19 ఏళ్ల కెరీర్‌లో 12 పెళ్లిళ్లు చేశారు: విశాల్

ఇటీవల లక్ష్మీ మేనన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలతో పాటు, జాతీయ అవార్డులపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు నటుడు విశాల్‌ వివరణ ఇచ్చారు. సల్మాన్‌ఖాన్‌ పెళ్లి చేసుకున్న తర్వాత తాను కూడా చేసుకుంటానని అన్నారు. విశాల్ ప్రస్తుతం మార్క్ అంటోనీ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పీరియాడికల్ సైన్స్ ఫిక్షన్, మాఫియా నేపథ్యంలో ఉంది. కామెడీ టచ్ తో మూవీని దర్శకుడు అధిక్ […]

Share:

ఇటీవల లక్ష్మీ మేనన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలతో పాటు, జాతీయ అవార్డులపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు నటుడు విశాల్‌ వివరణ ఇచ్చారు. సల్మాన్‌ఖాన్‌ పెళ్లి చేసుకున్న తర్వాత తాను కూడా చేసుకుంటానని అన్నారు. విశాల్ ప్రస్తుతం మార్క్ అంటోనీ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పీరియాడికల్ సైన్స్ ఫిక్షన్, మాఫియా నేపథ్యంలో ఉంది. కామెడీ టచ్ తో మూవీని దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ప్రేక్షకులకిఅందించారు. విశాల్, ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో డ్యుయల్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మంచి అంచనాలు మధ్య రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి కూడా పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన వాళ్ళు సూపర్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఆంగ్ల మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూలో విశాల్‌ మాట్లాడారు. ‘పెళ్లెప్పుడు’ అన్న ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. ప్రతి దానికి ఒక సమయం ఉంటుందని అన్నారు.

‘‘సాధారణంగా నేను వివాదాలపై స్పందించను. ఇటీవల తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ట్వీట్‌ చేశాను. మళయాళ నటి లక్ష్మీ మేనన్‌ను నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది నాకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, అవతలి అమ్మాయి భవిష్యత్‌ కూడా ఉంది. నేను స్పందించకపోతే, ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది. నా గురించి ఏ విషయమైనా మీరు ఫోన్‌ చేసి అడగవచ్చు. గతంలో చాలా మందిని పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు రాశారు. నిజం చెప్పాలంటే నా 19ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ 12మందిని పెళ్లి చేసుకున్నట్లు రాశారు. చిన్నప్పటి నుంచి నాకు సంబంధించిన విషయాలు పేపర్‌లో వస్తే, కట్‌ చేసి భద్రపరచడం మా నాన్నగారికి అలవాటు. అలా ఒకరోజు ఏదో పేపర్‌ కట్‌ చేస్తుంటే, ‘ఏం చేస్తున్నారు’ అని అడిగా, ‘లక్ష్మీ మేనన్‌తో నీకు పెళ్లి అని వార్త వచ్చింది’ అన్నారు. అలా ఆ విషయం నాకు తెలిసింది. హీరోయిన్‌లలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. ఎప్పుడైనా భోజనానికో, సినిమాకో వెళ్దామని వాళ్లు అడిగితే, నేను వద్దనే చెబుతాను. బయట జంటగా కనిపిస్తే, డేటింగ్‌లో ఉన్నామని వార్తలు రాసేస్తారు. అందుకే మా ఇంట్లో భోజనం చేసి, సరదాగా కబుర్లు చెప్పుకొంటాం. తెలుగు ఇండస్ట్రీలోనూ రానా, నితిన్‌, నాని నాకు క్లోజ్‌ ఫ్రెండ్స్‌’’అని విశాల్‌ చెప్పుకొచ్చారు.

గతంలో జాతీయ అవార్డులపై తాను చేసిన వ్యాఖ్యలకు కూడా విశాల్‌ వివరణ ఇచ్చారు. అవార్డులకు తాను వ్యతిరేకంగా కాదని తెలిపారు. ‘‘జాతీయ అవార్డులను కించ పరిచేలా నేనెప్పుడూ వ్యాఖ్యలు చేయను. అవార్డులు ఇచ్చే విషయంలో నా దృష్టి కోణం అది. అసలు అవార్డులపై నాకు నమ్మకం లేదు. అవార్డైనా, రివార్డైనా ప్రేక్షకులు ఇచ్చేది. సినిమా పరిశ్రమకు ప్రతి శుక్రవారం రివార్డు అనేది ఉంటుంది. ప్రేక్షకులు ఆదరించబట్టే నేను, నా కుటుంబం మూడు పూటలా తినగలుగుతున్నాం. వచ్చిన నామినేషన్స్‌లో నుంచి ఫలానా వ్యక్తి ఉత్తమ నటుడు అని, కోట్ల మంది అభిప్రాయాన్ని పది, పన్నెండు మంది కూర్చొని ఎలా నిర్ణయిస్తారు. 40 కోట్ల మంది అభిప్రాయాన్ని నలుగురు ఎలా డిసైడ్‌ చేస్తారు’’ అని విశాల్‌ అభిప్రాయపడ్డారు.

త‌న ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ ఓ సినిమా చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు. ‘విజ‌య్ ని డైరెక్ట్ చేయ‌డం నా డ్రీమ్. అన్ని మంచిగా జ‌రిగితే త్వ‌ర‌లోనే ప్రాజెక్ట్ మొద‌లవుతంది. ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రిగాయి. కొంత కాలం క్రితం విజ‌య్ మేనేజ‌ర్ కి ఫోన్ చేసి విజ‌య్ కి క‌థ చెప్పాల‌నుకుంటున్నా. గంట అపాయింట్ కావాల‌ని అడిగా. దానికి మేనేజ‌ర్ షాక్ అయ్యాడు. కాలేజీ రోజుల నుంచే విజ‌య్ నాకు తెలుసు. ఆయ‌న న‌టుడిగా ఎంట్రీ ఇచ్చిన కొత్త‌లో ఇలాంటి ముఖాన్ని డ‌బ్బులిచ్చి మ‌రీ థియేట‌ర్ కి వెళ్లి చూస్తారా? ఎవ‌రైనా అని ఓ మ్యాగ‌జైన్ లో రాశారు. ఆ విమ‌ర్శ‌లు ఓ స‌వాల్ గా తీసుకుని విజ‌య్ శ్ర‌మించారు. కొన్నేళ్ల త‌ర్వాత అదే మ్యాగ‌జైన్ లో విజ‌య్ స‌క్సెస్ పుల్ జర్నీ.. హిట్ సినిమాల‌పై ప్ర‌త్యేక క‌థ‌నాలు వ‌చ్చాయి. అదీ విజ‌య్ అంటే. డైరెక్ష‌న్ అంటే నాకెంతో ఇష్టం. అందుకే ‘డిటెక్టివ్ -2’ని నేనే డైరెక్ట్ చేస్తున్నా. ఈ అనుభ‌వం విజ‌య్ సినిమాకి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది అని అన్నారు.