కృతి శెట్టితో విజయ్ సేతుపతి కలిసి నటించకపోవడానికి కారణాలేంటి?

విజయ్ సేతుపతి అంటే ప్రత్యేకమైన నటనకు పెట్టింది పేరు. పిజ్జా సినిమాతో అందరికీ పరిచయమైన నటుడు, సినిమా ప్రపంచంలో అడుగుపెట్టి ఎన్నో విజయాలు సాధించాడు. ప్రస్తుతం కృతి శెట్టి- విజయ్ సేతుపతి పక్కన హీరోయిన్గా ఎందుకు చెయ్యట్లేదు అనే విషయం గురించి ప్రస్తావని నడుస్తోంది. తను కృతి శెట్టితో కలిసి నటించడాన్ని ఎందుకు విభేదించాను అనే విషయాన్ని మీడియా ఇంటరాక్షన్ లో విజయ్ సేతుపతి తెలియజేశాడు.  కృతి శెట్టిని విజయ్ సేతుపతి హీరోయిన్ గా ఎందుకు తీసుకోలేదు […]

Share:

విజయ్ సేతుపతి అంటే ప్రత్యేకమైన నటనకు పెట్టింది పేరు. పిజ్జా సినిమాతో అందరికీ పరిచయమైన నటుడు, సినిమా ప్రపంచంలో అడుగుపెట్టి ఎన్నో విజయాలు సాధించాడు. ప్రస్తుతం కృతి శెట్టి- విజయ్ సేతుపతి పక్కన హీరోయిన్గా ఎందుకు చెయ్యట్లేదు అనే విషయం గురించి ప్రస్తావని నడుస్తోంది. తను కృతి శెట్టితో కలిసి నటించడాన్ని ఎందుకు విభేదించాను అనే విషయాన్ని మీడియా ఇంటరాక్షన్ లో విజయ్ సేతుపతి తెలియజేశాడు. 

కృతి శెట్టిని విజయ్ సేతుపతి హీరోయిన్ గా ఎందుకు తీసుకోలేదు ?

లాభం అనే సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి ని తీసుకుందామనుకున్నారు. కానీ విజయ్ సేతుపతి ఇందులో హీరోయిన్ గా తను వద్దని సున్నితంగా తిరస్కరించాడు. దానికి ఒక కారణం కూడా ఉంది ఇంతకుముందు ఉప్పెన అనే తెలుగు సినిమాలో వీళ్ళు తండ్రి కూతుళ్ళలా నటించారు. అందుకే ఈ సినిమాలో తను హీరోయిన్గా వద్దని చెప్పాడు. ఉప్పెన సినిమా విషయానికొస్తే 2021 లో రిలీజ్ అయిన ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా నేషనల్ అవార్డు కూడా సంపాదించింది.

మీడియా ఇంటరాక్షన్ లో విజయ్ సేతుపతి ఏం చెప్పాడు?

కృతి శెట్టి ని తన సినిమాలో వద్దన్నానని, దానికి కారణం తను హీరోయిన్గా నటిస్తే ఏజ్ గ్యాప్ తెలిసిపోతుంది అందుకే తనని హీరోయిన్గా వద్దని చెప్పానని చెప్పాడు. ఇంతకుముందు ఉప్పెన సినిమాలో కృతి శెట్టి విజయ్ సేతుపతి కూతురుగా నటించింది. లాభం అనే సినిమా కోసం కృతి శెట్టిని హీరోయిన్గా అనుకున్నామని చెప్పగానే తాను వద్దని చెప్పానని విజయసేతుపతి చెప్పాడు. ఇంతకుముందు మేము కలిసి ఉప్పెన అనే సినిమాలో చేసాం. అందులో తను నా కూతురులా నటించింది. నేను తనని కూతుర్లా చూశాను. అలాంటి తనతో నేను రొమాన్స్ ఎలా చేయగలను అని విజయ్ సేతుపతి అన్నాడు. విజయ్ సేతుపతి ఇచ్చిన స్టేట్మెంట్ తన మీద గౌరవాన్ని మరింత పెంచింది. విజయ్ సేతుపతి పిజ్జా అనే సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టాడు. తన కెరీర్ లో వరుసగా విజయాలని అందుకుంటూ మక్కల్ సెల్వన్ అనే బిరుదును కూడా సంపాదించాడు. విజయ్ సేతుపతి హీరోగానే కాకుండా మంచి క్యారెక్టర్ లభిస్తే వేరే హీరోల సినిమాలలో కూడా నటిస్తున్నాడు.

విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాలో అద్భుతంగా నటించాడు.

అవార్డుల ఉప్పెన

పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటించిన ఉప్పెన సినిమా నేషనల్ అవార్డు సంపాదించింది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది. ఈ సినిమాకు బుచ్చిబాబు డైరెక్టర్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాడు. ఈ సినిమాలో తన నటన అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో లవ్ ఎమోషన్స్ ని బాగా చూపించారు. ఈ సినిమా 2021 లో బ్లాక్ బస్టర్ సినిమా. ఈ సినిమాలో నటించిన వాళ్లంతా చాలా క్రేజ్ సంపాదించుకున్నారు. కృతి శెట్టి అయితే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తను వరుసగా సినిమాలకు కమిట్ అయింది. తనకి మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, బంగార్రాజు లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. కానీ ఆ సినిమాలు ఆశించినంత విజయాన్ని సాధించలేదు. కృతి శెట్టి నాచురల్ స్టార్ నానితో కలిసి శ్యాం సింగరాయ్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలేవి పెద్ద విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ తనకి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా తను శర్వానంద్ 35 సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా మంచి సక్సెస్ అయి తన కెరీర్ మరింత ముందుకు వెళ్లాలని కోరుకుందాం.