వినరో భాగ్యము విష్ణు కథ మూవీ రివ్యూ

అటు ప్రేక్షకుల్లో, ఇటు చిత్రసీమలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిరణ్ అబ్బవరం. ఆయన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణుకథ చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ నటీనటులు: కిరణ్ అబ్బవరం, కాశ్మీరా, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ కేజీఎఫ్ లక్కీ, పమ్మి సాయి, దేవిశ్రీప్రసాద్, ఎల్.బి. శ్రీరామ్, శరత్ లోహితస్య ఆమని, ప్రవీణ్ తదితరులు సంగీతం: చైతన్ భరద్వాజ్  ఛాయాగ్రహణం: డేనియల్ విశ్వాస్  దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు  నిర్మాత: బన్నీ వాసు సమర్పణ: అల్లు […]

Share:

అటు ప్రేక్షకుల్లో, ఇటు చిత్రసీమలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిరణ్ అబ్బవరం. ఆయన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణుకథ

చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ

నటీనటులు: కిరణ్ అబ్బవరం, కాశ్మీరా, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ కేజీఎఫ్ లక్కీ, పమ్మి సాయి, దేవిశ్రీప్రసాద్, ఎల్.బి. శ్రీరామ్, శరత్ లోహితస్య ఆమని, ప్రవీణ్ తదితరులు

సంగీతం: చైతన్ భరద్వాజ్ 

ఛాయాగ్రహణం: డేనియల్ విశ్వాస్ 

దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు 

నిర్మాత: బన్నీ వాసు

సమర్పణ: అల్లు అరవింద్ 

విడుదల తేదీ: 18 ఫిబ్రవరి 2023 

రాజావారు రాణి గారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం వంటి వరుస విజయాలతో అటు ప్రేక్షకుల్లో, ఇటు చిత్రసీమలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిరణ్ అబ్బవరం. అయితే ఆ తరువాత మరో మూడు సినిమాలు వచ్చినా.. అతనికి చెప్పుకోదగ్గ విజయాలు తెచ్చిపెట్టలేకపోయాయి. అయితే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి కిరణ్ అబ్బవరం ఖాతాలో మంచి హిట్ పడుతుందనే అంచనాలను పెంచింది. పైగా సమర్పించిన వారు కూడా గీతా అర్ట్స్. దాంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

కథ మాటకొస్తే:

విష్ణు (కిరణ్ అబ్బవరం) ది తిరుపతి. చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. అయినా ఊరి ప్రజలు మాత్రం ఎలాంటి సహాయం చేయకుండా నవ్వుతూ ఉంటారు. అతని తల్లిదండ్రుల మాట తీరు బాగుండదు. కాబట్టి గ్రామ ప్రజలు అతనికి ఎవరు సాయం చేయరు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలను బట్టి విష్ణు ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనే సామెతని వంట బట్టించుకుని ఎవరికైనా సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. తనకు నెంబర్ నైబర్ అనే కాన్సెప్ట్‌తో దర్శన (కాశ్మీర) దగ్గరవుతుంది. తను ఒక యూట్యూబర్. తనకు పరిచయమైన విష్ణు, శర్మలతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్‌‌ని నిర్వహిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో శర్మ, విష్ణు ఇద్దరూ దర్శనని ప్రేమిస్తారు. అయితే ఒకసారి ప్రాంక్ వీడియోని చిత్రీకరిస్తారు. ఆ వీడియో మర్డర్‌కు సంబంధించినది. అయితే పొరపాటున నిజంగా తుపాకీ పేలి శర్మ బలవుతాడు. దీంతో దర్శన జైలు పాలవుతుంది. తన ప్రియురాలిని రక్షించుకోవడం కోసం విష్ణు ఏం చేశాడు? దర్శన నిజంగా హత్య చేసిందా? ఈ హత్యకు రాజకీయ నాయకుడు కేజీఎఫ్ లక్కీకి ఉన్న లింక్ ఏమిటి? గ్యాంగ్ స్టర్ రాజన్‌కు విష్ణు తన కథ ఎందుకు చెప్పాడు? అతన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న నేషనల్ ఇంటెలిజెన్స్ అధికారులకు విష్ణు ఎలా సాయపడ్డాడు? అనేది తెరపై చూడవలసినదే.

మన పక్క నెంబర్‌కు ఫోన్ చేసి పరిచయం పెంచుకోవాలనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఫస్ట్ హాఫ్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలా, సెకండ్ హాఫ్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌లా ఉంటుంది. రకరకాల కాన్సెప్ట్‌లను కలిపేసినట్లు అనిపించినా చాలావరకు ఆసక్తికరంగానే ఉంటుంది. హీరోగా కిరణ్ పాత్ర ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్ ఆ పాత్రతో ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు ఆలోచనలు ఆలోచింపజేసేలా ఉంటాయి. 

బలాలు:

కిరణ్ అబ్బవరం కూడా తనదైన శైలిలో, ప్రశాంతమైనయాక్టింగ్‌తో చాలా వరకు ఆకట్టుకున్నారు. మురళి శర్మ యాక్టింగ్ కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఈ సినిమాకి సంగీతం ప్లస్ అయింది. సంగీతం ఆకట్టుకునేలా ఉంటుంది. 

బలహీనతలు:

డైరెక్టర్ మురళీ కిషోర్ కథ చాలా బాగా రాసుకున్నారు కానీ దాన్ని పూర్తిస్థాయిలో తెరమీదకి తీసుకురాలేకపోయారని చెప్పుకోవాలి. స్క్రీన్ ప్లే కొంత పేలవంగా ఉంది, హీరో, హీరోయిన్ల మధ్య జరిగే సీన్లు కూడా చాలా నెమ్మదిగా సాగుతాయి. సినిమా చాలా వరకు బాగానే ఉన్నా క్లైమాక్స్‌లో వచ్చే టేస్ట్ మాత్రం చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇక హీరో కూడా అధిక సాయం చేసేస్తూ ఉంటాడు, ఇది కొంచెం అతిగా ఉంటుంది.  సినిమా కొంచెం స్లోగా ఉండడం ఒక మైనస్ పాయింట్. 

మొత్తంగా:

అంచనాలు ఏమీ లేకుండా సినిమా చూడాలని వెళ్తే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఫన్, లవ్ అంశాలతో మొదలైన ఈ డ్రామా చివరికి సస్పెన్స్ థ్రిల్లర్‌గా ముగుస్తుంది. కొన్ని స్లో ఎపిసోడ్స్ బోరింగ్ అనిపించినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌‌కి, లవర్స్‌కి ఈ సినిమా కొంతవరకు బాగానే కనెక్ట్ అవుతుంది.

రేటింగ్: ⅗