బిగ్‌బాస్ ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ య‌వార్ గురించి తెలుసా?

బిగ్ బాస్ ఏడో సీజన్ షురూ అయ్యింది. హోస్ట్ కింగ్ నాగార్జున మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఎంట్రీ ఇచ్చారు. ‘తార్ మార్ తక్కర్ మార్’ పాటతో కింగ్ ఈ సీజన్‌ను ప్రారంభించారు. ఇప్పటి వరకు జరిగిన సీజన్‌ల కంటే ఈ సీజన్ చాలా కొత్తగా ఉంటుందని నాగార్జున చెప్పారు. ఈ సీజన్‌లో కంటెస్టెంట్లు హౌస్‌లో ఉండడం అంత ఈజీ కాదని అన్నారు. ‘పవర్ అస్త్ర’ ఎవరు దక్కించుకుంటారో వాళ్లే హౌస్‌లోకి వెళ్తారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రియాలిటీ షోగా […]

Share:

బిగ్ బాస్ ఏడో సీజన్ షురూ అయ్యింది. హోస్ట్ కింగ్ నాగార్జున మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఎంట్రీ ఇచ్చారు. ‘తార్ మార్ తక్కర్ మార్’ పాటతో కింగ్ ఈ సీజన్‌ను ప్రారంభించారు. ఇప్పటి వరకు జరిగిన సీజన్‌ల కంటే ఈ సీజన్ చాలా కొత్తగా ఉంటుందని నాగార్జున చెప్పారు. ఈ సీజన్‌లో కంటెస్టెంట్లు హౌస్‌లో ఉండడం అంత ఈజీ కాదని అన్నారు. ‘పవర్ అస్త్ర’ ఎవరు దక్కించుకుంటారో వాళ్లే హౌస్‌లోకి వెళ్తారన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద రియాలిటీ షోగా పేరు గాంచిన ‘బిగ్ బాస్’కు ఏ భాషలోనైనా మంచి ఆదరణ లభిస్తుంది. అయితే, ఈ ఆదరణ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల మీద ఆధారపడి ఉంటుంది. మంచి పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు, వివాదాలతో రక్తి కట్టించే తారలు, రొమాంటిక్‌గా కిక్ ఎక్కించే బ్యూటీలు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లుగా ఉంటే ఆ సీజన్‌కు ఆటోమేటిక్‌గా మంచి ఆదరణ వచ్చేస్తుంది. అన్ని సీజన్లు ఒకేలా ఉన్నా ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. అందుకే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 6కి గత సీజన్లతో పోలిస్తే ఆదరణ తగ్గింది. కాబట్టి, ఈ 7 సీజన్ ఆషామాషీగా ఉండకూడదు. అందుకే, షో నిర్వాహకులు ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7ను రెగ్యులర్ మోడ్‌లో కాకుండా ‘ఉల్టా పుల్టా’ అనే కాన్సెప్ట్‌తో నడిపించబోతున్నారు. ప్రేక్షకుల అంచనాలను అందకుండా సరికొత్తగా ఈ సీజన్‌ను హోస్ట్ నాగార్జున ప్రజెంట్ చేయబోతున్నారు. 3 సెప్టెంబర్ రోజు రాత్రి 7 గంటలకు ఏడో సీజన్ ప్రారంభమైంది. తొలి కంటెస్టెంట్‌గా టీవీ నటి, ‘జానకి కలగనలేదు’ ఫేమ్ ప్రియాంక జైన్‌ను నాగార్జున పరిచయం చేశారు. అయితే, హౌస్‌లోకి వెళ్లిన ప్రియాంక.. లోపల కూర్చోడానికి సోఫాలు లేవని తను ఎక్కడ కూర్చోవాలని అడిగారు. అయితే, ఆ సోఫాలతో హౌస్‌లో చాలా అవరసరాలను కంటెస్టెంట్స్ స్వయంగా సంపాదించుకోవాలని నాగ్ చెప్పారు.

