బోయపాటి శ్రీనుని ఎవరు కాపాడుతారు..?

బాలకృష్ణ ఈ పేరు వినగానే మనకి కచ్చితంగా గుర్తొచ్చే డైరెక్టర్ పేరు బోయపాటి శ్రీను. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా బోయపాటి సినిమా అనగానే, సినిమాలో తప్పకుండా యాక్షన్ సీన్స్ హైలెట్గా నిలుస్తూ ఉంటాయి. అయితే బోయపాటి తీసిన స్కంద సినిమా కారణంగా.. ఇప్పుడు తను విచారణలో పడినట్లు అయింది. ఎన్నో అంచనాలతో తెరకెక్కించిన స్కందా చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. సూర్యనా.. బాలకృష్ణనా!:  […]

Share:

బాలకృష్ణ ఈ పేరు వినగానే మనకి కచ్చితంగా గుర్తొచ్చే డైరెక్టర్ పేరు బోయపాటి శ్రీను. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా బోయపాటి సినిమా అనగానే, సినిమాలో తప్పకుండా యాక్షన్ సీన్స్ హైలెట్గా నిలుస్తూ ఉంటాయి. అయితే బోయపాటి తీసిన స్కంద సినిమా కారణంగా.. ఇప్పుడు తను విచారణలో పడినట్లు అయింది. ఎన్నో అంచనాలతో తెరకెక్కించిన స్కందా చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది.

సూర్యనా.. బాలకృష్ణనా!: 

తాజా చిత్రం ‘స్కంద’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన విషయాన్ని తెలుసుకుని, స్టార్ బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీనుని రక్షించవలసి వచ్చింది. వాస్తవానికి, బోయపాటి తమిళ స్టార్ సూర్యను కలుసుకున్నారని, అంతేకాకుండా ‘స్కంద’ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ గురించి చర్చ కూడా జరిపినట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం బోయపాటి శ్రీనుతో సూర్య సమావేశమైన మాట నిజమే అని.. భారీ యాక్షన్ అడ్వెంచర్ చేయాలనుకున్నారని.. కానీ ఇప్పుడు సూర్య మరో రెండేళ్లు బిజీగా ఉండడంతో పాటు, ‘స్కంద’ కూడా ఫర్వాలేదనిపించడంతో ఇప్పుడు బోయపాటి మరొక హీరో కోసం హీరో కోసం వెతుకుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

వాస్తవానికి, నందమూరి బాలకృష్ణ ‘స్కంద’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తన అభిమాన దర్శకుడు బోయపాటిపై ప్రశంసలు కురిపించారు. ప్రతి సినిమాతో ఎప్పుడు కూడా తన స్థాయిని పెంచుకుంటూ వెళ్లడానికి మాత్రమే బోయపాటి శ్రీను ప్రయత్నిస్తారని పేర్కొన్నారు బాలకృష్ణ. గత హిట్‌ల గురించి ఆలోచించకుండా ఒక సినిమా తర్వాత మరొకటి ముందుకు సాగుతూనే ఉన్నామని.. తాము ప్రతి సినిమాను కొత్తగా ప్రారంభించామని.. అంతేకాకుండా’సింహా నుండి ‘అకండ’ వరకు పెద్ద హిట్‌లను అందించడానికి దానిపై పూర్తిగా దృష్టి పెట్టామని అని నందమూరి బాలకృష్ణ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మాట్లాడారు. ఇదే వేదికపై బాలకృష్ణతో ‘అఖండ 2’ సినిమా చేస్తానని బోయపాటి చెప్పడంతో స్టేడియంలో నందమూరి అభిమానుల చప్పట్లు కొట్టారు.

నిజానికి బోయపాటి సినిమా చేసేందుకు బాలకృష్ణ ఎప్పుడు వెనకాడడు. బాలకృష్ణ హిట్లు, ఫ్లాప్‌ల గురించి నిజానికి పట్టించుకోరు. ఫలానా దర్శకుడు చెప్పిన కథ ప్రకారం వెళతాడు.. అతనికి నచ్చితే, సినిమాకి ఓకే చెప్తాడు బాలకృష్ణ.

బోయపాటి శ్రీను గురించి మరింత: 

బోయపాటి శ్రీనివాస్ ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా, పెదకాకానిలో జన్మించాడు. గుంటూరులోని జెకెసి కళాశాలలో డిగ్రీ కంప్లీట్ చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నాగార్జున విశ్వవిద్యాలయంలో చేరాడు. అతని కుటుంబం ఫోటో స్టూడియో మీద ఆధారపడి ఉండేది. బోయపాటికి ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉండేది కూడా. ఈనాడు దినపత్రికలో పార్ట్ టైమ్ రిపోర్టర్‌గా పనిచేశాడు. సినిమాల్లో తన కెరీర్ మొదలు పెట్టేందుకు, అతను హైదరాబాద్‌కు వెళ్లాడు. అతని బంధువు పోసాని కృష్ణ మురళి 1997లో ముత్యాల సుబ్బయ్య స్టూడియోలో దర్శకత్వ విభాగంలో పనిచేయమని బోయపాటిని సిఫార్సు చేశాడు. బోయపాటి సుబ్బయ్యతో ఒక చిన్న మాట, గోకులంలో సీత, పెళ్లి చేసుకుంటాం, పవిత్ర ప్రేమ, అన్నయ్య, మనసున్న మారాజు వంటి చిత్రాలకు పనిచేశాడు.

2005లో, రవితేజ, మీరా జాస్మిన్ మరియు ప్రకాష్ రాజ్ నటించిన భద్ర సినిమాతో బోయపాటి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తులసి అతని రెండవ చిత్రం. 2010లో, నయనతార మరియు స్నేహా ఉల్లాల్‌తో కలిసి నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం.. బోయపాటి తీసిన మూడో సినిమా సింహ. 2012లో, జూనియర్ ఎన్టీఆర్, త్రిష మరియు కార్తీక నాయర్ నటించిన తన నాల్గవ చిత్రం దమ్ము చేసాడు. తరువాత 2014లో, బోయపాటి బాలకృష్ణతో లెజెండ్ తీసి హిట్టు కొట్టాడు. అతను క్లాస్ మరియు మాస్ ఆడియన్స్ను సైతం ఆకర్షించే కొంత సెంటిమెంట్ టచ్‌తో కూడిన మాస్, మసాలా ఎంటర్‌టైనర్‌ చిత్రాలను అందించడంలో బోయపాటి ఆరితేరిన వ్యక్తి.