజా డీలక్స్.  మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. హార్రర్ కామెడీ జానర్‌లో వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 40 శాతం షూట్ పూర్తి అయ్యింది. ఈ సినిమాలో ఎక్కువ భాగం ఓ ఇంట్లోనే జరుగునుందట.. ఆ ఇంటి సెట్ కోసమే దాదాపు 6 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఇక హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారట.

ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్నారు. అందులో భాగంగా ప్రభాస్ చేస్తోన్న మరో భారీ సినిమా ప్రాజెక్ట్ కే . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా 80 శాతానికిపైగా షూట్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ వరల్డ్‌ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ఇటీవల కల్కి 2898 ఏడీ అనే పేరును ఖరారు చేశారు.  ఈ సినిమా ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక లేటెస్ట్‌గా ఈ సినిమాలో కీలకపాత్రలో కమల్ హాసన్ నటిస్తున్నట్లు టీమ్ పేర్కోంది.