విజయ్ దేవరకొండ పై సెటైరికల్ పోస్ట్!

మేం 8 కోట్లు లాస్ అయ్యాం: వరల్డ్ ఫేమస్ లవర్ ప్రొడ్యూసర్లు వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో విజయ్ దేవరకొండ ద్విపత్రాభినయం చేశాడు. అందులో ఒక పాత్ర పేరు సీనయ్య ఇంకో పాత్ర పేరు గౌతమ్. ఈ సినిమాకు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. ఖుషి సినిమాతో మంచి జోష్ లో ఉన్న విజయ్ దేవరకొండ: రీసెంట్గా వచ్చిన ఖుషి సినిమాతో విజయ్ దేవరకొండ మంచి జోష్ లో ఉన్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ […]

Share:

మేం 8 కోట్లు లాస్ అయ్యాం: వరల్డ్ ఫేమస్ లవర్ ప్రొడ్యూసర్లు

వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో విజయ్ దేవరకొండ ద్విపత్రాభినయం చేశాడు. అందులో ఒక పాత్ర పేరు సీనయ్య ఇంకో పాత్ర పేరు గౌతమ్. ఈ సినిమాకు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు.

ఖుషి సినిమాతో మంచి జోష్ లో ఉన్న విజయ్ దేవరకొండ:

రీసెంట్గా వచ్చిన ఖుషి సినిమాతో విజయ్ దేవరకొండ మంచి జోష్ లో ఉన్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను కొల్లగొడుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించింది. ఈ సినిమాకు దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ఖుషి సినిమా సక్సెస్ సాధించడంతో విజయ్ దేవరకొండ మంచి జోష్ లో ఉన్నాడు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ ని తన డిసిషన్తో సర్ప్రైజ్ కి గురి చేశాడు. తాను కోటి రూపాయలతో ఒక 100 ఫ్యామిలీలను ఆదుకుంటానని విజయ్ దేవరకొండ హామీ ఇచ్చాడు. దీనికి వరల్డ్ ఫేమస్ లవర్ ప్రొడ్యూసర్లు తాము ఎనిమిది కోట్లు కోల్పోయామని సెటరికల్ గా ట్వీట్ వేశారు.

విజయ్ దేవరకొండ ట్వీట్ కి రెస్పాండ్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్ ప్రొడ్యూసర్లు:

వరల్డ్ ఫేమస్ లవర్ 2020 ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించబడింది. ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పరాజయం పాలయింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. వరల్డ్ ఫేమస్ లవర్  హీరోయిన్లుగా రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్ లాంటి వాళ్లు ఉన్నప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది. 

ఖుషి సక్సెస్ అయిన సందర్భంగా విజయ్ దేవరకొండ 100 మంది ఫ్యామిలీలకు కోటి రూపాయలను పంచుతానని హామీ ఇచ్చాడు. ఈ సందర్భంగా దీనికి వరల్డ్ ఫేమస్ లవర్ ప్రొడ్యూసర్లు రెస్పాండ్ అయ్యారు. వాళ్లు ఏమని రెస్పాండ్ అయ్యారంటే దేవరకొండ గారు మేము వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వల్ల 8 కోట్లు లాస్ అయ్యాం. మీరు కోటి రూపాయలు కొన్ని ఫ్యామిలీస్ కి డొనేట్ చేస్తున్నారని విన్నాం. మీరు పెద్దమనసు చేసుకొని మా సినిమా డిస్ట్రిబ్యూటర్లను కూడా ఆదుకుంటారని కోరుకుంటున్నాం. అని అభిషేక్ పిక్చర్స్ వారు ట్వీట్ వేశారు. విజయ్ దేవరకొండ గత చిత్రం లైగర్ కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమా విజయ్ దేవరకొండ మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి బజ్ ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది.

ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మీద మొదటినుంచి చాలా అంచనాలు ఉండడం కూడా దీనికి మైనస్ అయింది. ఈ సినిమాలో కంటెంట్ కూడా అంతగా ఏం లేదు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. ఇంకా హీరో తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించింది. మైక్ టైసన్ లాంటి స్టార్ కాస్టింగ్  ఉన్నా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజ్యం పాలయింది. కానీ రీసెంట్ గా వచ్చిన ఖుషి మాత్రం విజయ్ దేవరకొండకు మంచి జోష్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత తను మైత్రి మూవీ మేకర్స్ లో శ్రీ లీల తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నాడు.