భోళా శంక‌ర్ గురించి మెహ‌ర్ ర‌మేష్ ముచ్చ‌ట్లు

స‌రైన హిట్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్‌. కిక్ సినిమా త‌ర్వాత మెహ‌ర్‌కు చెప్పుకోద‌గ్గ హిట్ ఒక్క‌టి కూడా లేదు. ఇప్పుడు ఆయ‌న ఆశ‌ల‌న్నీ మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన భోళా శంక‌ర్ సినిమాపైనే ఉన్నాయి. త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన వేదాళం సినిమాకు భోళా శంక‌ర్ రీమేక్‌గా వ‌స్తోంది. ఇందులో సుశాంత్ అక్కినేని కీ రోల్‌లో న‌టించారు. హీరోయిన్‌గా త‌మ‌న్నా.. చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ న‌టించారు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చే ప్ర‌తి […]

Share:

స‌రైన హిట్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్‌. కిక్ సినిమా త‌ర్వాత మెహ‌ర్‌కు చెప్పుకోద‌గ్గ హిట్ ఒక్క‌టి కూడా లేదు. ఇప్పుడు ఆయ‌న ఆశ‌ల‌న్నీ మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన భోళా శంక‌ర్ సినిమాపైనే ఉన్నాయి. త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన వేదాళం సినిమాకు భోళా శంక‌ర్ రీమేక్‌గా వ‌స్తోంది. ఇందులో సుశాంత్ అక్కినేని కీ రోల్‌లో న‌టించారు. హీరోయిన్‌గా త‌మ‌న్నా.. చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ న‌టించారు.

ఇండ‌స్ట్రీకి వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రూ చిరంజీవితో క‌లిసి ప‌నిచేయాల‌ని అనుకుంటారు. అలాంటి చిరుని డైరెక్ట్ చేసే ఛాన్స్ మెహ‌ర్‌కు కాస్త త్వ‌ర‌గానే ద‌క్కింది. అందులోనూ పెద్ద‌గా హిట్స్ లేని ఆయ‌న‌కు చిరు ఓకే చెప్పారంటే అది ఆయ‌న పెద్ద మ‌నసు. కానీ చిరు కోసం ఓ మంచి క‌థ‌ను సొంతంగా రాసి తీసుంటే బాగుండేది. కానీ మెహ‌ర్ రీమేక్‌ను ఎంచుకున్నారు. ఇటీవ‌ల భోళా శంక‌ర్ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఇందులో చిరంజీవి.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఇమిటేట్ చేసే సీన్‌ను పెట్టించారు మెహ‌ర్. ఇలాంటి సీన్లు చ‌ప్ప‌ట్లు కొట్ట‌డానికి, థియేట‌ర్‌లో క్లాప్స్ కొట్టడానికే ప‌నికొస్తాయి కానీ సినిమా హిట్ అవ్వ‌డానికి ప‌నికిరావు.

చిరంజీవితో క‌లిసి రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా భోళా శంక‌ర్ సినిమాపై ప‌నిచేస్తున్నారు మెహ‌ర్. దాంతో ఆయ‌న క‌ల సాకారమైన‌ట్లు అనిపిస్తోంద‌ట‌. భోళా శంక‌ర్ ట్రైల‌ర్, పాట‌లు రిలీజ్ అయ్యాక సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయ‌ని మెహ‌ర్ అన్నారు. వాటిని చూసి ప్ర‌శాంత్ నీల్, సుకుమార్ లాంటి డైరెక్ట‌ర్లు కాల్ చేసి కంగ్రాట్స్ చెప్తుంటే ఎంతో సంతోషంగా ఉంద‌ని అన్నారు. సినిమా కూడా అంతే హిట్ అవుతుంద‌న్న ఆశ‌తో ఉన్నారు.

కంటెంట్ ఉన్న సినిమాల‌క‌న్నా స్టార్ హీరోలు ఉన్న సినిమాలు చేయ‌డ‌మే త‌న‌కి సులువు అని మెహ‌ర్ అన్నారు. అంటే స్టార్స్ ఉంటే ఆటోమేటిక్‌గా జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ఆ రేంజ్‌లో క‌లెక్ష‌న్లు రావ‌ని ఇన్‌డైరెక్ట్‌గా మెహ‌ర్ అంటున్నారు. అంటే స్టార్స్ లేకుండా కేవ‌లం కంటెంట్ ఉన్న సినిమాలు ఇస్తే ఆయ‌న చేయ‌లేరేమో. ఇప్ప‌టివ‌ర‌కు మెహ‌ర్ త‌న కెరీర్‌లో చిన్న హీరోల‌ను పెట్టి సినిమాలు తీసింది లేదు. ఎన్టీఆర్, ప్ర‌భాస్, ర‌వితేజల‌తో క‌లిసి ప‌నిచేసారు.

దాదాపు ఐదేళ్ల త‌ర్వా భోళా శంక‌ర్ సినిమాతో మెహ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ ఐదేళ్లు తానేమీ బ్రేక్‌లో లేన‌ని, ఎన్నో స్క్రిప్ట్స్‌పై వ‌ర్క్ చేస్తూనే ఉన్నాన‌ని అన్నారు. కాక‌పోతే కోవిడ్, లాక్ డౌన్ వ‌ల్ల పెద్ద‌గా సినిమాలు చేయ‌లేక‌పోయాన‌ని అన్నారు. భోళా శంక‌ర్ సినిమా గురించి మాట్లాడుతూ.. త‌మిళంలో ఉన్న‌ట్లే తీస్తే నేటివిటీ పోతుంది కాబ‌ట్టి చాలా మ‌టుకు మార్పులు చేసిన‌ట్లు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే స్క్రిప్ట్ రెడీ చేయ‌డానికి రెండేళ్లు ప‌ట్టింద‌ని అన్నారు. అప్పుడు ఆయ‌న‌పై చాలా ట్రోల్స్ వ‌చ్చాయి. ఎందుకంటే తీసేది రీమేక్ సినిమా అయిన‌ప్పుడు మ‌ళ్లీ స్క్రిప్ట్‌పై వ‌ర్క్ చేయ‌డం ఎందుకు అని కామెంట్స్ చేసారు.

చాలా మంది ఫ్యాన్స్ సినిమా ట్రైల‌ర్ ప‌ట్ల అసంతృప్తికరంగా ఉన్నారు. ఎందుకంటే మ‌ళ్లీ వాల్తేరు వీర‌య్య సినిమా చూస్తున్న‌ట్లే ఉంద‌ట‌. అస‌లు ఎందుకు చిరంజీవి చేత క్రింజ్ సీన్లు చేయిస్తున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇందులో యాంక‌ర్ రష్మి గౌత‌మ్ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో యాక్ట్ చేసారు. మ‌రో యాంక‌ర్ అయిన శ్రీముఖి కూడా ఇందులో ఉన్నారు. సినిమాలో మెహ‌ర్ చిరంజీవి, శ్రీముఖిల చేత ఖుషి న‌డుము సీన్‌ను రీక్రియేట్ చేయించార‌ట‌. దాంతో ఫ్యాన్స్ స‌క్సెస్ అవుతుంద‌నే న‌మ్మ‌కం కూడా పోయింది అని కామెంట్స్ చేస్తున్నారు.