కలల ప్రాజెక్టు మొదలుపెట్టిన మంచు విష్ణు

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ప్రెసిడెంట్, మంచు వారబ్బాయి.. మంచు విష్ణు తన కలల ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీని స్టార్ట్ చేశారు. ఈ మూవీలో విష్ణుతో పాటు డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా నటించనున్నారు. ఈ మూవీకి కన్నప్ప- ఎ ట్రూ ఎపిక్ ఇండియన్ టేల్ అని నామకరణం చేశారు. గత కొద్ది రోజుల నుంచి విష్ణుకు సరైన హిట్ లేదు. అయినా కానీ సాహసం చేసి అతడు ఇంత పెద్ద మూవీని స్టార్ట్ […]

Share:

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ప్రెసిడెంట్, మంచు వారబ్బాయి.. మంచు విష్ణు తన కలల ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీని స్టార్ట్ చేశారు. ఈ మూవీలో విష్ణుతో పాటు డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా నటించనున్నారు. ఈ మూవీకి కన్నప్ప- ఎ ట్రూ ఎపిక్ ఇండియన్ టేల్ అని నామకరణం చేశారు. గత కొద్ది రోజుల నుంచి విష్ణుకు సరైన హిట్ లేదు. అయినా కానీ సాహసం చేసి అతడు ఇంత పెద్ద మూవీని స్టార్ట్ చేశాడు. ఈ మూవీలో నుపుర్ సనన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఈ నుపుర్ సనన్ ఎవరో కాదు.. 1 నేనొక్కడినే, ఆదిపురుష్ వంటి సినిమాలతో ఫేమస్ అయిన గ్లామర్ డాల్ కృతి సనన్ చెల్లెలే ఈ నుపుర్ సనన్. ఈ అమ్మడు ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజతో కలిసి టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటిస్తోంది. ఆ చిత్రం సెట్స్ మీద ఉండగానే… మరో సినిమాలో అమ్మడుకి చాన్స్ వచ్చింది. 

వారి నిర్మాణంలోనే

ఇక కొద్ది  రోజులుగా సరైన హిట్ లేని విష్ణుతో ఇంత పెద్ద ఎపిక్ తీయడానికి నిర్మాతలెవరూ సాహసం చేయలేదు. దీంతో విష్ణు వెనకడుగు వేయకుండా తన తండ్రినే ప్రొడ్యూసర్ గా చేసుకుని ఓన్ బ్యానర్ లో భక్త కన్నప్ప మూవీని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, మరియు AVA ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇక ఈ మూవీకి ముకేష్ కుమార్ సింగ్ అనే బాలీవుడ్ దర్శకుడు దర్శకత్వం వహించనున్నాడు. ముకేష్ కుమార్ సింగ్ తెలుగువారికి పెద్దగా పరిచయం లేకపోయినా కానీ అతడు బాలీవుడ్ లో తెరకెక్కించిన అనేక టెలివిజన్ సీరియల్స్ హిట్ అయ్యాయి. ఇతడు బాలీవుడ్ లో ఎన్నో హిట్ అయిన సీరియల్స్ తీశాడు. అందుకోసమే విష్ణు ఈ భక్తి మూవీ కోసం అతడిని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

తండ్రి కూడా కీలకపాత్రలో

భక్త కన్నప్ప మూవీలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా నటించనున్నట్లు మంచు విష్ణు తెలిపాడు. భక్త కన్నప్ప శివుడికి పరమ భక్తుడు. ఒకానొక సమయంలో శివుడి కంటి నుంచి (శివలింగం) రక్తం కారుతూ ఉంటే వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా తన కంటిని తీసి శివుడికి అమరుస్తాడు. అతడి భక్తిని పరిశీలించిన సాగిన శివుడు ఈ సారి మరో కంటి నుంచి రక్తం కారేలా చేస్తాడు. ఏం చేయాలో పాలుపోని కన్నప్ప తన రెండో కంటిని కూడా తీసి శివుడికి అమరుస్తాడు. దీంతో అతడి భక్తిని మెచ్చి ప్రత్యక్షం అయిన శివుడు అతడికి మోక్షం ప్రసాదిస్తాడు. అతడు కన్నులను సమర్పించాడు కాబట్టి కన్నప్పగా మారినట్లు చరిత్ర చెబుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా కానీ ఇంత పెద్ద మూవీలో అసలు రీసెంట్ టైమ్ లో హిట్ మొహమే చూడని విష్ణు నటించడం విస్మయం కలిగిస్తోంది. కేవలం విష్ణు మాత్రమే కాకుండా అతని తండ్రి కూడా ఈ మూవీలో ఓ కీ రోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. 

స్వరాల బాధ్యత మణిశర్మకు

ఇక ఈ పాన్ ఇండియా మూవీకి స్వరాలందించే బాధ్యతను విష్ణు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకు అప్పగించాడు. కేవలం అతడు ఒక్కడు మాత్రమే కాకుండా స్టీఫెన్ దేవస్సే అనే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ మూవీకి స్వరాలందించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఇక ఈ మూవీ తెలుగు నాట ఇప్పటికే 1976లో వచ్చింది. అప్పటి మూవీని కాదని ఈ మూవీని ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి. మంచు విష్ణుకు ఈ మూవీతో అయినా హిట్ పడుతుందో చూడాలి…