సమంతతో స్టేజ్ మీదే రెచ్చిపోయిన విజయ్

యంగ్ హీరో, టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న రీసెంట్ మూవీ ఖుషి. శివనిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కుందనపు బొమ్మ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ దేవరకొండ గత మూవీ  లైగర్ నిరాశపర్చడంతో ఇప్పుడు వచ్చే మూవీ ఎలా ఉంటుందో అని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ మూవీని ప్రేమ కథా చిత్రాల డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్ట్ చేయడంతో ఈ మూవీపై అభిమానులు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ […]

Share:

యంగ్ హీరో, టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న రీసెంట్ మూవీ ఖుషి. శివనిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కుందనపు బొమ్మ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ దేవరకొండ గత మూవీ  లైగర్ నిరాశపర్చడంతో ఇప్పుడు వచ్చే మూవీ ఎలా ఉంటుందో అని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ మూవీని ప్రేమ కథా చిత్రాల డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్ట్ చేయడంతో ఈ మూవీపై అభిమానులు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ మూవీ రౌడీ కి మరో హిట్ పక్కాగా అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

మొత్తం రొమాంటిక్ మూడ్ లోనే 

ఈ మూవీ మ్యూజిక్ కాన్సర్ట్ ను ఇటీవలే హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ మూవీ కాన్సర్ట్ కు చాలా మంది గెస్టులుగా వచ్చారు. వారందరికీ ట్రీట్ ఇస్తూ విజయ్, సమంత స్టేజ్ మీద చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక అంతే కాకుండా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ మూవీ హిట్ పక్కా అని అంతా కామెంట్ చేస్తున్నారు. 

ఆల్బమ్ లో అన్నీ హిట్లే.. 

శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి మూవీకి హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఒక్కొక్కటిగా రిలీజ్ అయిన ఈ మూవీ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో కూడా డైరెక్ట్ శివ నిర్వాణ ఓ సాంగ్ తనే రచించాడు. శివ నిర్వాణ తన చివరి మూవీ టక్ జగదీష్ లో కూడా ఓ సాంగ్ ను రచించాడు. ఇక ఈ ఖుషి మూవీలో కూడా అతడు ఓ మెలోడీని రచించాడు. అతడు రచించిన పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ సాంగ్స్ తో పాటు రిలీజైన ట్రయలర్స్ అన్ని వీడియోలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

స్టేజ్ పైన రెచ్చిపోయిన విజయ్ సమంత

ఇటీవల నిర్వహించిన ఈ మూవీ మ్యూజిక్ కాన్సర్ట్ లో చిత్ర హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత రూత్ ప్రభు స్టేజ్ మీదే ఆడిపాడారు. వీరి రొమాన్స్ చూసిన పలువురు ప్రేక్షకులు వీరి కెమిస్ట్రీ  స్టేజ్ మీదే ఇంత బాగుంటే.. ఇక మూవీలో ఎలా ఉంటుందని అంతా కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ రషెస్ చూసిన చిత్ర యూనిట్ మూవీ హిట్ మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ లో సామ్ మాట్లాడుతూ.. మీరు ఈ పాటలను ఆస్వాదిస్తూ ఈ రోజును మాకు ప్రత్యేకమైన రోజుగా మార్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. తప్పకుండా మీ అందర్నీ ఈ మూవీతో ప్రత్యేకంగా అలరిస్తామని సామ్ పేర్కొంది. మీ లాంటి అభిమానులతో కలిసి ఈ మూవీని చూడాలని తాను ఆశిస్తున్నట్లు సామ్ తెలిపారు. 

మైత్రీకి ధన్యవాదాలు.. 

ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ వారికి సమంత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ఈ మూవీ చేస్తున్న సమయంలోనే తాను అనారోగ్యానికి గురయ్యానని తెలిపింది. నా ప్రేమను గురించి తెలియజేసేందుకు మాటలు లేవని తెలిపింది, ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నేను ఇంత వరకు ఇటువంటి మూవీ చేయలేదని తెలిపారు. ఇన్నాళ్లకు ఇటువంటి మూవీ చేసే అవకాశం వచ్చిందని విజయ్ పేర్కొన్నారు. ఈ మూవీ తప్పకుండా హిట్ అవుతుందని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.