Dhruva Natchathiram: ధ్రువ నక్షత్రం ట్రైలర్ తో నిరీక్షణకు తెరదించిన విక్రమ్

చియాన్ విక్రమ్ (Vikram)  గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలా రోజుల నుంచి ఆయన తెలుగులో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులను అలరించడంలో విక్రమ్ ఎప్పుడూ ముందుంటారు. విక్రమ్ (Vikram) తమిళ నటుడే అయినా కానీ తెలుగు సినిమాలతో ఇక్కడి వారికి కూడా సుపరిచితుడయ్యాడు. అపరిచితుడు, శివ పుత్రుడు వంటి సినిమాలు ఇక్కడ కూడా ఘన విజయం సాధించాయి. ఇక ఇప్పుడు విక్రమ్ (Vikram) హీరోగా నటిస్తున్న ‘తంగలాన్’ మూవీ గురించి అంతా […]

Share:

చియాన్ విక్రమ్ (Vikram)  గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలా రోజుల నుంచి ఆయన తెలుగులో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులను అలరించడంలో విక్రమ్ ఎప్పుడూ ముందుంటారు. విక్రమ్ (Vikram) తమిళ నటుడే అయినా కానీ తెలుగు సినిమాలతో ఇక్కడి వారికి కూడా సుపరిచితుడయ్యాడు. అపరిచితుడు, శివ పుత్రుడు వంటి సినిమాలు ఇక్కడ కూడా ఘన విజయం సాధించాయి. ఇక ఇప్పుడు విక్రమ్ (Vikram) హీరోగా నటిస్తున్న ‘తంగలాన్’ మూవీ గురించి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఎటువంటి వార్త వస్తుందో అని కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. కానీ ఇటువంటి సమయంలో ఆయన నుంచి ‘ధ్రువ నక్షత్రం’ అంటూ సాగే ఒక థ్రిల్లర్ మూవీ ట్రైలర్ విడుదలయింది. ధ్రువ నక్షత్రం (Dhruva Natchathiram) ట్రైలర్ చూసి ప్రేక్షకాభిమానులు ఫుల్ థ్రిల్ అవుతున్నారు. ఈ ట్రైలర్ ను అద్భుతంగా కట్ చేశారని మెచ్చుకుంటున్నారు. 

దర్శకత్వం వహించిన గౌతమ్

విక్రమ్ (Vikram) హీరోగా ధ్రువ నక్షత్రం (Dhruva Natchathiram) మూవీని ఏస్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించాడు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నిన్న దీని నుంచి ట్రైలర్ (Trailer)  విడుదల చేశారు. ట్రైలర్ (Trailer) విడుదలతో చియాన్ విక్రమ్ (Vikram) అభిమానులు మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. గౌతమ్ టేకింగ్, విక్రమ్ యాక్టింగ్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ మూవీ రెండు భాగాలుగా (Two Parts) రానుందని మేకర్స్ ప్రకటించారు. మొదటి భాగానికి యుద్ధ కాండమ్ అని నామకరణం చేశారు. ఇక రెండో భాగం రిలీజ్ గురించి పెద్దగా ప్రకటించలేదు. 

అక్కడే మొదలు..

ఏడాదిలోపు షూటింగ్ (Shooting) చేసుకుని సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ రోజుల్లో ధ్రువ నక్షత్రం (Dhruva Natchathiram) మూవీ దాదాపు 6 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ట్రైలర్ 2011 ముంబై బాంబు పేలుళ్లతో (Mumbai Blast) ప్రారంభమవుతుంది. జాతీయ భద్రత కోసం గూఢచారులు మరియు సైనికులతో ప్రభుత్వం ఒక ఏజెన్సీని ఏర్పాటు చేస్తుంది. అక్కడి నుంచి ప్రతి ఫ్రేమ్ ను దర్శకుడు చాలా ఉత్కంఠగా తెరకెక్కించారు. ఈ ఏజెన్సీకి ధృవ్ (విక్రమ్) నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంటాడు. మా ఉనికి గురించి ఎవరికీ తెలియదు అనే డైలాగ్ ఒక రకంగా పేలింది. కానీ ఈ ఏజెన్సీకి త్వరలోనే ప్రమాదం రాబోతుందని విక్రమ్ (Vikram) పసిగడతాడు. తన టీమ్ ను ఉపయోగించి ఆ ముప్పును గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. 

అభిమానుల స్పందనిదే.. 

ఎన్నో రోజుల నుంచి నిరీక్షిస్తున్న మూవీ ట్రైలర్ (Trailer) ఎట్టకేలకు రిలీజ్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చాలా మంది తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి ఈ మూవీ ట్రైలర్  (Trailer) కోసం వెయిట్ చేశామని.. ఎట్టకేలకు ఈ మూవీ ట్రైలర్ (Trailer) చూడగలిగామని కొందరు అంటుంటే.. వావ్. మేకింగ్ క్వాలిటీ,  ప్రొడక్షన్ వాల్యూస్ మరియు విక్రమ్ నటన సూపర్బ్ గా ఉన్నాయని కామెంట్ చేశారు. ఈ మూవీ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు మరొకరు తెలిపారు. 8 సంవత్సరాల తర్వాత కూడా ఈ చిత్రం సూపర్‌హిట్ అవుతుందని తాను భావిస్తున్నట్లు మరో అభిమాని రాసుకొచ్చాడు. ఈ చిత్రం కోసం ఈ మాత్రం వెయిట్ చేయడం సమంజసమే అని మరో అభిమాని స్పందించాడు. ఈ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ (Music Director) హరిస్ జయరాజ్ స్వరాలు సమకూర్చాడు. 

నటీనటులు వీరే.. 

విక్రమ్-గౌతమ్ కాంబినేషన్ లో మూవీ అంటేనే అంచనాలు ఒక రకంగా ఉంటాయి. ఈ మూవీ (Movie) లో యాక్టింగ్ టీమ్ ఎవరు చేసి ఉంటారా అని ప్రతి అభిమాని (Fan) ఎదురుచూస్తుంటాడు. అలాగే ఈ మూవీ విషయానికి వస్తే.. రీతూ వర్మ, పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక, అర్జున్ దాస్ మరియు దివ్యదర్శిని యాక్ట్ చేశారు. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారనే విషయం అందరికీ తెలసిందే. విక్రమ్ చివరిగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన  పొన్నియిన్ సెల్వన్ 2 (PS-2) లో కనిపించాడు. ఇందులో ఐశ్వర్య రాయ్, త్రిష కృష్ణన్, కార్తీక్ మరియు జయం రవి నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలైంది. రెండు పార్టులుగా రిలీజ్ అయిన ఈ మణిరత్నం మూవీ క్లాసిక్ హిట్ అనిపించుకుని కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది.