ఓటిటిలోకి వచ్చేస్తున్న ఖుషి సినిమా

విజయ్ దేవరకొండ సమంత రూత్ ప్రభు జంటగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన యాక్షన్, థ్రిల్లర్ మూవీస్ కి భిన్నంగా వచ్చిన రొమాంటిక్  ఖుషి సినిమా ఆడియన్స్ను ఎంతగానో అలరించింది. అయితే ఇప్పుడు మన మొబైల్లో, టీవీల్లో ప్రత్యక్షంగా చూసేందుకు OTT(ఓటిటి)లో ఖుషి సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. మరి ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కానుందో తెలుసుకుందామా..  OTT(ఓటిటి)లో […]

Share:

విజయ్ దేవరకొండ సమంత రూత్ ప్రభు జంటగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన యాక్షన్, థ్రిల్లర్ మూవీస్ కి భిన్నంగా వచ్చిన రొమాంటిక్  ఖుషి సినిమా ఆడియన్స్ను ఎంతగానో అలరించింది. అయితే ఇప్పుడు మన మొబైల్లో, టీవీల్లో ప్రత్యక్షంగా చూసేందుకు OTT(ఓటిటి)లో ఖుషి సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. మరి ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కానుందో తెలుసుకుందామా.. 

OTT(ఓటిటి)లో ఖుషి సినిమా రిలీజ్: 

థియేటర్స్ లో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఖుషి సినిమా ఇప్పుడు ఓటిటిలో ప్రసారం కానుంది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యేందుకు డేట్ ఫిక్స్ అయింది. అయితే ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఖుషి సినిమా అక్టోబర్ 1న రిలీజ్ అవ్వబోతోందని, తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఖుషి సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. కరెక్ట్ గా నెల రోజుల క్రితం రిలీజ్ అయిన ఖుషి సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో సందడి చేయబోతోంది. 

ఖుషి సినిమా గురించి మరింత: 

ఖుషి విడుదలకు ముందు, సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ సందర్భంగా, విజయ్ దేవరకొండ  ఖుషి సినిమా గురించి మరియు అది సాధారణ ప్రేక్షకులకు ఎందుకు కనెక్ట్ అవుతుందనే దాని గురించి చాలా బాగా చెప్పడం జరిగింది.  సచిన్ ఖేడేకర్, శరణ్య పొన్వన్నన్, జయరామ్, అలీ, రోహిణి మరియు మురళీ శర్మ కూడా ఖుషి సినిమా లో అలరించారు. 

ఆదరణ దక్కించుకున్న ఖుషి సాంగ్: 

ఖుషి సినిమా నుండి నా రోజు నువ్వే అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ పెద్ద హిట్ అయింది. సాంగ్ ఒక నెల రోజుల నుంచి బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ మధ్య దశలో ఉన్నప్పుడే ఈ సాంగ్ రిలీజ్ అయింది. అయితే షూటింగ్ సమయంలో కొన్ని ఫోటోలు వీడియోస్ అనేవి లీక్ అవ్వడం కూడా జరిగింది. లీకైన ఫోటోలలో సమంత విజయ్ దేవరకొండ తో కలిసి ఉంది. ఈ వీడియోలో సమంత విజయ్ దేవరకొండ నమస్తే అని చెప్పడం కనిపిస్తుంది. అందరు స్కూల్ గర్ల్స్ తో సమంత వీడియో కూడా తీసుకుంది. ఇక ఖుషి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అందుకుంది. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో ఇది రెండవ సినిమా. ఇంతకుముందు వీళ్లిద్దరు మహానటి లో కలిసి నటించారు. ఇది కాకుండా సమంత సిటాడిల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. ఇది ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ సిటాడిల్ కి ఇండియన్ వెర్షన్. ఇందులో సమంతకు జోడిగా వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. దీన్ని ఫ్యామిలీ మ్యాన్ తీసిన రాజ్ అండ్ డీకేనే తీస్తున్నారు. 

సమంత సినీ కెరీర్: 

నాగచైతన్యతో కలిసి నటించిన ఏ మాయ చేసావే సమంత తొలి చిత్రం. తొలి చిత్రంతోనే సమంత కి భారీగా ఫ్యాన్స్ పెరిగారు. సినిమా సినిమాకు సమంత రేంజ్ పెరుగుతూ పోయింది. ఓ దశలో సమంత ఏ సినిమా చేస్తే అది హిట్ అని రేంజ్కి తను ఎదిగిపోయింది. తన సినీ కెరీర్ బాగున్నా వ్యక్తిగతంగా తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. కథానాయకుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్ని రోజులకే విడాకులు ఇచ్చింది. తర్వాత మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఈ మధ్యే తను ఈ వ్యాధి నుండి కోలుకుంది. సమంత గత సినిమాలు యశోద, శకుంతలం బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించాయి. ఖుషి సినిమా సమంతకు మంచి హిట్ అందించింది.