అర్ధ రాత్రి సమంతకు వీడియో కాల్ చేసిన హీరో

ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ- సమంత జంటగా నటించిన మూవీ ఖుషి గురించే చర్చ నడుస్తోంది. ఈ క్లాసికల్ లవ్ స్టోరీని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. దీంతో అందరి కళ్లు ఈ మూవీ మీదే పడ్డాయి. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఫుల్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కేవలం రౌడీ హీరో ఫ్యాన్స్, సమంత ఫ్యాన్స్ అనే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇదే తరహాలో […]

Share:

ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ- సమంత జంటగా నటించిన మూవీ ఖుషి గురించే చర్చ నడుస్తోంది. ఈ క్లాసికల్ లవ్ స్టోరీని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. దీంతో అందరి కళ్లు ఈ మూవీ మీదే పడ్డాయి. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఫుల్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కేవలం రౌడీ హీరో ఫ్యాన్స్, సమంత ఫ్యాన్స్ అనే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇదే తరహాలో ఇందులోంచి రిలీజ్ అయిన పాటలు కూడా శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో పాటో రెండు పాటలో అని కాకుండా మొత్తం జూక్ బాక్సే చార్ట్ బాస్టర్ గా నిలిచింది. దీంతో అంతా ఈ మూవీ రిజల్ట్ పై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా సామ్ కెరియర్ లో మరో హిట్ మూవీ అవుతుందని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే రిలీజైన ట్రైలర్స్ తో పాటు టీజర్స్ కు కూడా మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. దీంతో అంతా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక మూమీ ప్రమోషన్స్ ను కూడా యూనిట్ స్పీడ్ అప్ చేసింది. సమంత అమెరికాలో ఉంటున్నా కానీ మూవీ టీం అమ్మడిని ప్రమోషన్స్ కోసం డిఫరెంట్ స్టైల్ లో వాడుకుంటోంది. 

వీడియో కాల్ చేసిన విజయ్

మూవీ ప్రమోషన్స్ అంటే ఎవరైనా పొద్దంగా చేస్తారు. కానీ ఖుషి టీమ్ వెరైటీగా మిడ్ నైట్ ప్రమోషన్స్ చేపట్టింది. అది కూడా ఇండియాలో లేని సమంతను మూవీ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంది. మూవీ టీమ్ సామ్ ను ఉపయోగించుకున్న విధానం చూసి అంతా వావ్ అంటున్నారు. మీ తెలివికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే… అర్ధరాత్రి పూట మూవీ హీరో విజయ్ దేవరకొండ సమంతకు వీడియో కాల్ చేశాడు. ఈ వీడియో కాల్ విషయం తెగ వైరల్ అయింది. దీంతో మూవీకి అనుకున్నంత ప్రమోషన్ లభించింది. ఇన్నాళ్లూ మూవీని తనొక్కడే ప్రచారం చేస్తున్న హీరో విజయ్ దేవరకొండ సమంతను ఇలా ప్రమోషన్స్ లో భాగం చేశాడని అంతా చెప్పుకుంటున్నారు. ఈ వీడియో కాల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ప్రతి ఒక్కరూ ఈ మూవీ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో చాలా మంది బుక్ చేసుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారు. 

సారా అలీ ఖాన్ గురించి..

బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్ గురించి చాలా మందికే తెలుసు. సమంత- విజయ్ ఈ వీడియో కాల్ సమయంలో బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ గురించి, ఆమె స్టైల్ గురించి సోషల్ మీడియాలో ఆమె వేసే జోకుల గురించి మాట్లాడుకున్నారు. సారా అలీ ఖాన్ ఇప్పటి వరకు తెలుగులో ఒక్క స్ట్రెయిట్ సినిమా చేయకపోయినా కానీ ఆమె ఇక్కడి కుర్రకారుకు పరిచయమే. సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలను పంచుకోవడమే కాకుండా పలు ఉత్పత్తులకు కూడా అమ్మడు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. సెప్టెంబర్ 1న ఖుషి మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ ను స్పీడ్ అప్ చేసింది. ఇందులో భాగంగా హీరో హీరోయిన్లతో వీడియో కాల్ ప్రోగ్రాం ప్లాన్ చేసింది. మూవీ యూనిట్ ఆలోచించిన దానికి తగ్గట్లుగానే ఈ వీడియో కాల్ తెగ వైరల్ అయింది. సినిమాకు కావాల్సినంత ప్రచారం లభించింది. కేవలం ఈ వీడియో కాల్ మాత్రమే కాకుండా చిట్ చాట్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. విజయ్ కి ఎటువంటి చెడు అలవాట్లు లేవని, ఆ విషయం తెలుసుకుని తాను కూడా ఆశ్చర్యపోయానని సమంత ఇది వరకే వెల్లడించింది. 

అప్పటి నుంచే క్రేజ్

ఖుషి మూవీకి మొదట్లో అంత బజ్ ఉండేది కాదు. ఏదో సమంత- విజయ్ దేవరకొండ మూవీ అట అని అనేవారు. కానీ ఎప్పుడైతే మ్యూజికల్ కాన్సెర్ట్ లో విజయ్- సమంత కలిసి స్టేజ్ మీద రొమాంటిక్ డ్యాన్స్ ఇరగదీశారో ఇక అప్పటి నుంచో ఈ మూవీకి తెగ పాపులారిటీ వచ్చింది. అంతే కాకుండా సామ్ బర్త్ డే సందర్భంగా మూవీ యూనిట్ చేసిన షూటింగ్ ప్రాంక్ అప్పట్లో తెగ వైరల్ అయింది. అలాగే ఈ మూవీకి సంబంధించి ఎప్పటికీ జనాలకు ఏదో ఒక విషయం తెలుపుతూనే ఉన్నారు. అంతే కాకుండా టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ మూవీని తెరకెక్కిస్తుండడం ఈ మూవీ డైరెక్టర్ శివ నిర్వాణకు అంతకు ముందు లవ్ స్టోరీలను హిట్లుగా మలచిన ట్రాక్ రికార్డు ఉంది. ఇక సమంత- విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన సావిత్రి మూవీ మరియు సమంత డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన మజిలీ మూవీలు రెండు కూడా ఇండస్ట్రీ హిట్లుగా నిలవడంతో ఈ మూవీ కూడా పక్కా హిట్ అని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కామెంట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే మెలోడీ సాంగ్స్ తో మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వాహబ్ స్వరపర్చిన ట్యూన్స్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.  ఇక మరో విషయం చెప్పుకుంటే సమంత- విజయ్ లకు లాస్ట్ మూవీలు శాకుంతలం, లైగర్ భారీ ప్లాపులుగా మిగిలాయి. దీంతో ఈ ఇద్దరు యాక్టర్స్ ఈ మూవీ కోసం కసిగా 100 శాతం ఎఫర్ట్ పెట్టారని టాక్ వినిపిస్తోంది. లాస్ట్ టైమ్ జానర్ మార్చి దర్శకుడు కూడా ఒక ప్రయోగం చేయగా..అది కూడా అంతగా సక్సెస్ కాలేదు. దీంతో ఈ మూవీ హిట్ ఈ ముగ్గురికి క్రూషియల్ గా మారింది.