నో అంటే నో అంటున్న విశ్వ‌క్ సేన్

ఎప్పుడూ ఏదో ఒక్క వివాదాలతో హాట్ టాపిక్ గా మారే యంగ్ హీరో విశ్వక్ సేన్.. తాజాగా ఓ ట్వీట్ చేసి మరో సారి సంచలనంగా మారారు. ఆయన ఎందుకు అలా ట్వీట్ చేశారో.. చాలా మందికి అర్థం కావడం లేదు… కానీ మరికొంతమంది మాత్రం అది బేబీ సినిమా దర్శకుడు గురించేనని అంటున్నారు.  సోషల్ మీడియా వేదికగా ఏదైనా ఓపెన్ గ వారి అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు అందరు  ముఖ్యంగా సినీమా రంగానికి చెందిన వారు. హీరోలు,హీరోయిన్స్, […]

Share:

ఎప్పుడూ ఏదో ఒక్క వివాదాలతో హాట్ టాపిక్ గా మారే యంగ్ హీరో విశ్వక్ సేన్.. తాజాగా ఓ ట్వీట్ చేసి మరో సారి సంచలనంగా మారారు. ఆయన ఎందుకు అలా ట్వీట్ చేశారో.. చాలా మందికి అర్థం కావడం లేదు… కానీ మరికొంతమంది మాత్రం అది బేబీ సినిమా దర్శకుడు గురించేనని అంటున్నారు. 

సోషల్ మీడియా వేదికగా ఏదైనా ఓపెన్ గ వారి అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు అందరు  ముఖ్యంగా సినీమా రంగానికి చెందిన వారు. హీరోలు,హీరోయిన్స్, డైరెక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ప్రోడ్యూసర్స్ ఎవరైనా సరే నిర్మొహమాటంగా చెబుతున్నారు. తాజాగా కాంట్రవర్సీ హీరో విశ్వక్ స ఓ ట్వీట్ చేసారు… అసలా ఆ ట్వీట్ ఎందుకు చేసారో అర్థంకావట్లే మన సినిమా లవర్స్ కి ప్రస్తుతం దీని గురించే  అంతా మాట్లాడుకుంటున్నారు.

రీసెంట్ గా బేబీ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో  కలెక్షన్లను అందుకుంటోంది.థియేటర్ కి వెళ్లిన ప్రతి ఒక్కరు మూవీ లో ని సీన్స్ కి మరియు ఆనంద్ క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యారు కొంతమంది థియేటర్ లో వాళ ప్రేమ ని  గుర్తు చేసుకొని బాధపడ్డ సన్నివేశాలు చూసాం సోషల్ మీడియా లో  అయితే ఈ సినిమా కథను చెప్పేందుకు ఆనంద్ దేవరకొండ కన్నా ముందే మరో హీరో దగ్గరకు వెళ్లారట దర్శకుడు అయితే ఆ హీరో ఎవరు అన్నది ఆయన చెప్పలేదు సాయి రాజేశ్. అయితే అక్కడ ఆ హీరో.. హృదయ కాలేయం తీసిన దర్శకుడా అంటూ కథ కూడా వినలేదట.

సాయి రాజేష్ మాట్లాడుతూ…..

బేబీ సక్సెస్ మీట్ వేదిక పై మాట్లాడుతూ ‘నేను కథను ఓ హీరో వద్దకు చెప్పడానికి వెళ్ళినప్పుడు ..ఆ హీరో స్టోరీ వినకుండానే రిజెక్ట్ చేశారు.. అప్పుడు చాలా బాధేసింది’ అని చెప్పుకొచ్చారు.అసలు కథ కూడా వినకుండా ముందే రిజెక్ట్ చేసినందుకు చాల బాధపడ్డాను  ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. తాను చాలా ఫీల్ అయ్యాను .. ఆ రోజు రాత్రి కూడా పడుకోలేదని చెప్పి ఎమోషనల్ అయ్యారు సాయి రాజేష్.

ఇండస్ట్రీలో ఎటువంటి మద్దతు లేకుండా వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు విశ్వక్ సేన్. ఎప్పుడు సరి కొత్త కథ లు ఎంచుకొని మంచి పేరే సంపాదించుకున్నారు..విభిన్న పాత్రలు చేసి ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్నారు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు.. అయితే ఇదే సమయంలోనూ ఆయన కాంట్రవర్సీలకు గురౌతుంటారు.ఆయన కాంట్రవర్సీ లో ఉండడం కొత్త కాదు ఎప్పుడు ఎదో ఒక  వివాదంలో వేలు పెట్టి హాట్ టాపిక్ గా మారుతారు విశ్వక్ సేన్.  తాజాగా ఆయన ట్వీట్ చూసి.. బేబీ సినిమా దర్శకుడు మాట్లాడిన వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ వేశారని అంతా అంటున్నారు.

సోషల్ మీడియాలో నో అంటే నోనే.. అది మగాడికి కూడా వర్తిస్తుంది. కాబట్టి అరవడం మానేసి.. కూల్ గా ఉందాం. మనమంతా ఇక్కడ శాంతియుత వాతావరణంలో ఉన్నాం. కాబట్టి మనశాంతి, విశ్రాంతి తీసుకోండి’ అంటూ సెటైరికల్ గా కౌంటర్ వేశారు విశ్వక్ సేన్.

ఇక ఇది చూసి సినీ ప్రియులు, నెటిజన్లు.. సాయి రాజేష్ నో అంటే నో.. అక్కడితో వదిలేయాలి అంటూ కౌంటర్ వేశారని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఇంకొంతమంది.. విశ్వక్ సేన్ మరో వివాదంలో వేలు పెట్టి హాట్ టాపిక్ గా మారారని అంటున్నారు.