OMG 2 సినిమా వెన‌కున్న వివాదం ఏంటి?

బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ న‌టించిన కొత్త సినిమా OMG 2 (ఓ మై గాడ్). ఇందులో అక్ష‌య్ శివుడి పాత్ర‌లో నటించారు. ఆయ‌న‌తో పాటు పంక‌జ్ త్రిపాఠి, యామి గౌత‌మ్‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమా పోస్ట‌ర్ రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి బాలీవుడ్‌కి టెన్ష‌న్ పట్టుకుంది. అస‌లు సెన్సార్ బోర్డు ఈ సినిమాను రిలీజ్ చేయ‌డానికి ఒప్పుకుంటుందో లేదో.. ప్ర‌జ‌లు కొన్ని ఆధ్యాత్మిక సంఘాలు రిలీజ్ అవ్వ‌నిస్తాయో లేదో అని సినిమా తీసిన వారి […]

Share:

బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ న‌టించిన కొత్త సినిమా OMG 2 (ఓ మై గాడ్). ఇందులో అక్ష‌య్ శివుడి పాత్ర‌లో నటించారు. ఆయ‌న‌తో పాటు పంక‌జ్ త్రిపాఠి, యామి గౌత‌మ్‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమా పోస్ట‌ర్ రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి బాలీవుడ్‌కి టెన్ష‌న్ పట్టుకుంది. అస‌లు సెన్సార్ బోర్డు ఈ సినిమాను రిలీజ్ చేయ‌డానికి ఒప్పుకుంటుందో లేదో.. ప్ర‌జ‌లు కొన్ని ఆధ్యాత్మిక సంఘాలు రిలీజ్ అవ్వ‌నిస్తాయో లేదో అని సినిమా తీసిన వారి గుండెల్లో గుబులు మొద‌లైంది. అస‌లు ఎందుకు ఇది ఇంత వివాదాస్ప‌దం అవుతోంది? తెలుసుకుందాం.

2012లో OMG సినిమా రిలీజ్ అయింది. అందులో కూడా అక్ష‌య్ కుమార్ కృష్ణుడిగా మెయిన్ క్యారెక్ట‌ర్‌లో న‌టించారు. ఆ సినిమా అప్ప‌ట్లో మంచి హిట్ అందుకుంది. ఇది హిట్ అవ‌డంతో తెలుగులో గోపాల గోపాల సినిమా తీసారు. తెలుగులో కృష్ణుడి పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించారు. వెంక‌టేష్, శ్రియ భార్యాభ‌ర్త‌ల పాత్ర‌లు పోషించారు. కానీ హిందీలో హిట్ అయినంత‌గా తెలుగులో హిట్ అవ్వ‌లేదు. ఇప్పుడు OMG2 సినిమా తీసారు. దీనికి డైరెక్ట‌ర్ అమిత్ రాయ్.

ఈ సినిమా పోస్ట‌ర్ రిలీజ్ అవ్వ‌గానే సెన్సార్ బోర్డు త‌ల‌ప‌ట్టుకుంది. ఎందుకంటే అప్ప‌టికే షూటింగ్ అయిపోయి స‌ర్టిఫికేష‌న్ కోసం పంపించారు. కానీ సెన్సార్ బోర్డు వెంట‌నే స‌ర్టిఫికేష‌న్ ఇవ్వ‌డానికి ఒప్పుకోలేదు. ఇందుకు కార‌ణం ఆదిపురుష్ సినిమానే. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను తీసారు. ఇందులో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో కృతి స‌నన్ సీత పాత్ర‌లో న‌టించారు. సినిమాకు క్లీన్ యూ/ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. తీరా చూస్తే ఆదిపురుష్ సినిమాపై ఎన్నో విమ‌ర్శలు, ట్రోలింగ్స్ వ‌చ్చాయి. అస‌లు రావ‌ణాసురుడి పాత్ర‌ను అలా వెట‌క‌రాంగా ఎలా డిజైన్ చేసారు? ప్రభాస్‌ను రాముడిలా కాకుండా జీస‌స్‌లా ఎలా చూపిస్తారు? హ‌నుమంతుడి చేత తేరా బాప్ అంటూ ఆ డైలాగులు ఎలా చెప్పిస్తారు అంటూ నెటిజ‌న్లు ఉతికి ఆరేసారు.

సినిమా చూసాక సెన్సార్ బోర్డు ఎందుకు అభ్యంత‌రం తెల‌పలేదు అంటూ సెన్సార్ వాళ్ల‌ని కూడా నోటికొచ్చిన‌ట్లు తిట్టారు. ఇప్పుడు OMG 2 సినిమాతో అక్ష‌య్ కుమార్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. అస‌లే ఇందులో ఆయ‌న శివుడి పాత్ర‌లో న‌టించారు. దాంతో సినిమాకు స‌ర్టిఫికేట్ ఇచ్చేముందు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల‌ని సెన్సార్ బోర్డు నిర్ణ‌యించుకుంది. బాగా ఆలోచించి సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చింది. కాక‌పోతే ఈ సినిమాలో ఎలాంటి అభ్యంత‌క‌ర‌మైన స‌న్నివేశాల‌ను క‌ట్ చేయ‌లేదు.

కాక‌పోతే ఆ అభ్యంత‌క‌ర స‌న్నివేశాల‌ను మాడిఫై చేయాల‌ని సెన్సార్ బోర్డు డైరెక్ష‌న్ టీంకు ఆదేశాలు జారీ చేసింది. లేదంటే సినిమాను రిలీజ్ చేసినా ప్రేక్ష‌కులే సినిమాను బ్యాన్ చేసే ప్రమాదం ఉంద‌ని హెచ్చ‌రించింది. దాంతో ఎందుకు వ‌చ్చిన గొడ‌వ అనుకుని టీం సెన్సార్ బోర్డు చెప్పిన‌ట్లు కొన్ని సీన్ల‌ను మార్చేసింది. అయిన‌ప్ప‌టికీ సెన్సార్ బోర్డు ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా ట్రైల‌ర్ ఈ నెల 3న రిలీజ్ అవ‌బోతోంది. సినిమాను ఆగ‌స్ట్ 11న రిలీజ్ చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు.

OMGలో ప‌రేష్ రావ‌ల్ కీ రోల్‌లో యాక్ట్ చేసారు. OMG 2లో కూడా ఆయ‌న్నే తీసుకోవాల‌నుకున్నారు. కానీ ఆదిపురుష్ త‌ర్వాత అలాంటి ఆధ్యాత్మిక చిత్రాల్లో న‌టించేందుకు యాక్ట‌ర్లు భ‌య‌ప‌డుతున్నారు. దాంతో OMG 2లో న‌టించ‌న‌ని ప‌రేష్ రావ‌ల్ చెప్పేసారు. దాంతో ఆయ‌న స్థానంలో పంక‌జ్ త్రిపాఠిని తీసుకున్నారు. ఆదిపురుష్‌లా కాకుండా మ‌రి ఈ సినిమా ఏ మేర‌కు మెప్పిస్తుందో వేచి చూడాలి.