రామ్ చరణ్ అలాగే మారాడు: ఉపాసన

టాలీవుడ్ స్టార్ కపుల్ గా పేరు గాంచిన రామ్ చరణ్, ఉపాసన జంట ఇప్పుడు తెగ ఆనందంలో ఉన్నారు. కొద్ది రోజులే కిందటే ఈ జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ తో పాటు వారు కూడా తెగ ఖుషీ అవుతున్నారు. ఇక కుటుంబ సభ్యుల ఆనందానికైతే అవధులు లేకుండా పోయాయి. చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ స్టార్ కపుల్ కు మొన్నే సంతానం కలగడంతో వారు తెగ ఖుష్ అవుతున్నారు. వారి […]

Share:

టాలీవుడ్ స్టార్ కపుల్ గా పేరు గాంచిన రామ్ చరణ్, ఉపాసన జంట ఇప్పుడు తెగ ఆనందంలో ఉన్నారు. కొద్ది రోజులే కిందటే ఈ జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ తో పాటు వారు కూడా తెగ ఖుషీ అవుతున్నారు. ఇక కుటుంబ సభ్యుల ఆనందానికైతే అవధులు లేకుండా పోయాయి. చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ స్టార్ కపుల్ కు మొన్నే సంతానం కలగడంతో వారు తెగ ఖుష్ అవుతున్నారు. వారి కూతురు మొదటి చూపు కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ బుల్లి సూపర్ స్టార్ వి ఎన్నో చిత్రాలు రిలీజ్ చేసిన మెగా ఫ్యామిలీ ఆ అమ్మాయి ఫేస్ కూడా కనబడకుండా జాగ్రత్త పడింది. దీంతో ఫ్యాన్స్ నిరాశలో ఎదురు చూస్తున్నారు. 

క్లింకారా కొణిదెల గా నామకరణం

ఏళ్ల తర్వాత కలిగిన సంతానానికి ఆ దంపతులు క్లింకారా కొణిదెలగా నామకరణం చేశారు. క్లింకారా అనే పేరు గురించి అంతా ఆరా తీశారు. ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందో అని అంతా ఆసక్తిగా సెర్చ్ చేశారు. ఈ పేరు వేదాల నుంచి వచ్చిందని తెలుసుకుని అంతా రిలాక్స్ అయ్యారు. ఆసుపత్రిలో ఉపాసన డెలివరీ కోసం ఉన్నపుడు చాలా మంది మెగా అభిమానులు ఆసుపత్రి ముందుకి వచ్చి చేరారు. తమకు బుల్లి స్టార్ ను చూపెట్టాలని వారు డిమాండ్స్ చేశారు. తమ హీరో వారసురాలిని చూద్దామని వచ్చిన వారికి నిరాశే ఎదురైంది. వారందరికీ థ్యాంక్స్ చెప్పిన చెర్రీ దంపతులు నవజాత శిశువును మాత్రం చూపించకుండానే వెళ్లిపోయారు. తర్వాత వీరు గ్రాండ్ గా నామకరణం చేశారు. ఈ నామకరణ మహోత్సవంలో పుట్టిన పాపకి క్లింకారా గా నామకరణం చేశారు. ఈ పేరును అనౌన్స్ చేసినపుడు సోషల్ మీడియాలో పేరు మారు మోగిపోయింది. దీంతో పేరు సూపర్ గా ఉందంటూ మెగా ఫ్యాన్స్ సందడి చేశారు. 

చెర్రీ అలాంటి వాడే…

కొన్ని రోజుల క్రితం ఉపాసన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. తన హస్బెండ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. రామ్ చరణ్ చాలా చీజీ అని ఉపాసన తెలిపింది. తనను ఎంతో ప్రేమగా చూసుకుంటాడని వెల్లడించింది. అంతే కాకుండా తమ బంధం తొలినాళ్లలో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని కూడా ఉపాసన పంచుకుంది. అందుకోసమే తాను చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తానని వెల్లడించింది. 

మేమిద్దరం అలానే చేస్తాం

తాము ఇద్దరం ప్రాక్టికల్ గానే ఆలోచిస్తామని, అందుకే తమ మధ్య తరచూ సమస్యలు రావని ఉపాసన తెలిపింది. నువ్వు ఎప్పటికీ ప్రేమలో పడలేవు.. నువ్వు ఎదగలేవని రామ్ చరణ్ తరచూ అంటుంటాడని ఉపాసన తెలిపింది. మీరు ఎవరైనా మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటామని ఆమె తెలిపింది. 

అవును వారిది ప్రేమ వివాహమే…. 

అందరూ అనుకుంటున్నట్లుగా రామ్ చరణ్ – ఉపాసనలది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. వారిది లవ్ మ్యారేజ్. ఉపాసన చెన్నైలో చదువుకునే రోజుల్లో రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లికి ముహూర్తం పెట్టించారు. చాలా రోజుల డేటింగ్ తర్వాత వీరు 2011లో నిశ్చితార్థంతో ఒక్కటి కాగా.. 2012 జూన్ లో వీరి వివాహం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత వీరికి తొలి సంతానం కలిగింది. వీరితో పెళ్లయిన చాలా మంది హీరోలకు ఇప్పటికే సంతానం కలగ్గా.. వీరికి కూడా రీసెంట్ గా పండంటి బిడ్డ జన్మించింది. ఉపాసన కొణిదెల ఒక బిజినెస్ కుటుంబానికి చెందిన మహిళ.