ఏప్రిల్‌లో సందడి చేయబోతున్న విశ్వక్ సేన్ ‘ధమ్కి’!!

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. ఆయన నటుడే కాదు రచయిత, దర్శకుడు కూడా. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన.. టైటిల్ రోల్ పోషించడమే కాకుండా దర్శకత్వం వహించిన ‘ఫలక్‌నుమా దాస్’తో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ‘పాగల్’, ‘ఓరి దేవుడా’ వంటి కొన్ని సాఫ్ట్ ఎంటర్‌టైనర్‌లు చేసిన తర్వాత, విశ్వక్.. ఫిబ్రవరి 17 న రావాల్సిన ‘ధమ్కి’ కోసం మరోసారి దర్శకుడి అవతారం ఎత్తాడు. అయితే […]

Share:

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. ఆయన నటుడే కాదు రచయిత, దర్శకుడు కూడా. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన.. టైటిల్ రోల్ పోషించడమే కాకుండా దర్శకత్వం వహించిన ‘ఫలక్‌నుమా దాస్’తో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు.

‘పాగల్’, ‘ఓరి దేవుడా’ వంటి కొన్ని సాఫ్ట్ ఎంటర్‌టైనర్‌లు చేసిన తర్వాత, విశ్వక్.. ఫిబ్రవరి 17 న రావాల్సిన ‘ధమ్కి’ కోసం మరోసారి దర్శకుడి అవతారం ఎత్తాడు. అయితే ఈ సినిమా వాయిదా పడి చాలా మందిని నిరాశపరిచింది. డబ్బింగ్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి, అందుకే మేకర్స్ విడుదల తేదీని నెట్టవలసి వచ్చింది. సినీవర్గాల సమాచారం ప్రకారం.. వారు ఏప్రిల్‌లో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు, అధికారికంగా విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

అదరగొట్టిన ట్రైలర్… మతిపోగోట్టే పాటలు  

ఇప్పటి వరకు విడుదలైన ‘దాస్ కా ధమ్కీ’ ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా.. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా, మావాబ్రో పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ పెద్ద ట్రెండ్‌గా మారింది. ఈ సినిమాలో లవ్లీ బ్యూటీ నివేదా పేతురాజ్ కథానాయికగా నటిస్తోంది. దీనిలోని ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా’ అంటూ సాగే పాటలో నివేదా బాగానే స్కిన్ షో చేసి సందడి చేసింది. ఇది విశ్వక్, నివేదాల కాంబినేషన్‌లో వస్తున్న రెండవ చిత్రం. గతంలో విశ్వక్, నివేదాలు కలిసి ‘పాగల్’ చిత్రంలో పనిచేశారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్‌లపై కరాటే రాజు ‘ధమ్కి’ని నిర్మిస్తున్నారు. ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమ కోసమే’, ‘ధమాకా’ వంటి హిట్ చిత్రాలను రాసిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ ప్రాజెక్ట్‌కి కథ, మాటలు రాశారు.

ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు విశ్వక్ సేన్ తనదైన బ్రాండ్ ప్రమోషన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ధమ్కీ ట్రైలర్‌ని విడుదల చేయగా, ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత బజ్ క్రియేట్ చేసేందుకు విశ్వక్ సేన్ మరో స్టార్ హీరో సహాయం తీసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్‌‌‌లో టాక్ వినిపిస్తోంది.

మార్చి 18న ‘ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని ముఖ్య అతిథిగా తీసుకురావాలని విశ్వక్ సేన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో బాబాయ్‌తో సినిమా ప్రమోషన్స్ చేసిన విశ్వక్ సేన్ ఇప్పుడు.. బాబాయ్ సహాయం తీసుకుంటున్నాడని, దాంతో ఈ సినిమాకి మరింత హైప్ రావడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరి తారక్.. విశ్వక్ సేన్ ధమ్కీని ప్రమోట్ చేయడానికి వస్తాడో లేదో చూడాలి.

రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. దినేష్ కె బాబు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి.. లియోన్ జేమ్స్ సంగీతం, అన్వర్ అలీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.