ఓపెన్‌హైమ‌ర్.. భ‌గ‌వద్గీత‌కు ఈ సినిమాకు సంబంధం ఏంటి?

బ్రిటిష్ అమెరిక‌న్ ఫిలిం మేక‌ర్ క్రిస్టొఫ‌ర్ నోలాన్ తెరకెక్కించిన సినిమా ఓపెన్‌హైమ‌ర్.  అటామిక్ బాంబ్‌ను క‌నిపెట్టిన అమెరిక‌న్ థియోరెటిక‌ల్ ఫిజిసిస్ట్, సైంటిస్ట్ రాబ‌ర్ట్ ఓపెన్‌హైమ‌ర్ జీవిత ఆధారంగా ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. ఇందులో ఓపెన్‌హైమ‌ర్ క్యారెక్ట‌ర్‌లో సిలియ‌న్ మ‌ర్ఫీ న‌టించారు.  అయితే ఈ సినిమాకు.. మ‌న భ‌గ‌వద్గీత‌కు ఒక సంబంధం ఉంది తెలుసా? అదేంటంటే.. రెండవ ప్ర‌పంచ యుద్ధం స‌మ‌యంలో ఓపెన్‌హైమ‌ర్ అమెరికాలోని లోస్ ఆల‌మోస్ ల్యాబొరేట‌రీలో ప‌నిచేస్తుండేవారు. 1942లో మ్యాన్‌హాట్ట‌న్ ప్రాజెక్ట్ ఓ న్యూక్లియ‌ర్ […]

Share:

బ్రిటిష్ అమెరిక‌న్ ఫిలిం మేక‌ర్ క్రిస్టొఫ‌ర్ నోలాన్ తెరకెక్కించిన సినిమా ఓపెన్‌హైమ‌ర్.  అటామిక్ బాంబ్‌ను క‌నిపెట్టిన అమెరిక‌న్ థియోరెటిక‌ల్ ఫిజిసిస్ట్, సైంటిస్ట్ రాబ‌ర్ట్ ఓపెన్‌హైమ‌ర్ జీవిత ఆధారంగా ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. ఇందులో ఓపెన్‌హైమ‌ర్ క్యారెక్ట‌ర్‌లో సిలియ‌న్ మ‌ర్ఫీ న‌టించారు. 

అయితే ఈ సినిమాకు.. మ‌న భ‌గ‌వద్గీత‌కు ఒక సంబంధం ఉంది తెలుసా? అదేంటంటే.. రెండవ ప్ర‌పంచ యుద్ధం స‌మ‌యంలో ఓపెన్‌హైమ‌ర్ అమెరికాలోని లోస్ ఆల‌మోస్ ల్యాబొరేట‌రీలో ప‌నిచేస్తుండేవారు. 1942లో మ్యాన్‌హాట్ట‌న్ ప్రాజెక్ట్ ఓ న్యూక్లియ‌ర్ బాంబ్‌ను క‌నిపెట్టేందుకు య‌త్నిస్తోంది. ఆ ప్రాజెక్ట్ కోసం ఓపెన్‌హైమ‌ర్ ప‌నిచేసారు. ఎన్నో ఎక్స్‌ప‌రిమెంట్లు చేసాక 1945లో మొద‌టి ఆటామిక్ బాంబ్‌ని త‌యారుచేసారు. దీనిని టెస్ట్ చేయ‌డానికి ట్రినిటీ అనే పేరుతో టెస్టింగ్ చేసారు.

న్యూ మెక్సికో ఎడారిలో ఈ ట్రినిటీ టెస్ట్‌ను చేప‌ట్టారు. ఈ టెస్ట్ పూర్త‌య్యాక‌.. ఓపెన్‌హైమ‌ర్‌కు భ‌గ‌వద్గీత‌లోని ఓ శ్లోకం గుర్తొచ్చింద‌ట‌. ఓపెన్‌హైమ‌ర్‌కు ఎక్కువ‌గా ఆధ్యాత్మిక పుస్త‌కాలు చ‌దివే అలవాటు ఉండేది. ఆయ‌న చ‌దివిన వాటిలో మ‌న భ‌గ‌వ‌ద్గీత ఒక‌టి. ట్రినిటీ టెస్ట్‌లో న్యూక్లియ‌ర్ బాంబును స‌క్సెస్‌ఫుల్‌గా టెస్ట్ చేసాక ఓపెన్‌హైమ‌ర్‌కు ఇప్పుడు నేను ప్ర‌పంచాల‌ను నాశ‌నం చేసే చావుని అయ్యాను అని భ‌గవ‌ద్గీత‌లో రాసిన శ్లోకం గుర్తుకొచ్చింద‌ట‌.

