వైరల్ అవుతున్న ఖుషి ఫోటోలు

సమంత నటిస్తున్న ఖుషి సినిమా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాని శివా నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలంగాణలో జరుగుతుంది.  రిలీజ్ అయిన నా రోజా నువ్వే సాంగ్: ఖుషి సినిమా నుండి నా రోజు నువ్వే అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ పెద్ద హిట్ అయింది. సాంగ్ ఒక నెల రోజుల నుంచి బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా […]

Share:

సమంత నటిస్తున్న ఖుషి సినిమా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాని శివా నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలంగాణలో జరుగుతుంది. 

రిలీజ్ అయిన నా రోజా నువ్వే సాంగ్:

ఖుషి సినిమా నుండి నా రోజు నువ్వే అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ పెద్ద హిట్ అయింది. సాంగ్ ఒక నెల రోజుల నుంచి బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సమంత ఫ్యాన్ పేజ్ ఈ ఫోటోలను వైరల్ అయ్యేలా చేసింది. ఈ ఫోటోల్లో తన లుక్ చాలా బాగుంది. ఖుషి సినిమా గ్లింప్స్ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. సమంత స్మైల్ కి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి తనకి భారీ ఫ్యాన్ బేస్ ఉంది. 

లీకైన ఈ ఫోటోలలో సమంత విజయ్ దేవరకొండ తో కలిసి ఉంది. ఈ వీడియోలో సమంత విజయ్ దేవరకొండ నమస్తే అని చెప్పడం కనిపిస్తుంది. అందరు స్కూల్ గర్ల్స్ తో సమంత వీడియో కూడా తీసుకుంది. ఇక ఖుషి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుంది. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో ఇది రెండవ సినిమా. ఇంతకుముందు వీళ్లిద్దరు మహానటి లో కలిసి నటించారు. ఇది కాకుండా సమంత సిటాడిల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. ఇది ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ సిటాడిల్ కి ఇండియన్ వెర్షన్. ఇందులో సమంతకు జోడిగా వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. దీన్ని ఫ్యామిలీ మ్యాన్ తీసిన రాజ్ అండ్ డీకేనే తీస్తున్నారు. పోయిన నెల కూడా ఈ సినిమా షూటింగ్ జరిగింది.

సమంత సినీ కెరీర్:

నాగచైతన్యతో కలిసి నటించిన ఏ మాయ చేసావే సమంత తొలి చిత్రం. తొలి చిత్రంతోనే సమంత కి భారీగా ఫ్యాన్స్ పెరిగారు. సినిమా సినిమాకు సమంత రేంజ్ పెరుగుతూ పోయింది. సమంత రెండో చిత్రం ఎన్టీఆర్ బృందావనం. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత సమంత మహేష్ బాబు తో కలిసి దూకుడు లో నటించింది. అది కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ విజయాలతో సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్లో అగ్ర కథానాయికగా మారింది. తమన్నా లాంటి కథానాయికులకు సవాల్ విసిరింది. సమంత మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రంలో కూడా నటించింది. ఓ దశలో సమంత ఏ సినిమా చేస్తే అది హిట్ అని రేంజ్కి తను ఎదిగిపోయింది. తన సినీ కెరీర్ బాగున్నా వ్యక్తిగతంగా తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. కథానాయకుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్ని రోజులకే విడాకులు ఇచ్చింది. తర్వాత మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఈ మధ్యే తను ఈ వ్యాధి నుండి కోలుకుంది. సమంత గత సినిమాలు యశోద, శకుంతలం బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించాయి. ఖుషి సినిమా సమంతకు మంచి బ్రేక్ ఇవ్వాలని మనందరం కోరుకుందాం.