ఇక రెండో కంటెస్టెంట్‌గా హీరో శివాజీ హౌస్‌లోకి వెళ్లారు. ఆయన తరవాత నేపథ్య గాయని దామిని భట్ల మూడో కంటెస్టెంట్‌గా వెళ్లారు. అయితే, దామిని ఇంకా హౌస్‌మేట్‌గా కన్ఫర్మ్ కాలేదని నాగార్జున ట్విస్ట్ ఇచ్చారు. దామిని హౌస్‌లోకి అయితే వెళ్తుంది కానీ.. ఆమె ఇంకా కంటెస్టెంట్‌గా కన్ఫర్మ్ కాలేదన్నారు. ఇక నాలుగో కంటెస్టెంట్‌గా ప్రిన్స్ యావర్‌ను నాగార్జున పరిచయం చేశారు. మోడల్, ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన ప్రిన్స్.. వచ్చీ రావడంతో కండల ప్రదర్శన చేశాడు. అంతేకాదు, నాగార్జున ఎదుట తెగ హడావుడి చేశాడు. దీంతో నీ పేరు యావరా.. ఓవరా అని సెటైర్ వేశారు నాగ్. 

అసలు ఎవరీ  ప్రిన్స్ యవార్

ప్రిన్స్… 12 జూన్ 1996న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించారు. తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, యావర్ హైదరాబాదులోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ , PG కళాశాలలో డిగ్రీ చేశారు. చిన్నప్పటి నుండి, యావర్ కు ఫిట్‌నెస్, మోడలింగ్‌పై ఆసక్తి ఎక్కువ. అతని కళాశాల రోజుల్లో, యావర్ మోడలింగ్‌లో పాల్గొనేవారు.

ఈ కుర్ర మోడల్… 2017వ సంవత్సరంలో… ప్రిన్స్ యావార్ చంద్రకాంత అనే హిందీ సీరియల్‌ తో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. అందులో అతను ఒక చిన్న పాత్రను పోషించాడు. యావర్ తర్వాత తెలుగు టెలివిజన్ పరిశ్రమలో నా పేరు మీనాక్షి సీరియల్‌తో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత హిట్లర్ గారి పెళ్లాం (జీ తెలుగు), అభిషేకం (ఈటీవీ), కలిసి ఉంటే కలదు సుఖం (స్టార్ మా) వంటి కొన్ని సీరియల్స్‌లో నటించారు. ఇక సినిమాల విషయానికి వస్తే… కమిట్‌మెంట్ మిస్టేక్ వంటి రెండు సినిమాల్లో నటించారు. అంతే కాదు పలు యాడ్స్ లో కూడా ప్రిన్స్ యావార్ నటించారు. ఇప్పుడు ఈ మోడల్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు. అందం, యాక్టింగ్ తోనే కాకుండా డ్యాన్స్‌లతో ఆలరించే ప్రిన్స్ యావార్ బిగ్‌బాస్ మనసు దోచుకొన్నారు. దాంతో అతనికి బిగ్‌బాస్‌ తెలుగు 7 సీజన్‌లో పాల్గొనే ఆఫర్ లభించింది.

ఆ తరవాత ఐదో కంటెస్టెంట్‌గా నటి శుభశ్రీ, సెన్సేషనల్ కంటెస్టెంట్ గా సీనియర్ నటి షకీలా,  8వ కంటెస్టెంట్‌గా టీవీ నటి శోభా శెట్టి, 9వ కంటెస్టెంట్‌గా టేస్టీ తేజ, 10వ కంటెస్టెంట్‌గా నటి రిథిక రోజ్, యంగ్ హీరో డాక్టర్ గౌతమ్ కృష్ణ 11వ కంటెస్టెంట్‌గా, ప్రముఖ యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ ఎట్టకేలకు 13వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లారు. 14వ కంటెస్టెంట్‌గా టీవీ నటుడు అమర్‌దీప్ చౌదరి ఎంటర్ అయ్యారు. అయితే, హౌస్‌లోకి వెళ్లినవాళ్లంతా ప్రస్తుతానికి కంటెస్టెంట్స్ మాత్రమేనని.. ఇంకా వాళ్లంతా హౌస్‌మేట్స్ కాదని నాగార్జున అన్నారు. ప్రస్తుతానికి అయితే బిగ్ బాస్ హౌస్‌కి లాక్ చేసేశారు. రేపటి నుంచి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌ల ఆధారంగా హౌస్‌మేట్స్ ఎవరన్నది తేలుతుంది.