ఈ ట్రినిటీ టెస్ట్‌పై ప్ర‌ముఖ అమెరిక‌న్ ఛానెల్ ఎన్‌బిసి 1965లో ఓ డాక్యుమెంట‌రీని రిలీజ్ చేసింది. దీనికి ది డెసిష‌న్ టు డ్రాప్ ది బాంబ్ అనే టైటిల్ పెట్టారు. ఇందులో స్వ‌యంగా ఓపెన్‌హైమ‌ర్ త‌న ట్రినిటీ టెస్ట్ గురించి మాట్లాడారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న చేసిన కామెంట్స్ తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసాయి. ప్ర‌పంచం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు అన్న విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. కొంద‌రు న‌వ్వుతారు.. కొంద‌రు ఏడుస్తారు.. చాలా మంది సైలెంట్ అయిపోయారు. అదే స‌మ‌యంలో నాకు హిందూ పురాణం అయిన భ‌గ‌వ‌ద్గీతలోని ఓ శ్లోకం గుర్తుకు వ‌చ్చింది. నాకే కాదు.. ట్రినిటీ టెస్ట్‌లో న్యూక్లియర్ బాంబును టెస్ట్ చేస్తున్న‌ప్పుడు అక్క‌డున్న వారంద‌రికీ అదే గుర్తుకు వ‌చ్చింది అని తెలిపారు.

ఆ ఆరోప‌ణ‌ల‌తో ఓపెన్‌హైమ‌ర్ కెరీర్ పోయింది

అణు బాంబుపై రీసెర్చ్ తరువాత, ఓపెన్‌హైమర్ 1947 నుండి 1966 వరకు ప్రిన్స్‌టన్, న్యూజెర్సీలో ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీ డైరెక్టర్‌గా పనిచేశాడు. అయితే అప్పట్లో అతని మీద వచ్చిన అనేకమైన ఆరోపణల కారణంగా, అతని జీవితంలో కరీర్ విషయంలో దెబ్బతిన్నాడు. ఈ ఆరోపణలు అతని భద్రతా క్లియరెన్స్‌ను ఉపసంహరించుకోవడానికి మరియు US ప్రభుత్వ అత్యున్నత ర్యాంక్‌లోని సలహా స్థానాల నుండి అతనిని తొలగించడానికి దారితీసింది.

1967, ఫిబ్ర‌వ‌రి 18న ఓపెన్‌హైమ‌ర్ క‌న్నుమూసారు. 62 ఏళ్లు బ‌తికిన ఆయ‌న అటామిక్ బాంబు త‌యారుచేస్తున్న స‌మ‌యంలో అందులో వాడిన ర‌సాయ‌నాల‌ను ఎక్కువ‌గా పీల్చ‌డంతో ఆయ‌న‌కు గొంతు క్యాన్స‌ర్ వ‌చ్చింది. అలా ఆయ‌న త‌న ప్రొఫెష‌న్ వ‌ల్ల వ‌చ్చిన జ‌బ్బు కార‌ణంగా తుదిశ్వాస విడిచారు.

ఈ ఏడాదిలో హాలీవుడ్‌లో రిలీజ్ కానున్న, ఫ్యాన్స్ ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఓపెన్‌హైమ‌ర్ ఒక‌టి. జులై 21న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో ఓపెన్‌హైమ‌ర్ క్యారెక్ట‌ర్‌లో న‌టించిన మ‌ర్ఫీ.. త‌న రోల్‌కు న్యాయం చేయాల‌ని భ‌గ‌వ‌ద్గీత‌ను చ‌దివాన‌ని చెప్పారు. త‌న‌కు భ‌గ‌వ‌ద్గీత‌లోని చాలా శ్లోకాలు ఎంతో న‌చ్చాయ‌ని, చాలా స్ఫూర్తిదాయ‌కంగా ఉన్నాయని సినిమా ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో మర్ఫీ తెలిపారు. ఓపెన్‌హైమ‌ర్‌కి భ‌గ‌వ‌ద్గీత అనేది ఓదార్పు లాంటిద‌ని ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కు కావాల్సింది ఆ ఓదార్పేనని అన్నారు. 

ప్రభుత్వ వ్యవహారాలలో శాస్త్రవేత్తల ప్రమేయం గురించి లేవనెత్తిన, లోతైన రాజకీయ మరియు నైతిక ప్రశ్నల కారణంగా ఓపెన్‌హైమర్ కేసు దృష్టిని ఆకర్షించింది.  రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం మరియు అతని కెరీర్కి సంబంధించిన అనేకమైన సంఘటనలు చారిత్రక మరియు శాస్త్రీయ ఆసక్తికి సంబంధించిన అంశంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.