తెలుగు సినీమా పతనానికి వీళ్లే కారణమా? 

ఒకప్పుడు తెలుగు చలనచిత్రాలు అంటేనే సినిమా థియేటర్లకు వెళ్లి హాయిగా కుటుంబ సమేతంగా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాలు చూస్తూ కాలాన్ని గడిపే వాళ్ళు. కానీ ఇప్పుడు చిత్రాలు చూసుకున్నట్లయితే, యూత్, కుటుంబం కలిసి చూసే విధంగా కూడా లేవని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పది సినిమాలు రిలీజ్ అవుతుంటే అందులో ఏడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూనే ఉన్నాయి.. దీనికి ఇక్కడ ముఖ్య కారణం అనుభవం లేని ప్రొడ్యూసర్లు అంటూ సమాధానం వినిపిస్తుంది.  అనుభవం […]

Share:

ఒకప్పుడు తెలుగు చలనచిత్రాలు అంటేనే సినిమా థియేటర్లకు వెళ్లి హాయిగా కుటుంబ సమేతంగా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాలు చూస్తూ కాలాన్ని గడిపే వాళ్ళు. కానీ ఇప్పుడు చిత్రాలు చూసుకున్నట్లయితే, యూత్, కుటుంబం కలిసి చూసే విధంగా కూడా లేవని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పది సినిమాలు రిలీజ్ అవుతుంటే అందులో ఏడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూనే ఉన్నాయి.. దీనికి ఇక్కడ ముఖ్య కారణం అనుభవం లేని ప్రొడ్యూసర్లు అంటూ సమాధానం వినిపిస్తుంది. 

అనుభవం లేని ప్రొడ్యూసర్లే దీనికి కారణమా: 

కేవలం కొంతమంది అసమర్థ ప్రొడ్యూసర్లు టాలీవుడ్‌ను నాశనం చేశారని, సినిమా స్క్రిప్ట్, మేకింగ్ గురించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ వంటివి లేని నిర్మాత, డబ్బు ఖర్చు చేసే జస్ట్ ప్రొడక్షన్ మేనేజర్‌గా నిర్వహించడమే తెలుగు సినిమా పరిశ్రమ పతనానికి కారణమని ప్రముఖ చిత్రనిర్మాతలు అంటున్నారు. 

ఇప్పటికే పెద్ద స్టార్ చిత్రాలతో సహా 40 సినిమాలు ఈ సంవత్సరం అభిమానులను మెప్పించలేకపోయాయి, కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగు సినిమా దుస్థితిని ఊహించుకోండి అని ఒక నిర్మాత చెప్పారు. నిర్మాణంలో ఒక నిర్మాత గుండెపోటుకు గురయ్యాడని, మరో నిర్మాత సినిమాను విడుదల చేయడానికి తన సొంత ఆస్తులను అమ్మేశాడని, ఆ సినిమా విడుదల అయిన తర్వాత రూ. 100 కోట్లలోపే నష్టపోతున్నారని అతను పేర్కొన్నాడు. మరి ముఖ్యంగా సినిమా హీరో హీరోయిన్లు తమ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే, నాలుగైదు రెట్లు పెంచినందున సినిమాలు 6 నుండి 7 రెట్లు బడ్జెట్‌కు మించిపోయాయని.. దీని కారణంగా కూడా చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్న నిర్మాతలు తప్పుకోవడం వల్ల, చిన్న నిర్మాతలు స్క్రిప్ట్, సినిమా మేకింగ్ సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్న క్రమం కనిపిస్తుందని వాపోయారు. 

నిర్మాతల మాటల్లో: 

చాలా మంది ఎన్నారైలు తెలుగు సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నారని శ్రీధర్ ఒప్పుకున్నాడు. సినిమాకు అవసరమైన దానికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలని తప్పుదారి పట్టించే కొద్దిమంది సంపన్న NRIలు సినిమా టూరిజాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. వారికి విదేశాలలో ఇతర వ్యాపారాలు ఉన్నాయని.. కేవలం కొంతవరకు పేరు కోసం మాత్రమే సినిమాలు తీస్తారని అర్థం అర్థం చేసుకున్నట్లు తెలిపారు శ్రీధర్. ఇంకా చెప్పాలంటే వారి టీమ్‌లు రెమ్యునరేషన్‌లను పెంచడం వల్ల మంచి కంటే ఎక్కువ హాని ఎక్కువగా కలుగుతుందని, ఇది సాధారణ నిర్మాతల మీద ప్రభావం చూపిస్తుంది అని ఆయన తెలియజేసారు.

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు తెలుగు సినిమాలకు కొత్త ముప్పు అని ఆయన చెప్పారు. నిజానికి రిపీటెడ్ కంటెంట్ ఉండడం కారణంగా టాలీవుడ్‌లో ఫ్లాప్‌లు పెరుగుతున్నాయని.. పెద్ద తారలు కూడా తమ ఆలోచనలను మార్చుకోవాలని.. తమిళం మరియు మలయాళ తారలు ఎంచుకుంటున్నా నోవల్ ఆధారిత కంటెంట్ ఎంచుకోవాలని ఆయన కోరారు. OTT లలో ఇతర భాషల సినిమాలతో పోటీ పడటం వలన థియేటర్‌లలో డబ్బును రికవరీ చేయలేమని, కాబట్టి సృజనాత్మకత అనేది తెలుగు సిని నిర్మాణంలో ఎంతో అవసరమని మరొకసారి గుర్తు చేశారు ప్రముఖ నిర్మాత. 

ముఖ్యంగా ఏ సినిమా అయినా సరే కుటుంబ పరంగా ఉన్న చిత్రాలే ఇప్పటివరకు ఎక్కువ హిట్ అయిన వైనం కనిపిస్తుంది. ఒకప్పుడు వచ్చిన సినిమాలు నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు నచ్చావ్, కలిసుందాం రా, సూర్యవంశం, సంతోషం ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో కుటుంబ కథా చిత్రాలు ప్రేక్షకులను అలరించాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కథ, స్క్రీన్ ప్లే కారణంగానే సినిమా హిట్ అవుతుందని ఎక్కువ మంది నిర్మాతలు నమ్ముతున్నారు.