Vijay Devarakonda: అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే అంటున్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సమంత రూత్ ప్రభు జంటగా నటించిన ఖుషి సినిమా (Cinema) సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన యాక్షన్, థ్రిల్లర్ మూవీస్ కి భిన్నంగా వచ్చిన రొమాంటిక్  ఖుషి సినిమా (Cinema) ఆడియన్స్ను ఎంతగానో అలరించింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన తదుపరిచిత్రం ఫ్యామిలీ స్టార్ (Family Star) తో సంక్రాంతి (Sankranti) సినిమా (Cinema)ల బరిలో నిలవనన్నాడు. ఇటీవల ఒక సినిమా […]

Share:

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సమంత రూత్ ప్రభు జంటగా నటించిన ఖుషి సినిమా (Cinema) సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన యాక్షన్, థ్రిల్లర్ మూవీస్ కి భిన్నంగా వచ్చిన రొమాంటిక్  ఖుషి సినిమా (Cinema) ఆడియన్స్ను ఎంతగానో అలరించింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన తదుపరిచిత్రం ఫ్యామిలీ స్టార్ (Family Star) తో సంక్రాంతి (Sankranti) సినిమా (Cinema)ల బరిలో నిలవనన్నాడు. ఇటీవల ఒక సినిమా ప్రమోషన్ లో మాట్లాడిన విజయ్ దేవరకొండ మధ్యతరగతి (Middle Class) జీవితం గురించి మాట్లాడటం జరిగింది. 

అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే అంటున్న విజయ్ దేవరకొండ: 

మధ్యతరగతి (Middle Class) కుటుంబానికి చెందిన ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), ప్రతి యువకుడికి పెద్దగా కలలు కనే హక్కు ఉందని, తాను ఎంచుకున్న జీవితంలో విజయం సాధించానని పేర్కొన్నాడు. తాను అదే విధంగా తన స్నేహితుడు, తరుణ్ భాస్కర్ పెద్ద కలలు కనేవాళ్ళం అని.. తమ జీవితంలో విజయం సాధించగలిగామని, నిజానికి తమ జేబులో రూపాయి లేనప్పుడు, వీధుల్లో తిరిగిన రోజులు కూడా ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).

ఒక మధ్యతరగతి (Middle Class) వ్యక్తి విజయం సాధిస్తే, తన జీవితమే కాకుండా, పూర్తి కుటుంబ జీవితం మారిపోతుందని వాస్తవాన్ని గుర్తు చేశాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రస్తుతం మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ మన దేశంలో 90% మంది మధ్యతరగతి (Middle Class) కుర్రాళ్లు ఎన్నో కలలు కంటూ ఉంటారు.. ఆ విధంగానే తమ జీవితాల్లో మార్పు తప్పకుండా వస్తుందని విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన స్నేహితుడు తరుణ్ భాస్కర్ సినిమా ‘కీడ కోలా’ (Keeda Cola) ప్రమోషన్ కార్యక్రమంలో చెప్పాడు. తాము కూడా మధ్యతరగతి (Middle Class) నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి.. తమలాగే ఎంతోమంది మధ్య తరగతిలో ఉండి మంచి విజయం సాధించి, అనుకున్న ఉన్నత స్థాయిలకు తప్పకుండా ఎదుగుతారని మాట్లాడాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).

సంక్రాంతి బరిలో విజయ్ సినిమా..: 

దర్శకుడు పరశురామ్‌- విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కొంబోలో వచ్చిన గీతా గోవిందం సినిమా (Cinema) ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తన తదుపరి చిత్రం ఫ్యామిలీ స్టార్ (Family Star)‌ చిత్రంతో మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతోంది. టీజర్ (Teaser) ప్రకారం మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కామెడీ హింట్‌తో వచ్చేస్తున్న యాక్షన్-డ్రామా చిత్రం తప్పకుండా సక్సెస్ అందిస్తుందని భావిస్తున్నారు చిత్ర బృందం. 

అయితే మొదట టీజర్ (Teaser) లోనే తన యాక్షన్ స్టైల్ ని బయటపెట్టాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఒక ఫ్యామిలీ మెన్ ఫైట్ చేయకూడదా? అంటూ తనని చుట్టుముట్టిన గుండాలను ఎదిరించి, కొట్టడం మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రత్యేకంగా తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను ఏవండీ అని పిలవడంతో, చిత్రంలో తప్పకుండా వీరిద్దరూ భార్యాభర్తలు అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఊహిస్తున్నారు. అయితే ఈ ప్రత్యేకమైన సినిమా (Cinema) సంక్రాంతి (Sankranti) రోజున అందరి ముందుకు వచ్చి అలరించబోతోంది.