డైలమాలో పడిన వివి వినాయక్

బోలా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి మరో భారీ బడ్జెట్ సినిమాతో మనందరం ఎందుకు రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు గాను నిర్మాత చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల అంటూ వార్తలు వినబడుతున్నాయి. వివి వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న చిరంజీవి చిత్రం రానున్నట్లు, ఇటీవల వీవీ వినాయక్ని కలిసిన చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. కానీ సరైన స్క్రిప్ట్ సెట్ అవ్వకపోవడం వల్ల, చిరంజీవి వేరే ప్రాజెక్టు మీద దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.  […]

Share:

బోలా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి మరో భారీ బడ్జెట్ సినిమాతో మనందరం ఎందుకు రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు గాను నిర్మాత చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల అంటూ వార్తలు వినబడుతున్నాయి. వివి వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న చిరంజీవి చిత్రం రానున్నట్లు, ఇటీవల వీవీ వినాయక్ని కలిసిన చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. కానీ సరైన స్క్రిప్ట్ సెట్ అవ్వకపోవడం వల్ల, చిరంజీవి వేరే ప్రాజెక్టు మీద దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 

వివి వినాయక్-చిరు కాంబో: 

చిరంజీవి, వివి వినాయక్ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన ఠాగూర్ చిత్రం ఎంత భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాను సుష్మిత కొణిదెల నిర్మించనున్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల ఎప్పటినుంచో తన సొంత బ్యానర్ మీద చిరంజీవి తొలి చిత్రాన్ని నిర్మించే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి ప్రస్తుతం రాబోయే చిత్రం గురించి మాట్లాడుతూ సుష్మిత తప్పకుండా ఈ సినిమా తర్వాత ఒక పెద్ద నిర్మాతగా మారుతుందని, రాబోతున్న చిత్రం గురించి మరో హింట్ అందజేశారు. 

అయితే ఈసారి రాబోతున్న చిత్రం ద్వారా చిరంజీవి మళ్ళీ ప్రేక్షకులను అలరిస్తూ, కామెడీ ఎంటర్టైన్మెంట్ కలగలిపి ఉండేలా ఫ్యాన్స్ కోసం ప్రత్యేకమైన సినిమా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. కానీ స్క్రిప్ట్ కారణంగా వివి వినాయక్-చిరు కాంబో రాబోతున్న చిత్రం నిర్మాణానికి కాస్త సమయమే పట్టేలా కనిపిస్తుంది. డైరెక్టర్ వశిష్టతో చిరంజీవి తన మరో సినిమాపై దృష్టి పెట్టాలని చెప్పడంతో, వివి వినాయక్ మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే అని నివేదికలు పేర్కొన్నాయి. 

వివి వినాయక్ హిట్స్: 

వినాయక్ టాలీవుడ్‌లోని ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్నారు. చిరంజీవి (ఠాగూర్), బాలకృష్ణ (చెన్నకేశవ రెడ్డి), జూనియర్ ఎన్టీఆర్ (ఆది), రామ్ చరణ్ (నాయక్) మరియు రవితేజ (కృష్ణ) వంటి పెద్ద స్టార్‌లతో కలిసి పనిచేశాడు. ఈ ప్రతి ఒక్క చిత్రం కూడా ఒక అప్పట్లో పెద్ద హిట్ కొట్టాయని చెప్పుకోవాలి.

బెల్లంకొండ శ్రీనివాస్, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలతో కూడా పనిచేశాడు. బెల్లంకొండతో ఆయన తీసిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టగా, సాయిధరమ్ తేజ్‌తో చేసిన మరో చిత్రం ‘ఇంటిలిజెంట్’ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో.. అప్పటినుంచి వివి వినాయక్ సినిమాల జోరు తగ్గిన వైనం కనిపిస్తుంది. 

అతను 20 సంవత్సరాలకు పైగా పరిశ్రమలో ఉన్నాడు, అయితే సుకుమార్, అనిల్ రావిపూడి మరియు నాగ్ అశ్విన్ వంటి నవతరం దర్శకులు కూడా అతనికి కొత్త పోటీదారులుగా మారారు.. కాబట్టి వినాయక్‌ తను తీయబోయే సినిమాకు సంబంధించి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లే కనిపిస్తోంది. చిరంజీవి, బాలకృష్ణలతో తనకు మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి ప్రస్తుతానికి, డైరెక్టర్ వివి వినాయక్ చేతిలో ఉండే ఆప్షన్స్ కాస్త తక్కువే అంటున్నారు. చిరంజీవి కూడా భోల శంకర్ సినిమా అనంతరం, తనకి వస్తున్న స్క్రిప్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. తన తదుపరి చిత్రానికి గాను కొణిదెల సుష్మిత ప్రొడ్యూసర్ గా పని చేస్తున్న క్రమంలో, ఒక మంచి హిట్ కొట్టాలనేది చిరంజీవి లక్ష్యం. ఈ విషయం గురించే తను పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు, వివి వినాయక్ డైరెక్షన్లో రాబోయే చిత్రం తప్పకుండా హిట్ కొట్టాలని, చిరంజీవి ముఖ్యంగా స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.